చుక్కల్ని దాటుకు వెళ్ళిన భారత రోదసీ ప్రతిభ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చుక్కల్ని దాటుకు వెళ్ళిన భారత రోదసీ ప్రతిభ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2014, బుధవారం

చుక్కల్ని దాటుకు వెళ్ళిన భారత రోదసీ ప్రతిభ


"గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం ఆరుద్ర రచించిన గీతం మళ్ళీ స్పురణకు వస్తోంది.
'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే రీతిలో సాగిపోయే పాట ఇది.



సరిగ్గా ఇదే చేసిచూపారు భారత రోదసీ సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు. ఇంతవరకు ఏ దేశానికీ సాధ్యం కాని పనిచేసి చూపెట్టారు. పది నెలలుగా రోదసిలో ప్రయాణిస్తున్న  భారతీయ ఉపగ్రహాన్ని, కోట్ల కిలోమీటర్ల దూరంలో  అంగారకుడి కక్ష్యలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టి, సంక్లిష్ట రోదసీ పరిశోధనల్లో మనదేశం  ఎవరికీ తీసికట్టు కాదని సగర్వంగా నిరూపించారు.

భారతీయులందరూ  మనః పూర్వకంగా సగౌరవంగా ఇస్రో శాస్త్రవేత్తలకు 'సాల్యూట్' చేయాల్సిన  శుభ సందర్భం ఇది.

NOTE: COURTESY IMAGE OWNER