ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు
సామాన్యుడికోసం రూపొందిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇటీవలి కాలంలో అసామాన్యులకోసం నిర్విరామంగా పనిచేస్తున్న క్రమంలో, అవి క్రమక్రమంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి. ఈ వ్యవస్థలు దారితప్పినప్పుడు సరిదిద్ది గాడిన పెట్టాల్సిన కర్తవ్యం భుజస్కందాల మీద వున్న ‘మీడియా’ సైతం ఆరోపణల నీలినీడలను తప్పించుకోలేకుండా వుండడం మరో విషాదం.
ప్రత్యర్ధి పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. భూములు, ఆస్తి తగాదాలను పరిష్కరించే మిషతో లావాదేవీలు నడిపే పోలీసు అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది - ‘కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో! మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం!’ అనే రీతిలో హామీలు ఇస్తుండడం కద్దు. కోర్టు నిర్ణయాలను ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది కాబట్టి సెటిల్మెంట్ వ్యవహారాలు నడిపేవారికి మరింత వెసులుబాటుగా మారింది. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి. పొరుగున వున్న తమిళనాడులో ఈ విష సంస్కృతి ఇప్పటికే వూడలు దిగివుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడి పార్టీలు ప్రత్యర్ధులపై కక్షలు తీర్చుకునే విధానాలు ఏ మేరకు దిగజారాయో అందరికీ తెలిసిన విషయమే. కాకపొతే గుడ్డిలో మెల్ల అన్నట్టు అక్కడి ప్రధాన పార్టీల వాళ్లు తమ పోరాట క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే రీతిగా నడుచుకోరు. కానీ మన రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. అందుకే రాజకీయ సెటిల్మెంట్ల వ్యవహారం ఇంతగా ఆందోళన కలిగిస్తోంది.
ఇది ఒక పార్శ్వం. దీన్ని మించిన ప్రమాదకరమయిన పరిణామం మరొకటి వుంది.
జగన్ మోహన రెడ్డి మీద సీ.బీ.ఐ. దర్యాప్తుకు కోర్టు ఆదేశించినప్పుడు ఆయనకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ- కొన్ని పత్రికలు, మరికొన్ని మీడియా సంస్తలు అందిస్తున్న సమాచారంపై అనేక ఆరోపణలు చేశాయి. దర్యాప్తు క్రమంలో ప్రచురితమవుతున్న వార్తలను అభూతకల్పనలుగా కొట్టివేశాయి. నాలుగు గోడలమధ్య జరుగుతున్నవిచారణ సంగతులను అక్షరం పొల్లుపోకుండా కళ్లకుకట్టినట్టు వైనవైనాలుగా వర్ణించి రాయడం ఫక్తు ‘ఎల్లో జర్నలిజం’ అని అభివర్ణించాయి. మీడియాలో ఒక వర్గం చంద్రబాబుకు కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. గత కొద్ది రోజులుగా సాగుతూ వస్తున్న తతంగం ఇది.
సాక్షి అభియోగాలను ఖండించాల్సిన అగత్యం ఆ మీడియాకు వుండకపోవచ్చు. కాకపొతే తాము ఇన్ని రోజులు నిస్పాక్షికంగా వార్తలు అందిస్తున్నామనీ, ఎవరిపైనో బురదజల్లే వార్తాకధనాలు అందించడం లేదని నిరూపించుకునేందుకు వాటికి ఇప్పుడొక సువర్ణావకాశం లభించింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీ.బీ.ఐ. ఇక ముందు జరపబోయే దర్యాప్తు గరించి కూడా మునుపటి విధంగానే, అదేవిధమయిన రీతిలో వార్తా కధనాలను అందించగలిగితే సాక్షి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోతుంది. రాజకీయ దురుద్దేశాలతో వార్తలు వండివారుస్తున్నారన్న అపప్రధ కూడా తొలగిపోతుంది. (15-11-2011)
11 కామెంట్‌లు:
vyasam Chala Bagundi.Sakshi Ptrika Jaganmohanreddy "kara pathrika" ani andariki telusu.Kothaga vari gurinchi pattinchu konavasaram ledu
రావు గారు,
సాక్షి నిరూపించుకోవాల్సింది ఏమీ లేదా? సీ బీ ఐ విచారణ సందర్భం గా జగన్ ని సాక్షి ఎలా వెనకేసుకొని వచ్చిందో అలానే ఇప్పుడు చంద్రబాబూ అండ్ కో విచారణ సందర్భం గా కూడా బాబు నీ రామోజీ నీ వెనకేసుకొని రావాలి. ఆ విధం గా సాక్షి తన నిష్పాక్షికతను నిరూపించుకోవచ్చు.
