ఆయన ఎన్నో పత్రికలకి పురుడు పోశారు. కానీ మంత్రసాని పాత్రకే ఆయన్ని పరిమితం చేసారు యజమానులు. పురుడు పోసిన పత్రికలు ఆకాశానికి ఎదిగాయి. కానీ ఆయన మాత్రం నేల మీద తన కాళ్లపై తాను నిలబడే వున్నారు. ఏదన్నా నష్టపోతే ఆ పత్రికలే. ఆయన కాదు.
ఈరోజు తొంభయ్యవ పడిలో అడుగిడుతున్న ఏబీకే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు - భండారు శ్రీనివాసరావు