‘ఇరవై మూడేళ్ళ క్రితం మాస్కో నుంచి
తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో నా మునుపటి ఉద్యోగం- విలేకరిత్వం – (దుష్ట సమాసం
కాదుకదా!) లోనే చేరాను. మిగిలిన సహోద్యోగులందరూ పాతవాళ్ళే. ఒక్క స్టెనో మాత్రం కొత్తమ్మాయి. మొత్తం యూనిట్ లో
చిన్నపిల్ల. అక్కడ పనిచేసే మా అందరికీ ఒక చిట్టి చెల్లెలు మాదిరి. క్లుప్తంగా
చెప్పాలంటే ప్రతి తల్లీ, తండ్రీ ఇలాటి అమ్మాయి వుంటే బాగుండు అనుకుంటారు. ప్రతి
అత్తామామా ఇలాటి కోడలు పిల్ల వుంటే యెంత బాగుంటుందని శైలజను చూడగానే అనుకుంటారు.
కానీ అందరికీ అలాటి అదృష్టం వుండదు కదా! అది శైలజ తలితండ్రులకి, శైలజను పెళ్ళాడిన
రంగాచారి గారి కన్నవారికీ దక్కింది. నేను
రేడియో విడిచిపెట్టి పుష్కర కాలం గడిచిపోయింది. అయినా శైలజ నా పట్ల, మా ఆవిడ పట్ల చూపించే
అభిమానంలో ఇసుమంత తేడా లేదు. పిల్లలు బాగా ఎదిగివచ్చారు. పెద్దవాడు ఫస్ట్ క్లాస్ బీ టెక్. అమ్మాయి కూడా ఇంజినీరింగు
రెండో ఏడాది. తను కూడా ఎం.ఫిల్. చేసిందట. భర్త రంగాచారి గారు, సచివాలయంలో ఒక మంచి ఉద్యోగి ఎలా ఉంటాడు
అన్నదానికి నిదర్శనంగా వుంటున్నారు. నిన్న ఎటో వెడుతూ కాసేపు రేడియో స్టేషన్ లో
ఆగితే, శైలజ పట్టుబట్టి మా ఆవిడతో దిగిన ఫోటో. నిజానికి రేడియో స్టేషన్ ఆవరణలో
ఫోటోగ్రఫీ నిషేధం. అయినా ఆ అమ్మాయి అభిమానం ముందు నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి