(అమెరికాలోని,
ఒహియో రాష్ట్రం, క్లీవ్ లాండ్ కు చెందిన రెగీనా బ్రెట్ అనే రచయిత్రి ఏర్చి కూర్చిన హితోక్తులు)
“జీవితం
మనం అనుకునేటంత చెడ్డదీ కాదు, మనం ఊహించుకునేటంతటి చెడ్డదీ కాదు.
“ఏదైనా
సందేహం కలిగినప్పుడు అక్కడే ఆగిపోండి. తర్వాత నెమ్మదిగా మరో చిన్న ఆడుగు వేయండి
“నిండు
నూరేళ్ళ జీవితం అంటారు కానీ, చూస్తుండగానే కరిగిపోయి ఇంత చిన్నదా అనిపిస్తుంది. అంచేత ఉన్న కాస్త సమయాన్ని ఇతరులను ఆడిపోసుకోవడానికో, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడానికో
వృధా చేసుకోకండి.
“ఉన్నట్టుండి
పడకేస్తే మనల్ని ఆదుకునేది, కనిపెట్టుకు చూసుకునేది మన చుట్టపక్కాలు, మన
స్నేహితులే అని మరచి పోకండి.
“చేసే
ప్రతి వాదనలో మనదే పై చేయి కావాలని భీష్మించుకోకండి. కాస్త పట్టూ విడుపూ
ప్రదర్శించండి.
“దుఖం
కలిగితే ఒంటరిగా ఏడవకండి. ఎవరో ఒకరితో మీ
బాధను పంచుకోండి.
“దేవుడి మీద
కోపం వస్తే దాన్ని ఆయన మీద చూపండి. ఆయనకి ఇలాటివి కొత్తేమీ కాదు.
“గతంతో
రాజీ పడి, పాత వాటిని మరచిపోతే, ఆ అనుభవాలు భవిష్యత్తులో శాంతిని కలిగిస్తాయి.
“ఇతరులతో
మనల్ని పోల్చి చూసుకోవడం అంటే మన మనశ్శా౦తిని మనమే చేతులారా పోగొట్టుకున్నట్టే”
“ప్రపంచంలో
ప్రతిదీ కనురెప్పపాటులో మారిపోతుంటుంది. భయం లేదు. ఆ భగవంతుడికి మనలా
కనుగీటడం తెలియదు.
“నువ్వు
తప్ప నీ ఆనందాన్ని ఎవరూ దూరం చేయలేరు.
“అన్నీ
మరచిపోయి అందర్నీ క్షమించండి.
“మీ
గురించి బయటవాళ్ళు ఏమనుకుంటున్నారనేది
మీకు అస్సలు సంబంధం లేని విషయం.
“అన్ని
బాధలను, అన్ని వేదనలను, అన్ని గాయాలను నయం చేసే శక్తి కాలానికి ఒక్కదానికే వుంది.
దానికి కొంత వ్యవధానం ఇవ్వండి.
“అద్భుతాలను ఆస్వాదించండి.
“ప్రతి
రోజూ అలా కాసేపు బాహ్య ప్రపంచంలోకి వెళ్లి చూడండి. మీరు ఊహించని అద్భుతాలు మీ
కళ్ళబడతాయి.
“అసూయ
పడితే ప్రయోజనం వుండదు. శుద్ధ టైం వేస్టు. మీకు కావాల్సినవి, మీరు కోరుకున్నవీ మీచెంతనే వున్నాయి. ఆ సంతృప్తి ఒక్కటే అసూయని మీకు దూరం
చేస్తుంది”
1 కామెంట్:
good suggestions.
కామెంట్‌ను పోస్ట్ చేయండి