సుభాషితం సుమధుర భాషితం
ప్రభుత్వాలు చేసే ప్రతి పనీ ప్రతి ఒక్కరికీ తప్పుగా కనిపిస్తుంది,
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం తప్ప.
దేశంలో లెక్క చెప్పుకోవడానికి పదహారు వందల ముప్పయి అయిదు స్వదేశీ
భాషలు ఉన్నాయి. కానీ జనాలని కలిపే భాష మాత్రం పరాయిది.
పోలీసును చూడగానే అమ్మయ్య పరవాలేదు పదిలంగా వున్నామన్న అభిప్రాయం కలగాలి కానీ ఈ ఒక్క
దేశంలోనే పోలీసును చూసి భయపడే పరిస్తితి వుంది.
ఎవర్ని చూడండి నిమిషం టైం లేదన్నట్టు ఎంతో హడావిడి పడుతుంటారు. కానీ ఏ
ఒక్కడూ సమయపాలన చేస్తున్న దాఖలా కనబడదు.
అది దేవుడి గుడి కావచ్చు,
మసీదు కావచ్చు, లేదా చర్చి కావచ్చు, సంపన్నులు లోపల దేవుడ్ని దేబిరిస్తుంటేబయట పేదవాళ్ళు అడుక్కుంటూ కానవస్తారు.
1 కామెంట్:
చాలా బాగుందండీ !!
కామెంట్‌ను పోస్ట్ చేయండి