దేవుడ్ని నమ్మని దేశంలో పిల్లలే దేవుళ్ళు
ఇక చిన్న
పిల్లల విషయానికి వస్తే - ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయినా సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. 'మా అబ్బాయి డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు
చదివిద్దామనుకుంటున్నాము' అంటే అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి
అభిరుచులను కనుగొనే పరీక్ష - (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు)- పెట్టి ఆ
విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో - తెలుసుకుని ఆ కోర్సులో
చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే బాధ్యత కూడా
సర్కారుదే కావడంవల్లా, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ
జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్లా, వారికీ అభ్యంతరాలు వుండవు.
(మా పిల్లలకు వేసవి వినోదం - చేపల వేట - ఫోటో కోసం)
మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం.
యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు అంత ఎక్కువగావుంటాయి. పదిమందికి పైగా
పిల్లల్ని కన్న 'సంతానలక్ష్ములను' జాతీయ అవార్డులతో సత్కరిస్తుంటారు. గర్భవతులయిన
ఉద్యోగినులకు , గర్భం
ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచి, సుఖ ప్రసవం జరిగి,
పుట్టిన బిడ్డ బుడి బుడి అడుగులు వేసే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా
పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ
పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ
ఎరుగనివి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి