అద్భుతాల కోసం వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు.
చూసే కళ్ళు, ఆస్వాదించే హృదయం వుండాలే మన చుట్టూనే వున్నాయి ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు.
ఈ పాడు ప్రపంచంలోకి ఏడుస్తూ వచ్చిన పాపాయి కొద్ది
రోజుల్లోనే తన బోసి నోటితో ముసి ముసి నవ్వులు నవ్వడం చూడండి. అంతకంటే అద్భుతం
ఏముంటుంది.
కుండీలో వున్న పూల మొక్క మారాకు వేసి పూతపూసి మొగ్గ తొడిగి పూవు విచ్చుకోవడం
గమనించండి. యెంత అద్భుతంగా వుంటుందో ఆ దృశ్యం.
మండు వేసవిలో పెనంలా మారిన వాతావరణం.
వున్నట్టుండి చెప్పాపెట్టకుండా ఒక్క వాన
కురుస్తుంది. వేల ఎయిర్ కండిషనర్లు కూడా ఇవ్వలేని చల్లదనం ఒక్కసారిగా అనుభవంలోకి
వస్తుంది. యెంత గొప్ప అద్భుతం.
ఇలాటి ఎన్నో అద్భుతాల మధ్యనే మన జీవితాలు
గడిచిపోతున్నాయి. అయినా ఇంకా మరేదో అద్భుతం చూడాలని వెంపర్లాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి