తెలుగు టీవీ విశ్లేషకుల తీరుతెన్నులు
దాదాపు అన్ని తెలుగు టీవీ చానళ్ళు, దూరదర్శన్
సప్తగిరితో సహా ఉదయం వేళల్లో వార్తలు, వాటిపై వ్యాఖ్యలు వివిధ శీర్షికలతో
ప్రసారం చేస్తున్నాయి. వీటిల్లో పాల్గొనే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా పార్టీల
అభిప్రాయాలనే బల్ల గుద్ది వాదిస్తుంటారు. పోతే విశ్లేషకులు (నన్ను కూడా కలుపుకుని) వ్యక్తం చేసే అభిప్రాయాలపై ఈ మధ్య ఒకాయన చేసిన వ్యాఖ్యానం
సబబుగా అనిపించి అందరితో పంచుకోవాలని అనిపించింది.
ఆయన అన్నది ఏమిటంటే-
చర్చిస్తున్న అంశం –
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నడుమ అయితే వైయస్సార్
సీ పీ ని సమర్ధిస్తారు.
కాంగ్రెస్, టీడీపీ మధ్య అయితే కాంగ్రెస్ కొమ్ము
కాస్తారు.
మళ్ళీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని సమర్ధించేవాళ్ళు
పీసీసీ అధ్యక్షుడిని విమర్శిస్తారు. పీసీసీ అధినేతను సమర్ధించే వాళ్ళు ముఖ్యమంత్రి తీరును తప్పుబడతారు.
చర్చనీయాంశం టీడీపీ, వైయస్సార్ సీపీ మధ్య అయితే
టీడీపీ పల్లవి ఎత్తుకుంటారు.
టీడీపీ, టీ ఆర్ యస్ నడుమ అయితే టీ ఆర్ యస్ ను
సమర్ధిస్తారు.
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ల మధ్య అయితే వామపక్షాలను
భుజానికెత్తుకుంటారు.
సీపీయం, సీపీఐ మధ్య వివాదమయితే సీపీయం కు
మద్దతిస్తారు,
అంతేకాదు, పార్టీ పార్టీని బట్టి, చర్చలో పాల్గొంటున్న
పార్టీల నాయకులను బట్టి, ఛానల్ ఛానల్ ను బట్టి కూడా విశ్లేషకుల తీరుతెన్నులు,
హావభావాలు మారిపోతుంటాయి (ట).
(ప్రత్యక్ష ప్రసారాలు
కాబట్టి, ఆ కారణంగా ఎవరిదివారు గమనించి
సరిదిద్దుకునే వీలు సాళ్ళు వుండవు కాబట్టీ తత్కారణం చూపి తప్పించుకోకుండా ఒకసారి
ఆత్మ పరిశీలన చేసుకోవడం ఉత్తమమేమో అని నాకనిపించింది.)NOTE: Image credit goes to the CARTOONIST