తాను నిష్పాక్షికం కాను అంటుందా? అలా అయితే ఎదుటి వారి నుంచీ నిష్పాక్షికత ఆశించే హక్కు సాక్షికి ఎక్కడిది?
Maastaaroo,
YS group kee meekoo madhya something..something ani modati nunchee anumaanam.
adi ee roju confirm ayindi.
సరిగా అడిగారు బొందలపాటి గారు.
బి.ఎస్.అర్.గారూ,మీ చినబాబు పట్ల,మీ "మేళ్ళ" గురువు గారి కుటుంబం పట్ల మీకున్న కృతఙ్నత సాక్షి టి.వి లొనూ మరియూ ఇక్కడా బాగా చూపిస్తున్నారు.చినబాబు పైన ఆరోపణలు వచినపుడు మీరు ఈ వ్యాఖ్యలు చెసి ఉంటే,ఇప్పుడు కూడా మీ అనే అర్హత వుండేది.మనలో మన మాట, గురువు గారిదగ్గర తెర వెనుక ఏ మాత్రం మేళ్ళు పొందారేంటి??,మీ అబ్బాయి పెళ్ళి లొ చూసాను వారిని.
If saakshi agrees that it's the pamphlet of Jagan, then other papers will need to be impartial
సాక్షి ఆస్థానవిద్వాన్సులుం గారికి,
దీని వలన మీ తెలంగాన అనుకూల వైఖరి కూడా జగన్ అనుకూల వైఖరి వలననే అని తేటతెల్లం అయిపోయింది. మీరేనా మీ ఆప్త మిత్రుడు వనం జ్వాలా నరసిమ్హం గారు కూడా ఉన్నారా?
అందరూ దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు కనుక అందరికీ ఒకే సమాధానం.నా ఆవేదన రాజకీయులు గురించి కాదు. మీడియా గురించి.జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నేను ఇంతవరకు ముఖతః చూడలేదు. పోతే నన్ను గుర్తుపట్టి పేరుతొ పలకరించే ముఖ్యమంత్రుల్లో చనిపోయిన అంజయ్య గారిని,వైఎస్సార్ ని మినహాయిస్తే ప్రధమంగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడి గారే.మా అబ్బాయి పెళ్ళికి వీరిద్దరూ వచ్చి తమ పెద్ద మనస్సును వెల్లడించుచుకున్నారు. అది వారి గొప్పదనం. మంచితనం. పోతే,నేను పొందిన 'మేళ్ళు'. రిటైర్ అయిన తరువాత నేను వుంటున్న అద్దె ఇంటికి వచ్చి చూడండి. నా చిరునామా:302, మధుబన్,ఎల్లారెడ్డి గూడా,హైదరాబాద్
Mana Rastram lo ne kakunda pakka rastralalao jarigina kumab konala lo kuda,teega lagithe jagan daggarike cherukuntunnayi.Avanni kappi puchukone "sakshi" NEws Paper mariyu Channal.Meeru akramanga sampadincharu ani evarina prashniste.Meeru sampadinchaleda ani eduru dadiki diguthare tappa varu praja danam tinaledu ani cheppadam ledu.Ilanti varini Palakuluga ennukunte.. Mana goyyi manam tavvukunnatte.Raboye taralaku emi migalcharu.Mottam mingestaru.
బి ఎస్ ఆర్ గారు,
ఇరవై సంవత్సరాల కిందటే రష్యా లో $$ ల లో జీతం తీసుకొనే ఉద్యోగం కొన్ని సంవత్సరాల పాటు చేసిన మీకు, సొంత ఇల్లు కొనుక్కోవటం పెద్ద విషయం కాదు.
చంద్ర బాబు కూడా మూడు గదుల ఇంట్లో ఉంటున్నాననీ, కుప్పం లో ఇంటికి రిపేరు కూడా చేయించుకోలేక పోయాననీ అంటున్నాడు. నమ్ముదామా?
Avineethi aropanalu vachina vyakti kosam 29 mandi MLA lu rajinama chesarante mana "prajaswamyam" ekkada undo chppochu. Avineethi sommu tho "kotlu" vechinci MLA lanu kuda kontu..Adhikara kanksha tho Prabhtvalane kulchalane krumaina manstatvam unnavarini samardhinchadamante,manam kuda oka rakanga "prajaswamyanni" patharesthunnatte."Ekaswamya" Palana kavalante ilanti varini samardhinchali.Bhu kabjalau,Rajakeeya atyalaku c/o address ga unna ilanti varini support cheyadam evidanganu sreyaskaram kadu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి