వార్త - వ్యాఖ్య
వార్త : "భారత్ ది అపరిపక్వ ప్రజాస్వామ్యం :
చైనా (ఈనాటి 'ఈనాడు' దిన పత్రిక మెయిన్ ఎడిషన్ రెండో పేజీ)
"భారత్ తో సహా అనేక ఆసియా దేశాల్లో నేటికీ అపరిపక్వ
ప్రజాస్వామ్యమే నడుస్తోందని చైనా వ్యాఖ్యానించింది. ఈ పరిస్తితి ఆయా దేశాల ఆర్ధిక
పురోగతిని దెబ్బతీస్తోందని పేర్కొంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోని పార్టీలన్నీ వోట్ల రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నాయని విశ్లేషించింది.
ప్రజాస్వామ్యం ఘర్షణ వాతావరణానికి దారితీస్తే, (జరగనున్న) ఎన్నికలు యుద్ధవాతావరణాన్ని
తలపిస్తాయని (జోస్యం) చెప్పింది.
వ్యాఖ్య : "కాదనేందుకు ఏముంది ? లెస్స
పలికితివి చైనా!"
(14-02-2014)
2 కామెంట్లు:
శత్రువు చెప్పినా నిజం నిజమే. రక్షసుడు అయినా మారీచుడు చెప్పినది తలుచుకుంటున్నాం నేటికీ కదా!
సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్య పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః
రాజా! ఇచ్చకాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ దొరుకుతారు పదవిలో ఉన్నవారికి. అప్రియమైనా సత్యం చెప్పేవాడు దొరకడయ్యా! ఒకవేళ ఎవడేనా చెప్పినా వినేవాడు లేడయ్యా!! అన్నాడు కదా!
@kastephale - ధన్యవాదాలు చక్కని హితోక్తితో వ్యాఖ్యానించినందుకు - భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి