మంత్రి కేటీఆర్ ధారణశక్తి – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంత్రి కేటీఆర్ ధారణశక్తి – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2017, శనివారం

మంత్రి కేటీఆర్ ధారణశక్తి – భండారు శ్రీనివాసరావు


తెలంగాణా మునిసిపల్ వ్యవహారాలు, ఐ.టీ. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బీబీసి తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు ముప్పయి నిమిషాల పాటు సాగింది. బీబీసి తరహాలోనే విలేకరుల బృందం ప్రశ్నలు సంధించింది. వాటికి కేటీఆర్ తనదయిన శైలిలో తడబాటు లేకుండా సమాధానాలు ఇచ్చారు. ఇందులో వింతేమీ లేదు. కాకపోతే చివర్లో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎప్పుడో ఏడాది క్రితం నేను ఫేస్ బుక్ లో రాసిన ఒక కధనాన్ని నా పేరుతొ సహా (ముమ్మారు) ప్రస్తావించడం నన్ను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఇంటర్వ్యూ ను చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ కరస్పాండెంట్, మిత్రుడు సుశీల్ రావు ఆ సంగతి నాకు తెలియచేశారు. ఢిల్లీలో బీబీసీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న మరో మిత్రుడు శ్రీధర్ బాబు సంబంధిత లింక్ నాకు పంపారు. వారిద్దరికీ నా కృతజ్ఞతలు. కేటీఆర్ ధారణశక్తికి నమోవాకాలు.