15, నవంబర్ 2011, మంగళవారం

రాజకీయ నీరజాక్షులు - భండారు శ్రీనివాసరావు


 వార్త – వ్యాఖ్య

“........తను నిర్దోషినని నమ్ముతున్నట్టయితే  సీ.బీ.ఐ. దర్యాప్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి.”
“........ఏ తప్పూ చేయకపోతే దర్యాప్తుకు సహకరించి అగ్ని పునీతుడిలా బయట పడాలి”
“........కోర్టు ఆదేశాల ప్రకారం జరిగే దర్యాప్తు. రాజకీయకక్షతో చేస్తున్నారన్న అనుమానాలు నిరాధారం”
నిన్నా ఇవ్వాళా వినబడుతున్న ఈ మాటలన్నీ ఈ మధ్యనే ఎక్కడో  విన్నట్టుంది కదూ. ఎవరో ఒకరు అన్నట్టుంది కదూ.
ఇదే రాజకీయం అంటే. ఈ రాజకీయ నీరజాక్షులు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. రాగానే మాటకు మాట అప్పజెప్పి ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పు వారిది కాదు కదా. అంతకు ముందు ‘ఈ ఆట’ మొదలుపెట్టినవారికి కూడా ఇందులో  కొంత భాగముంటుంది కదా.
అందుకే అన్నారు ఒకరిపై వేలెత్తి చూపితే నాలుగువేళ్ళు మనవైపు చూస్తుంటాయని. కాకపొతే, ఇది తెలియని అజ్ఞానులెవరూ లేరు. తెలియనట్టు వుంటారంతే. (15-11-2011)    

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మాష్టారూ,మీ బ్లాగ్ ని నేను రెగులర్ గా చదువుతాను,ఇంత మంచి బ్లాగ్ ఇలాంటి రాజకీయ దురుద్దేశ వ్యాఖ్యలతో ఈరొజు కనిపించడం దురదృష్టం.

Surya చెప్పారు...

మీ అభిప్రాయం 100% అక్షర్ సత్యం
ఆందుకే పెద్దలు అంటారు , తన దాక వస్తె గాని తెలియదు అని

Surya చెప్పారు...

మీ అభిప్రాయం 100% అక్షర్ సత్యం
ఆందుకే పెద్దలు అంటారు , తన దాక వస్తె గాని తెలియదు అని