29, ఏప్రిల్ 2019, సోమవారం
Did Really Parties Can Manage Counting Results in AP? | The Debate With ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV News Channel Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రాజశేఖరరెడ్డి (వైసీపీ), శ్రీ భాను ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శ్రీ చెరువు రామకోటయ్య (టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్)
Did AP CM Chandrababu Naidu try to Stop RGV Lakshmi's NTR Movie In AP? |...
రాజశేఖరరెడ్డి (వైసీపీ), శ్రీ భాను ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శ్రీ చెరువు
రామకోటయ్య (టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్)
28, ఏప్రిల్ 2019, ఆదివారం
చంద్రబాబు టార్గెట్ గా ఐదేళ్ల తవ్వకాలు? | News Scan LIVE Debate With Vij...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ 5 ఛానల్లో ఎక్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ నారాయణ్ నిర్వహించిన న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో చెప్పిన మాట:
“ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మబ్బులు కమ్మేశాయి. వాటి చాటున దాగున్న రాజకీయ చిత్రం అస్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశంలోమబ్బుల్లోకి చూస్తే వాటిలో ఒకరికి ఏనుగు ఆకారం కనిపిస్తుంది. మరికొందరికి అదే మబ్బులో మరో ఆకారం కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరికించేవారికి కూడా విభిన్నమైన చిత్రాలు కనబడుతున్నాయి. రాజకీయపు పొరలు తొలగించుకుని చూస్తే వాస్తవమైన రాజకీయ చిత్రం గోచరిస్తుంది”
ఈచర్చలో నాతోపాటు శ్రీ కుటుంబరావు (టీడీపీ, అమరావతి నుంచి), శ్రీ రఘురాం (ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో) పాల్గొన్నారు.
మహాభారతంలో కూటనీతి
పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన
సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి వున్నాయి. అయితే, అతడి దురదృష్టం, అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి వినాశనానికి హేతువు అయింది.
దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ
యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి పంచపాండవులను
హతమార్చాలనే పన్నాగం బెడిసి కొట్టడంతో దుర్యోధనుడిలోని అసూయాద్వేషాలకు అంతం
లేకుండా పోయింది.
ఈ నేపధ్యంలో కౌరవ సలహాదారులలో ఒకడయిన
కణికుడు దుర్యోధనుడికి ఇచ్చిన సలహాలు కూటనీతి పేరిట ప్రాచుర్యం పొందాయి.
ప్రత్యర్ధుల పీచమణచడానికి ఉద్దేశించిన ఈ కుటిల పన్నాగాలకు సంబంధించి మహాభారతంలో ఏకంగా ఒక అధ్యాయమే వుంది.
కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ఈనాటి రాజకీయులు కణికుడు బోధించిన ఆ కూటనీతినే
పాటిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆ కూటనీతి ప్రకారం రాజు అనేవాడు శత్రురాజుపై
హమేషా ఓ కన్నేసి ఉంచాలి. తనకు నమ్మకస్తులైన సాటి రాజులను వైరి రాజుకు అనుకూలంగా
మాట్లాడేటట్టు చేయాలి.
దేశ సంచారం చేసే కొంతమంది పండిత
శ్రేష్టులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇరుగుపొరుగు రాజ్యాల్లో తన మంచితనం
గురించి, తన సామర్ధ్యం గురించి తన సుపరిపాలన గురించి సానుకూల ప్రచారం ప్రజాబాహుల్యంలోకి
చొచ్చుకు పోయేలా చేయాలి.
విశ్వాసపాత్రులయిన తన సొంత మనుషులను కొంతకాలంపాటు శత్రు దేశపు రాజు కొలువులో చేర్పించి
వారి ద్వారా అతడి లోగుట్లను, బలహీనతలను గురించిన సమాచారం తనకు ఎప్పటికప్పుడు
అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు వైరి ప్రభువుల ఎదుట తనను తూలనాడుతూ ఆ రాజు నమ్మకాన్ని
చూరగొనేలా చూసుకోవాలి.
ఇలా అనేకానేక బోధలు ఈ కూటనీతిలో
వున్నాయి.
అవన్నీ ఆ గాంధారిసుతుడు ఎన్ని ఏమేరకు
ఆచరించాడో లేదో తెలియదు కానీ మహాభారతంలో పేర్కొన్న ఆ కూటనీతి శాస్త్రాన్ని ఈనాటి
రాజకీయ నాయకులు పుణికి పుచ్చుకుని అక్షరం పొల్లు పోకుండా ఆచరణలో పెడుతున్నారు.
‘ఎందుకైనా మంచిది అతడిపై ఓ కన్నేసి
ఉంచు’ అంటుంది సినిమాలో ఓ దుష్ట పాత్ర. ‘ఒక కన్నేమిటి రెండు కళ్ళూ అతడిమీదనే’
అంటుంది అతడి సహాయక దుష్టపాత్ర.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా
వున్నప్పుడు అసెంబ్లీ లాబీ విశేషాలు సేకరించే విలేకరులు కొందరు లాబీలో ఒక చోట చేరి
ఆ వైపుగా వచ్చిన ఒక మంత్రితో పిచ్చాపాటీ మాటలు కలిపారు. మూడు దశాబ్దాల అనుభవం వున్న
ఓ సీనియర్ పాత్రికేయుడు హాస్యోక్తిగా ఆయనపై ఓ వాక్బాణం విసిరి అందరూ పెద్దగా
నవ్వుతుండగా మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో వున్న ముఖ్యమంత్రి చాంబర్లోకి వెళ్ళాడు.
అతడ్ని చూస్తూనే ముఖ్యమంత్రి ఒక చిరునవ్వు
నవ్వి, ‘ఏమిటి మా మంత్రిని అలా ఆట
పట్టిస్తున్నావ్’ అని అడిగారు. జరిగి నిమిషాలు కూడా గడవక ముందే ఈ విషయం సిఎం చెవులకు ఎవరు చేరవేసారా
అని ఆశ్చర్య పోవడం ఆ విలేకరి వంతయింది.
అలా పనిచేస్తాయి ప్రభుత్వ నిఘా
వర్గాలు. టెర్రరిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలు కనిపెట్టి వారి ఆనుపానులు సంబంధిత
అధికార వర్గాలకు అందచేయడం వారి ప్రాధమిక బాధ్యత. కానీ వాళ్ళు ఎక్కువగా దృష్టి
సారించేది ప్రత్యర్ధి పార్టీల నాయకుల మీద. నిఘా విభాగంలో పనిచేసిన అధికారే మరో
విశేషం ఓ సందర్భంలో చెప్పారు. తన సొంత పార్టీ
నాయకుల గురించిన సమాచారం మీదే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఆసక్తి చూపేవారట.
అలా మహాభారత కాలంనాటి ఆ కూటనీతి ఈ
కాలంలో ఇలావూడలు దిగి విస్తరిస్తోంది.
ఏపీ - వింత పుంతల రాజకీయం
అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది?
ఈ నెల పదకొండో తేదీన ఎన్నికలు జరిగాయి.
సీళ్లు వేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎం లలో ఓటర్ల తీర్పు భద్రంగా వుంది.
ఆ రోజు నుంచి నలభయ్ నాలుగో రోజున అంటే వచ్చే నెల ఇరవై మూడో తేదీన వాటిని వెలుపలకు
తీసి ఓట్లు లెక్కించి ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు.
ఇదీ జరగాల్సిన విధి విధానం. కానీ
జరుగుతున్నది ఏమిటి?
పోలింగ్ పూర్వపు రాజకీయ వాతావరణమే పోలింగ్
అనంతరం కూడా కొనసాగుతోంది. అసలక్కడ ఎన్నికలు జరిగాయా లేక ముందు ముందు జరగబోతున్నాయా
అనే రీతిలో ఆయా రాజకీయ పార్టీల ఉపన్యాసాలు, వ్యాఖ్యలు, విమర్శలు ఆరోపణలు
అవిచ్చిన్నంగా సాగిపోతున్నాయి. న్యాయమూర్తి
తన తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించిన తరువాత కూడా న్యాయవాదులు తమ
వాదప్రతివాదాలు కొనసాగిస్తున్న పద్దతిలో ప్రజాతీర్పు ఖరారు ఆయన తర్వాత సైతం ప్రజల
తీర్పును కోరే రీతిలో రాజకీయ పార్టీల మాటలు, చేతలు సాగుతున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు
సవ్యంగా జరగలేదని ఆరోపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఎన్నికల
ఏర్పాట్ల పట్ల సహజంగా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఆ విషయంలో
నోరు మెదపక పోవడం కూడా బహుశా ఇదే మొదటిసారేమో!
ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు
అధికారులను ఆ స్థానాల నుంచి తాత్కాలికంగా తప్పించడం మొదటిసారి కాదు. గతంలో డీజీపీలను
మార్చిన సందర్భాలు వున్నాయి. ఈసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేతాను పక్కన
బెట్టి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వీ. సుబ్రహ్మణ్యం ను ఆస్థానంలో నియమించడం వివాదాస్పదం అయి కూర్చుంది.
నీతి నిజాయితీ, నిబద్ధతల విషయంలో ఈ ఇద్దరు అధికారులు ఎవరికీ తీసిపోరు. కానీ కొత్త సీఎస్
తమ ప్రభుత్వానికి అనుకూలుడు కారు అనే అనుమానం పాలకపక్షం టీడీపీ నాయకుల్లో వుంది.
స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఈ
విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆ అధికారిని అనకూడని మాట అన్నారు. అధికారులతో పేచీ
పెట్టుకోవడం చంద్రబాబు స్వభావం కాదని
ఆయన్ని బాగా ఎరిగిన వాళ్ళు చెబుతారు. ఏదో నోరు జారింది అనుకోవడానికి వీల్లేకుండా
ఆయన ఆ వ్యాఖ్యను పదేపదే పునరుద్ఘాటిస్తూ పోతున్నారు.ఇక టీడీపీ పార్టీ నాయకుల సంగతి
చెప్పేది ఏముంది? నాయకుడే ఆ వ్యాఖ్యను సమర్దిస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? మరో
రెండు సమిధలు వేసి ఆ వివాదాగ్ని చల్లారకుండా చూస్తున్నారు.
అటూ ఇటూ రాజకీయమే అయినప్పుడు వివాదాలు
పెరుగుతూ పోతాయే కాని అవి సమసిపోయే సమస్యే వుండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు
పరిష్కారం కంటే వివాదం కొనసాగింపునే ఎక్కువగా కోరుకుంటాయి.
ఈ క్రమంలో వెలుగులోకి వచ్చినవే వీవీ
పాట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూముల భద్రత, మరి కొందరు అధికారులను మార్చాలనే
డిమాండ్లు. మామూలుగా అయితే ఇవి పెద్ద వివాదాంశాలు కాదు. వీవీ పాట్ల విషయంలో
సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశమే వుంది. స్ట్రాంగ్ రూముల భద్రత పట్ల సందేహాలు
సహేతుకమనిపించుకోవు. ఈవిషయంలో ఏవైనా అనుమానాలు వుంటే అవి ప్రతిపక్షాలకు వుండాలి.
విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్తితి భిన్నంగా వుంది. అక్కడ పాలకపక్షం అయిన
టీడీపీ వీటిని వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతిపక్షం, కేంద్రంలోని మోడీ
ప్రభుత్వం కలిసి కేంద్ర ఎన్నికల సంఘంపై
ఒత్తిడి తెచ్చి తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టే క్రమంలో ఈ
సందేహాలు వ్యక్తం చేస్తున్నామన్నది ఆ పార్టీ వాదనగా వుంది.
