'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు' లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు' లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2014, సోమవారం

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు'

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు' అంటూ ఆయన సోదరుడు  కృష్ణ పంపిన ఎస్ ఎం ఎస్ తో ఈరోజు మొదలయింది. కానీ ఆయన సుస్తీగా వున్నప్పుడు 'బాపూ' గారు ఆయనకు రాసిన ఉత్తరం చదివిన తరువాత శేఖర్ గారికి మరణం లేదనిపించింది.సాక్షాత్తు  'బాపూ' గారే, శేఖర్ గారికి  'వీరాభిమానిని' అని చెప్పుకోవడమే కాదు,  అక్షరాలా రాసిచ్చిన తరువాత శేఖర్ గారికి నిజంగా మరణం లేదు. ఆయన ఎప్పటికీ చిరంజీవే. సందేహం లేదు.