9, సెప్టెంబర్ 2017, శనివారం

రాస్తూ పోతూ చదవడం మర్చిపోతున్నానా?


ఈమధ్య ఇలా అనిపిస్తోంది. డాక్టర్ భరత్ పుణ్యమా అని ఈమధ్య ఒక పుస్తకం చదివాను. అది చదివిన తరువాత ఇక రాయడానికి పూర్తిగా స్వస్తి చెప్పి ఇలాటి పుస్తకాలే చదువుతూ వుండాలని గట్టిగ అనిపిస్తోంది. ఆ గొప్ప  పుస్తకం పేరు “సిల్క్  రూటులో సాహస యాత్ర”.  దాన్ని రాసిన గొప్ప రచయిత పేరు పరవస్తు లోకేశ్వర్. మొదటి ప్రచురణ 2013 లో. నాలుగేళ్ళకు చదవగలిగినందుకు ఒక రకంగా సంతోషంగా వుంది.  నాలుగేళ్ళుగా చదవనందుకు మరో రకంగా సిగ్గుగా వుంది.
రాసిన లోకేశ్వర్ గారికి, చదివించిన డాక్టర్ భరత్ గారికీ (ఈ ఇద్దరూ నాకంటే వయస్సులో చిన్నవాళ్ళు, అయినా గారు అని గౌరవించుకోవాలని అనిపిస్తోంది) ధన్యవాదాలు. ఈపాటికే అనేక సమీక్షలు వచ్చి వుంటాయి. అయినా వీలు చూసుకుని నా అభిప్రాయం రాస్తాను.
(గాంధి ప్రచురణలు మొబైల్: 9392698814, వెల: 250 రూపాయలు)


5 కామెంట్‌లు:

Surya Mahavrata చెప్పారు...

చక్కగా రాస్తూ అందరిచేతా చదివించగలరు. ఎంత చదివినా మీ సొంతానికేగా? కనక చదవండి - కానీ అంతకన్న ఎక్కువ రాస్తూండండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Surya - ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

జిలేబి తల తోక లేని వెర్రి పద్యాలు రాస్తుంది. పండితులు ఆవురావురుమంటూ బూతు జుగుప్సాకర సమస్యలను పూరిస్తూ పరవశించి పోతున్నారు. చాకి రేవు అనే దరిద్రగొట్టు బ్లాగు కులపిచ్చి తో రోజూ విషం కక్కుతాడు. మీ బ్లాగు ఒక్కటే చదివితే ఉపశమనంగా ఉంటుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత: మిగిలిన పోలికల విషయంలో మీ అభిప్రాయాలు మీవి. కాకపోతే నా రచనల విషయంలో మీ ప్రశంసకు ధన్యవాదాలు.

నీహారిక చెప్పారు...

వ్రాయడం, చదవడం కంటే బ్రతుకు జట్కాబండిలో ఊరేగుతూ చూడడం బాగుంటుందండీ ! చేయాలిక సాహసయాత్ర !