ఈ సారి ఎన్నికల కోడ్ అమల్లో వుండే సమయం
ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘంగా ఉన్నమాట వాస్తవమే. దాదాపు మండలం పాటు పాలక పక్షం కానీ,
మంత్రులు ముఖ్యమంత్రి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదనే నియమాన్ని సాంప్రదాయంగా
పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇంత సుదీర్ఘ కాలం సమీక్షలు, నిర్ణయాలు తీసుకోలేని
పరిస్తితిని ఏ మేరకు అనుమతించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాల పరిమితి
ముగియనప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోకుండా వుండడం సాధ్యమయ్యే
విషయమేనా అన్నది పాలకపక్షానికి వస్తున్న ధర్మసందేహం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు అసలు అన్ని అధికారాలు కలిగిన ముఖ్యమంత్రా లేక ఆపద్ధర్మ
ముఖ్యమంత్రా అనే చర్చ కూడా మొదలయింది. రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా
పేర్కొనేందుకు అవకాశం లేదు. సరే!మరి ఆయన
పూర్వం మాదిరిగా అంటే కోడ్ అమల్లోకి రాక ముందు మాదిరిగా అన్ని నిర్ణయాలు
తీసుకోవడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం సరైనదేనా అంటే చప్పున కాదని జవాబు
చెప్పే పరిస్తితి లేదు.
ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ
ముఖ్యమంత్రి కాని మాట వాస్తవమే కాని ఆయన కానీ ఆ మాటకు ఏ ముఖ్యమంత్రి అయినా సరే
పాటించాల్సిన ధర్మం ఒకటుంది. ఈ ధర్మాలు నిబంధనావళిలో వుండవు. పాలకులు ఎవరికి వారు
ధర్మనిష్టతో పాటించాల్సిన ధర్మాలు కొన్ని వుంటాయి. పోలింగు పూర్తయి, ప్రజాతీర్పు వెలువడక పూర్వం,
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వున్న సమయంలో ఏ మేరకు సమీక్షలు చేయవచ్చు, ఏ మేరకు నిర్ణయాలు
తీసుకోవచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది వారికి వారే నిర్ణయించుకోవాలని
ధర్మం చెబుతుంది. అది పాటించినంత కాలం ఎవరూ ఆ నిర్ణయాలను తప్పుపట్టే పరిస్తితి ఏర్పడదు.
సుదీర్ఘ పాలనానుభవం కలిగిన చంద్రబాబునాయుడికి ఎన్నికల నిబంధనలు ఏమి చెబుతున్నాయో తెలియవని అనుకోలేం. బహుశా ఈ
ఎరుక కలిగిన మనిషి కనుకనే ముందుగా ప్రకటించిన లేదా మీడియాలో వచ్చిన శాంతిభద్రతల
వంటి కొన్ని సమీక్షలను రద్దు చేసుకున్నారని కూడా అనుకోవాలి.
అయితే రాజకీయ నాయకులు కొందరికి సర్వం
తెలిసినా రాజకీయాల కోసం కొన్ని మాటలు చెప్పక తప్పదు. అందుకే ఆయన కానీ, ఆయన సహచరులు
కానీ ఈ సమీక్షల విషయాన్ని ఒక పెద్ద అంశంగా మార్చి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారేమో!
ముందే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు బాగాలేవనే చెప్పాలి. అధికారంలోకి రావడం ఎలా, వచ్చిన
అధికారాన్ని మరో మారు దక్కించుకోవడం ఎలా అనే రాజకీయ శక్తుల నడుమ సాగుతున్న పోరాటంలో విలువలు
వెనక్కి పోయాయి. ధర్మబద్ధంగా విజయాన్ని కైవసం చేసుకోవడం అనేదాన్ని పక్కన బెట్టి ఏ విధంగానయినా సరే గెలిచి తీరాలి అనే పట్టుదలలు,
పంతాలు పెరిగిపోవడం వల్లనే ఇన్ని రకాల రాజకీయపుటెత్తులు, వ్యూహాలు, ప్రతి
వ్యూహాలు. పన్నుగడలు, పన్నాగాలు.
ఇది అవసరమా అంటే, మీకూ నాకూ
కాకపోవచ్చు, కానీ రాజకీయులకు అవసరమే!
లేబుళ్లు:
ఏపీ - వింత పుంతల రాజకీయం
27, ఏప్రిల్ 2019, శనివారం
Discussion | Chandrababu Writes Letter To EC Over Restrictions in AP | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఆంద్ర జ్యోతి పబ్లిక్ పాయింట్ చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ తో నేను.
Discussion | Chandrababu Writes Letter To EC Over Restrictions in AP | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఆంద్ర జ్యోతి పబ్లిక్ పాయింట్ చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ తో నేను.
Time To Ask Live Discussion On Chandrababu Naidu's Letter To CEC || బాబు...
శుక్రవారం రాత్రి భారత్ టుడే న్యూస్ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన Time To Ask Live Discussion చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామచంద్రారెడ్డి (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ రామకోటయ్య (టీడీపీ )
26, ఏప్రిల్ 2019, శుక్రవారం
The Fourth Estate | YSRCP Leaders Phone Tapping By Chandrababu Govt |- 2...
ప్రతి గురువారం మాదిరిగానే సాక్షి టీవీ దేవులపల్లి అమర్ సమర్పించే ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ఆంజనేయ రెడ్డి (బీజేపీ), శ్రీ జి. వెంకట రెడ్డి (కాంగ్రెస్), శ్రీ పొన్నవోలు సుధాకర రెడ్డి (వై.ఎస్. ఆర్. సీ.పీ.)
25, ఏప్రిల్ 2019, గురువారం
News Talk |Special Discussion With Senior Journalist Bhandaru Srinivas R...
ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం స్నేహ టీవీ న్యూస్ టాక్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ స్వర్ణ .
21, ఏప్రిల్ 2019, ఆదివారం
LIVE: కోడ్ కూస్తూనే ఉండాలా! | News Scan Live Debate With Vijay | TV5 News
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 ఛానల్ News Scan LIVE Debate With Vijay చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు :శ్రీ కఠారి శ్రీనివాస్ (విశ్లేషకులు), శ్రీ షఫీ (విశ్లేషకులు)
20, ఏప్రిల్ 2019, శనివారం
Discussion | Huge Bettings in AP and Telangana Over AP Elections 2019 Re...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy ఛానల్ Public Point కార్యక్రమంలో యాంకర్ పవన్ తో వర్తమాన రాజకీయాల తీరుతెన్నులపై ముఖాముఖి చర్చ
19, ఏప్రిల్ 2019, శుక్రవారం
మోడీ,జగన్ & కేసీఆర్ వీళ్ళెవ్వరు నా సమీక్షలను ఆపలేరు : చంద్రబాబు | Hot To...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ విజయ కుమార్ (టీడీపీ), శ్రీ శ్రీనివాసరెడ్డి (టీఆర్ ఎస్), శ్రీమతి సునీతా రెడ్డి (బీజేపీ), శ్రీ విజయలక్ష్మి (వైసీపీ)
18, ఏప్రిల్ 2019, గురువారం
News Talk |Special Discussion With Senior Journalist Bhandaru Srinivas R...
ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం స్నేహ టీవీ న్యూస్ టాక్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ లావణ్య
16, ఏప్రిల్ 2019, మంగళవారం
KSR Live Show: Chandrababu strategy On EVMs | గెలిస్తే భేష్..లేదంటే ట్రా...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీనివాస యాదవ్ (టీ. ఆర్.ఎస్.), శ్రీ నాగార్జున యాదవ్ (వైసీపీ), శ్రీ అంబటి రామకృష్ణ ( ఏపీ కాంగ్రెస్), శ్రీ లక్ష్మీపతి రాజా (బీజేపీ)
ఎందుకు రాశాను? – భండారు శ్రీనివాసరావు
(Published in
SURYA today, Tuesday, 16-04-2019)
ఒక
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆ పుస్తకం రాసిన పెద్దమనిషి చెప్పిన సంగతులు ఇవి.
గ్రంధరచయిత
ప్రసంగం ఇలా సాగింది. (ఇలానే అని కాదు, విన్న సంగతులు కాబట్టి కాస్త అటూ ఇటూగా)
“ఈ
పుస్తకం రాయడానికి నాకు చాలా కారణాలు వున్నాయి.
“విసుగూ
విరామం లేని ఉద్యోగం చేసి రిటైర్ అయి ఖాళీగా వున్నాను. మరీ అలా ఏ వ్యాపకం లేకుండా
ఉండిపోతే ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మొహం మొత్తుతుంది. మరి ఏం చేయాలి కాలక్షేపానికి
అనుకుంటూ వుంటే ఓ పెద్దమనిషి తారసపడి, ఇంతవరకు ఏమాత్రం తీరికలేని ఉద్యోగాలు ఎన్నో చేసారు కదా! బోలెడు అనుభవాలు కూడా వుండే వుంటాయి. ఎంచక్కా ఓ ఆత్మకధ రాస్తే పనికి
పనీ వుంటుంది, కాల్క్షేపంగాను వుంటుంది’ అని సలహా చెప్పాడు.
“సలహా
బాగానే వుందని పించింది. కాకపొతే చాలా అనుమానాలు వచ్చాయి.
“తెలుగులో
రాయాలా? ఇంగ్లీష్ లో రాయాలా?
“తెలుగువాడినే
కానీ తెలుగులో రాసేంత తెలుగు వచ్చా అన్నది అనుమానం. ఇంగ్లీష్ బాగానే వచ్చు కానీ తెలుగులో విషయాలు
తెలుగు రాని వాళ్ళు చదివితే వారికి అర్ధం అవుతుందా అనే ఇంకో సందేహం.
“పోనీ
ఇటు తెలుగులో, అటు ఇంగ్లీష్ లో రెండింటిలో రాస్తే పోలా! భేషుగ్గా వుంది ఐడియా.
‘ఉత్తర
హిందూ స్థానంలో ఎక్కువ కాలం ఉద్యోగం చేయడంఅనే కారణం చేత నా తెలుగు నాలుగు పొడి ముక్కలు మాట్లాడడానికి, ఇక్కడ అంతా క్షేమం లాంటి చిన్న
చిన్న ఉత్తరాలు రాసుకోవడానికి సరిపడేలా కుదించుకు పోయింది.
“అదో
పెద్ద ఇబ్బందేమీ కాదు, నువ్వు చెబుతుంటే చక్కగా రాసిపెట్టే వాళ్ళు బోలెడు మంది
వున్నారని ఆ పెద్దమనిషే మళ్ళీ ఇచ్చాడు భరోసా.
“సరే!
ఒక పెద్ద సమస్య తేలిపోయింది. మరి ఆత్మకధ అంటే కొన్ని చెప్పుకునేవి, కొన్ని
చెప్పుకోలేనివి వుంటాయి. గాంధీ గారిలా
అన్నీ రాసుకోవాలా లేదా కొన్ని రాసుకుని
కొన్ని దాచుకోవాలా’
‘ఏ
మసాలా లేకుండా రాముడు మంచి బాలుడు తరహాలో
రాస్తే చదివేవాళ్ళు ఉంటారా!
“అది
పుస్తకం రాసిన తరువాత మాట. ముందు రాయడం మొదలు పెట్టమని ఆ పెద్దమనిషి గోల.
“అదీ
సరే. మొదలు పెట్టేస్తాను. భాష సమస్య తీరింది, మరి మా ప్రాంతపు రాయలసీమ యాసలో
రాయాలా లేదా అన్ని ప్రాంతాలవారికి అర్ధం అయ్యేలా తెలుగు సినిమా భాషలో రాయాలా?’
“ఓరి
బాబోయ్ ఇన్ని అనుమానాలా. ఇన్ని కడుపులో పెట్టుకుని ఇన్నాళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఎలా
చేసావంటూ ఆ పెద్దమనిషి ఆక్రందన’
ఈ
విషయాలన్నీ చెప్పిన ఆ పెద్దమనిషి నిజానికి చాలా చాలా పెద్ద మనిషి.
పేరు
యాగా వేణుగోపాల రెడ్డి. వై.వీ.రెడ్డి
అనేది అందరికీ తెలిసిన పేరు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిగా పదవీ విరమణ చేశారు. 2003 – 2005 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. ‘నా
జ్ఞాపకాలు’ అనే పేరుతొ తమ అనుభవాలతో కూడిన ఒక గ్రంధం రచించారు.
లేబుళ్లు:
ఎందుకు రాశాను? – Y.V.Reddy,
Former governor,
RBI
15, ఏప్రిల్ 2019, సోమవారం
Janasena Leader Addepalli Sridhar Analysis on VVPats Counting | The Deba...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ ఛానల్ లో The Debate With venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన).
Debate on BJP Ready For Plan "B" in After Election | The Debate with Ven...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ ఛానల్ లో The Debate With venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన).
Political Parties Exposed Many Doubt on Strong Rooms | The Debate with V...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ ఛానల్ లో The Debate With venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన).
13, ఏప్రిల్ 2019, శనివారం
Pratidwani | 12th April 2019 | Full Episode | ETV Telangana
ఈ టీవీ తెలంగాణా ఛానల్ 'ప్రతిధ్వని' కార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : ప్రొఫెసర్ యాదగిరి, శ్రీ కిరణ్ సాయి
Discussion on Chandrababu Delhi Tour on EVMS failure in AP Elections | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy టీవీ ఛానల్ Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్
12, ఏప్రిల్ 2019, శుక్రవారం
ఆంధ్ర లో ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి ? కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవ...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ ఉదయం Prime 9 Channel లో Hot Topic With Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ డి. రామారావు (టీడీపీ, ఎమ్మెల్సీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ షేక్ మొయినుద్దీన్ (వైసీపీ), శ్రీమతి సీతా రత్నకుమారి (బీజేపీ)
ఈ ఎన్నికల్లో ఈసీ ఏ పార్టీకి కొమ్ము కాసింది, టీడీపీ లేదా వైసీపీ ? | Hot T...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ ఉదయం Prime 9 Channel లో Hot Topic With Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ డి. రామారావు (టీడీపీ, ఎమ్మెల్సీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ షేక్ మొయినుద్దీన్ (వైసీపీ), శ్రీమతి సీతా రత్నకుమారి (బీజేపీ)
రాజకీయ నాయకుల గుండెల్లో బరువు పెంచిన పోలింగ్ శాతం ? ఆంధ్రలో గెలుపెవరిది ...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ ఉదయం Prime 9 Channel లో Hot Topic With Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ డి. రామారావు (టీడీపీ, ఎమ్మెల్సీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ షేక్ మొయినుద్దీన్ (వైసీపీ), శ్రీమతి సీతా రత్నకుమారి (బీజేపీ)
11, ఏప్రిల్ 2019, గురువారం
ఓటు వేయ తరమా! ఓటు వేసి చూడు! ఓటు వేయగలవా ఓ నరహరి!
నేను రాయబోయేదానికి పై మూడు టైటిల్స్
పనికి వస్తాయని అలాగే ఉంచేశాను.
మిట్ట మధ్యాన్నం పన్నెండు గంటలకు టీవీ
చర్చల నుంచి బయట పడి ఇంటికి వెళ్లి మా ఆవిడను తీసుకుని నడకకు ఎక్కువా ఆటోకి తక్కువగా
అనిపించే దూరంలోవున్న పోలింగు కేంద్రానికి వెళ్లాను. రెండు ఫర్లాంగుల బయటే
ఆపేశారు. దిగి నడుచుకుంటూ వెళ్ళాము. తీరా వెళ్ళిన తరవాత స్లిప్పులు పట్టుకు రండి
అన్నారు. ఇంట్లో ఇవ్వలేదు అంటే బయట టేబుళ్లు వేసుకుని కూర్చుంటారు వాళ్ళ దగ్గరికి
వెళ్ళండి అన్నారు. ఆ ఎండలో నడుచుకుంటూ వెడితే ఇక్కడ కాదు పోలింగు కేంద్రానికి
అటువైపు ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆపసోపాలు పడుతూ అటు వెళ్ళాము.
వెళ్ళిన తర్వాత మొబైల్ యాప్ సాయంతో పోలింగు కేంద్రం నెంబరు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు.
అలాగే వెళ్లాం. మొబైల్ లో సెల్ డిశ్చార్జ్ అయింది కాసేపు ఆగమన్నారు. ఎండలో
నిలబడలేక వాళ్ళు కూర్చున్న కుర్చీల వెనుకనే నిలబడ్డాము. మొత్తం మీద ఓ పదిహేను
నిమిషాల తర్వాత మా చీట్లు చేతిలో పెట్టారు. మళ్ళీ పోలింగు కేంద్రానికి వెళ్ళాము.
పెద్దగా జనం లేరు కానీ కొంత క్యూ వుంది.
మొత్తానికి మా టర్న్ వచ్చింది. అక్కడి ఉద్యోగి ఎర్రరంగు పెన్ను కింద పడేసుకుని
వెతుకుతున్నారు. ఓటరు వేలిపై సిరా చుక్క పెట్టేముందు ఎర్ర పెన్నుతో జాబితాలో మా
పేర్లపై సున్నా చుట్టాలిట. అదో నిబంధన అట. ఎట్టకేలకు కొందరి కాళ్ళ కిందకు
దొర్లిపోయిన ఆ పెన్ను ఆచూకీ దొరికింది. మేము ముందుకు కదిలాము. మీకు నచ్చిన
అభ్యర్ధి పక్కన వున్న నీలం రంగు మీట నొక్కండి. పక్కన వీవీ ఫ్యాట్ లో సరిచూసుకున్న
తర్వాతనే బయటకు రండి అని అక్కడి అధికారి చాలా సౌమ్యంగా వివరించారు. పదిహేను
నిమిషాల్లోనే ప్రజాస్వామ్య క్రతువులో మేము సైతం మా సమిధను వేశామన్న తృప్తితో బయట పడ్డాము.
ఈ పని, అంటే పోలింగు కేంద్రం నెంబరు
కనుక్కోవడానికి ఇంతటి లాయలాస అక్కర లేదు ఇంట్లోనే ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. ఈ
సంగతి తెలియక కాదు. రాత్రి ఓ రెండు గంటలు ఆ పనిలోనే వుండి ఇక అది నా వల్ల అయ్యే పని
కాదని అర్ధం అయి విరమించుకున్నాను.
వెనకటి రోజుల్లో ఆయా పార్టీల వాళ్ళు ఈ చీట్లు ఇళ్లకే వచ్చి ఇచ్చి
వెళ్ళేవారు. ఇప్పుడా ఆనవాయితీ
పాటిస్తున్నట్టు లేదు. ఏవయినా నిబంధనలు అడ్డు వచ్చాయేమో తెలియదు.
చివరాఖరుగా చెప్పేది ఏమిటంటే పోలింగు
కేంద్రం వద్ద అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు కొందరు పలకరించారు. ఓటు విలువ గురించి
మీరు టీవీల్లో చెప్పే సంగతులు బాగుంటాయని ఓ కితాబు ఒకటి.
ఓటు వేయడం మీరు చెబుతున్నంత సులువేమీ
కాదు అనే అర్ధం అందులో నాకు గోచరించింది.
10, ఏప్రిల్ 2019, బుధవారం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ
చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ మధ్యాన్నం
అమరావతిలోని సీయీఓ కార్యాలయానికి వెళ్లి
తొమ్మిది పేజీల మెమొరాండం ఎన్నికల ప్రధాన అధికారికి అందచేశారు. ఆ తర్వాత ఆ
కార్యాలయం ఎదుటే తమ పార్టీ నాయకులతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. రేపు ఉదయం
పోలింగు మొదలవుతుంది అనగా ఈరోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం సహజంగానే చర్చనీయాంశం
అయింది. సిఈఓ ఆఫీసు ఎదుట ఒక ముఖ్యమంత్రి
ధర్నా చేయడం ఇదే మొదటి సారి. అయితే గతంలో వేర్వేరు కారణాలతో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఆ హోదాలోనే ధర్నాలకు దిగిన దృష్టాంతాలు వున్నాయి.
శ్రీ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న
రోజుల్లో ఆనాటి ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి గురించి
అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ
ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య కూడా
ధర్నాలో పాల్గొన్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి
కూడా ధర్నా చేశారు. పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ కిరణ్ బేడి జోక్యం మితిమీరి
పోయిందన్నది ముఖ్యమంత్రి ఆరోపణ. దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఆ నిరసన
మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు.
పొతే మరో తాజా ఉదాహరణ మమతా బెనర్జీ. కేంద్రం
తమ ప్రభుత్వాన్ని, తన అధికారులను సీబీఐ వేధింపులకు గురిచేస్తోందని బెంగాల్
ముఖ్యమంత్రి దీదీ ధర్నాకు దిగారు. రెండు రోజుల నిరసన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు కోల్ కటా వెళ్లి మమతా బెనర్జీ చేత దీక్ష విరమింప చేసిన సంగతి తెలిసిందే.
అధికారంలో ఉన్న ప్రభుత్వాల అధినేతలే
కేంద్ర ప్రభుత్వం తమపై కక్షతో వ్యవహరిస్తోందని నిరసన దీక్షలు చేస్తున్నారు సరే.
అది వారికి ప్రజాస్వామ్యం ప్రసాదించిన
హక్కు.
మరి అలాగే, సామాన్యులు కూడా అధికార
దర్పాలకు గురవుతూ మౌనంగా వుండిపోతున్నారు తప్ప ఆఫీసుల ముందు ధర్నాలకు దిగడం లేదు.
ప్రభువులు అలాంటివారిని కూడా గమనంలో పెట్టుకోవాలి.
లేబుళ్లు:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా
AP voters eyes on which party? || Election Watch - TV9
ఈరోజు బుధవారం ఉదయం మురళీకృష్ణ నిర్వహించిన Election Watch చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కృష్ణారావు (సీనియర్ జర్నలిస్ట్), శ్రీ ఇనగంటి రవి (ఎన్నికల ఫలితాల విశ్లేషకుడు), శ్రీ వీవీ రావు ( ఎన్నికల నిఘా వేదిక)
9, ఏప్రిల్ 2019, మంగళవారం
KSR Live Show | Landslide Win for Jagan Reddy in Andhra - 9th April 2019
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్ KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవారు: శ్రీ అజయ్ కల్లాం (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)
KSR Live Show | Landslide Win for Jagan Reddy in Andhra - 9th April 2019
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్ KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవారు: శ్రీ అజయ్ కల్లాం (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)
8, ఏప్రిల్ 2019, సోమవారం
Why Chandrababu Naidu and YS Jagan Neglecting Local Issues? | The Debate...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ చానల్ The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కే.పీ. చేకూరి (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన), శ్రీ చలసాని శ్రీనివాస్ ( ప్రత్యేక హోదా సాధన్ సంఘం నేత), శ్రీమతి వాసిరెడ్డి పద్మ (వై.ఎస్.ఆర్.సీ.పీ.)
Will YS Jagan Accept Pawan Kalyan Challenge over AP Special Status? | Th...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ చానల్ The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కే.పీ. చేకూరి (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన), శ్రీ చలసాని శ్రీనివాస్ ( ప్రత్యేక హోదా సాధన్ సంఘం నేత), శ్రీమతి వాసిరెడ్డి పద్మ (వై.ఎస్.ఆర్.సీ.పీ.)
7, ఏప్రిల్ 2019, ఆదివారం
అందరి చూపూ రాజకీయం మీదే
దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో,వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ అయాచితంగా లభిస్తూ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే వీళ్ళందరూ తీసికట్టే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బుసంచులూ వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడంకోసం వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ రాజకీయ రంగ ప్రవేశం కోసం అర్రులు చాచేది అందుకే. తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు కూడా వుండి తీరాలి అనే నిర్ధారణకు వాళ్ళు వచ్చేస్తున్నారు. రాజకీయం, ప్రజాసేవ అనే మాటలు కూడా పొసగని వాళ్లు సయితం డబ్బు వెదజల్లయినా ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో నీరాజనాలు. ఎక్కడకు వెళ్ళినా, ఏ దేశమేగినా అతడు ఒక్కసారి తమను పలకరిస్తే చాలు అనుకుని పులకరించిపోయే జనాలు. తమ అభిమాన నటుడు కరచాలనం చేసినా జన్మ ధన్యం అయిపోయినట్టు కలలు కనే అభిమాన జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి తమ గడప తొక్కితే చాలు ఆ నటుడికి దిగ చెమటలు పట్టడానికి.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం? పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెళ్ళాడనుకోండి. నెలకు పదివేలు తీసుకునే సర్కారు ఉద్యోగి ముందు ఆ హోదాలు, ఇంతోటి వైభోగాలు దిగదుడుపే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్టక్కర లేకుండానే కళ్ళు తిరిగే డబ్బు రాశులు రాశులుగా రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంతనే వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు అసలే కాదు. అలా అని పెద్ద పేరున్నవాడూ కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకుపోగలడు. కింది స్తాయి నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళి, పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ముఖ్యమంత్రి పేషీలోకి అనుమతి లేకుండా జొరబడగలడు. చివరాఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సైతం సందేహించే పోలీసు ఠాణాల్లోకి సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. ఒక్క మనిషికి కూడా అధికారిక ప్రవేశం లేని దేవాలయాల్లోకి పదిమందిని వెంటేసుకు పోగలడు.
అతడే రాజకీయ నాయకుడు. మన కధానాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం పని తీరు తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులు తరచూ చెబుతుంటారు. కానీ ఆ సూత్రం వారికి వర్తించదు. ఎందుకంటే ఆ పొడవాటి చట్టం చేతులు తమ జేబుల్లోనే ఉన్నాయన్న వాస్తవం వారికి తెలుసు. వారి జోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు చేయిస్తాం రా’ అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి నిబంధనలన్నీ కట్టగట్టుకుని గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటే చాలు అన్నీ వున్నట్టే లెక్క. అదే అధికార పార్టీ అయితే ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
పొలిటికల్ పవర్ కు వున్న పవర్ అలాటిది. అందుకే ఈరోజుల్లో అందరి చూపూ రాజకీయం మీదే!
మేనిఫెస్టోలు నిజాలు! | Debate On Election Manifesto | News Scan Debate W...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 విజయ్ నారాయణ్ న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కఠారి శ్రీనివాస్ రావు (విశ్లేషకులు), శ్రీమతి డాక్టర్ ముళ్ళపూడి రేణుక (టీడీపీ)
6, ఏప్రిల్ 2019, శనివారం
Discussion on Election Commission Transfers AP Chief Secretary Puneta | ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ పవన్
5, ఏప్రిల్ 2019, శుక్రవారం
ఓటర్లని కొనడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు ! | Today's...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 News Channel లో యాంకర్ శ్రీదేవి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవాళ్ళు: శ్రీమతి సీతా రత్నకుమారి (బీజేపీ), శ్రీ శివశంకర్ (వైసీపీ), శ్రీ మల్లికార్జున యాదవ్ (టీడీపీ)
4, ఏప్రిల్ 2019, గురువారం
News Talk | Special Discussion With Senior Journalist Mr. Bhandaru Srini...
ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం స్నేహ టీవీ న్యూస్ టాక్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ స్వర్ణ
2, ఏప్రిల్ 2019, మంగళవారం
రేడియోలో ‘దూడలు’ – భండారు శ్రీనివాసరావు
చాలా ఏళ్ళ కిందటి సంగతి.
ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి
ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ
కృష్ణారావు, వెంటనే స్పందించి, జగ్
జీవన్ రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం
చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ
వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో
సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత ఏడూ అయిదుకు వచ్చే ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ ఆ మరణ వార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది.
బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం లోక్ సభ సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ఈ విషయాన్ని ప్రశ్న రూపంలో లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి
ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి దేశంలోని
ఏడు రేడియో స్టేషన్లు తప్పు చేశాయని
తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో
లేదు.
ఏది ఏమైనా ఈ ఉదంతంతో రేడియో అధికారులు
మరణ వార్తల ప్రసారం విషయంలో అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ
అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి
ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని
ఆంక్షలు విధించారు.
తరువాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ
పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు
జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో
కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడలో ఉన్న కృష్ణారావు గారు
హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన
చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం ఢిల్లీ విలేకరి ఆ వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు
కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది.
దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి
ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే
ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు
వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి ఇచ్చినా నిబంధనల పేరుతొ తీసుకోలేదు.
‘తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ
వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు.
ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో
వార్తల్లో దొర్లాయి. ఒకటి జగ్జీవన్ రాం మరణ వార్త, రెండోది లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ఈ రెండింటినీ
ధ్రువ పరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక కరచుకోవడం జరిగింది. పార్లమెంటు శ్రద్ధాంజలి
ఘటించింది కూడా. ఆ తరువాత కానీ జరిగిన పొరబాటు తెలియరాలేదు.
ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు
మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు
తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి వుంది.
నాకైతే తెలియదు.
లేబుళ్లు:
రేడియోలో ‘దూడలు’ తప్పుడు వార్తలు
1, ఏప్రిల్ 2019, సోమవారం
ఉందిలే మంచి కాలం ముందు ముందునా – భండారు శ్రీనివాసరావు
‘ఏవిటి రామయ్యా! అంత దీర్ఘంగా
ఆలోచిస్తున్నావ్’
‘ఏముంది మరో రెండు నెలల్లో మన జీవితాలు
ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయో తలచుకుంటూనే ఆశ్చర్యంగా వుంది’
‘అందుకోసం పోద్దటి నుంచీ తిండి కూడా తినకుండా ఆ కుక్కి మంచంలో పడుకుని కాలుమీద కాలు వేసుకుని మరీ ఆలోచిస్తున్నావ్!
ఇంతకీ ఆ జరగబోయే మంచి ఏమిటో చెప్పు, నాకూ వినాలని వుంది’
‘ఇక నుంచి నువ్వూ నేనే కాదు మన ఇంట్లో
పిల్లా పాపా అందరం కాలుమీద కాలువేసుకుని దర్జాగా గడిపే రోజులు వస్తున్నాయి. కలలో
కూడా ఊహించలేదు సుమా!’
‘ఏవిటి! పరగడుపునే నాలుగు పేకెట్లు
పడ్డాయేమిటి కడుపులో’
‘అలానే అంటుండు. అప్పుడే ఏప్రిల్
వచ్చేసింది. ఈ నెలకు ముప్పయి రోజులే. పైన మే
నెలలో మరో ఇరవై మూడు రోజులు. ఎంతలో దొర్లిపోతాయి చూస్తుండు’
‘మేలో ఏం జరుగుతుందేమిటి? మహా అయితే ఎండలు
ఇంకా మండుతాయి’
‘ఇక మనకు కడుపు మండడాలు గట్రా వుండవు.
అన్నీ మంచి రోజులే. పించన్లు నాకూ మా
ఆవిడకు, నీకూ మీ ఆవిడకు మాత్రమే కాదు, చదువంటక రోడ్లు పట్టుకు తిరుగుతున్న మా
ఇద్దరు పిల్లలకు నెల తిరిగేకల్లా విచ్చు రూపాయలు కళ్ళముందు గలగలా మంటాయి. ఉద్యోగం
వున్నా డబ్బులే, లేకున్నా డబ్బులే. గ్యాస్ బండలు రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లోకి
దొర్లుకుంటూ వస్తాయి, కాణీ ఖర్చు లేకుండా. పెళ్ళయిన పిల్లకి పసుపు కుంకుమ, పెళ్లి
కాని దానికి మనం కొనిపెట్టలేని అవేవో ల్యాప్టాపులూ, సెల్ ఫోన్లు. వాళ్ళ చదువులు అన్నీ
ఇక మనం చూసుకోనక్కర లేదు. పండినా పండక పోయినా ఇన్నాళ్ళు మనకు డొక్కలు ఎండడమే. పంట
వేసుకోవడానికి డబ్బులు, పైర్లు కోసుకోవడానికి డబ్బులు. రోగంరొష్టు వస్తే యెట్లా
అనే బాధ లేదు. బతికున్నా డబ్బులే. రోగం వచ్చినా డబ్బులే. ఆఖరికి చచ్చి కాటికి వెళ్ళినా డబ్బులే. వచ్చే ఎన్నికల నాటికి
ఇంకెన్ని ఇస్తామంటారో. ఇన్నాళ్ళు ఏదో చచ్చామో బతికామో తెలియకుండా బతుకులు
ఈడుస్తున్నాం. ఇక బతుకు గురించి బెంగ లేదు. సంసారం ఎలానా అన్న దిగులు లేదు. ఎవరు
గెలిస్తే మనకేమిటి. మనకు నిత్యం చచ్చి బతికే పనిలేకుండా చేస్తామంటున్నారు. ఎవరు
గెలిచినా ఎవరు ఓడినా మనకు పోయేదేమీ లేదు.
వాళ్ళందరూ గెలవాలనే మనం దేవుడ్ని
కోరుకుందాం’
‘అదెలా కుదురుతుంది. ఎవరో ఒకళ్లెకదా
గెలిచేది. మరి అందరూ గెలిస్తే కదా నువ్వు చెప్పిన కోరికలన్నీ తీరేది’
‘అందుకే ఇందాకటి నుంచి ఏం చెయ్యాలా అని
దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నువ్వన్నట్టు
పోటీలో ఉన్న పార్టీలు అన్నీ గెలిస్తేనే కదా ఇవన్నీ నిజం అయ్యేది. అందుకని ఓ పని
చేద్దాము. పోలింగు బూతులోకి వెళ్లి ఆ మెషిన్ మీద అన్ని పార్టీల గుర్తులు గుర్తు
పెట్టుకుని ఒకేసారి అన్నింటిపైనా నొక్కేద్దాము,
ఓ పనైపోతుంది. ఏవంటావ్’
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)