ఓ ముప్పయ్యేళ్ళ క్రితం, నేనే నా స్కూటరు కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాను.
ఆ విరిగిన కాలుతో ఇంట్లోనే ‘కాలుక్షేపం’ చేస్తున్న ఆ రోజుల్లో, నాకు పొద్దుగడవడం కోసం జ్వాలా పూనికతో ఎంసీఆర్
హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు, తెలుగు మాతృభాష కాని ఐఏఎస్
ట్రైనీలకి తెలుగు బోధించే పని నాకు అప్పగించారు.
ఇంట్లోనే వుండి కాలు బయట
పెట్టకుండా చేసే సద్యోగం. ఆ ఐ.ఏ.ఎస్. ట్రైనీలు అప్పుడు తాత్కాలికంగా గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్
లో వుంటుండేవాళ్ళు. మేము వుండే దుర్గానగర్ కు దగ్గర. అంచేత ఉదయమో, సాయంత్రమో వీలు చేసుకుని ఆ
యువ అధికారులు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా కలివిడిగా వుండేవాళ్ళు. నా దగ్గర
నేర్చుకున్న తెలుగు వారికి యెంత ఉపయోగపడిందో తెలియదు కాని పోటీ పరీక్షలు రాసి
జీవితంలో అనుకున్నది సాధించిన కొందరు యువకులతో సన్నిహితంగా వుండే అవకాశం మాత్రం
నాకు లభించింది. తెలుగు సంగతి అలా పెడితే, మా ఆవిడ మాత్రం వారికి అచ్చ
తెలుగు వంటకాలను బాగానే పరిచయం చేసింది. అలాగే, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు
చిరుతిండ్లకు మాత్రం బాగా అలవాటు పడ్డారు.
వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. గిరాకీ వున్నా చోట మాఫియా కూడా వుంటుంది. ఈ యువ అధికారి ఆ మాఫియాకు గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.
“ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”
సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!

పొతే, బెన్ హర్ మహేష్ ఎక్కా. ఐ.ఏ.ఎస్.
ఆయన్ని చివరిసారి చూసి కాస్త అటూ ఇటూగా ముప్పయ్యేళ్ళు. మనిషి రూపం సరే, పేరు కూడా గుర్తులేదు. రాత్రి అన్నంలో వేసుకుంది ఏ కూర అంటే చప్పున చెప్పలేని గొప్ప జ్ఞాపక శక్తి నాది.
ఆ విషయంలో జ్వాలాని మెచ్చుకుని తీరాలి. స్నేహితులు, సన్నిహితులవే కాక అప్పటికప్పుడు పరిచయం అయిన వ్యక్తుల పేర్లు, ఫోను నెంబర్లు అన్నీ ఆయనకి కరతలామలకం. నిజానికి ఆయన ఫోను చేసి చెప్పబట్టే బెన్ హర్ ఎక్కాని కలవడం జరిగింది. ‘నీకు ఆయన తెలుసు, ఐఏఎస్ ప్రోబెషనర్లగా వున్నప్పుడు ఆయన బ్యాచ్ కి నువ్వే తెలుగు పాఠాలు చెప్పావు, మరచిపోయావా’ అని కూడా అన్నాడు. నాకయితే ఈ బెన్హర్ మహాశయుల రూపం కూడా గుర్తుకు రాలేదు.

సరే! ఒకరోజు ముందు ఫోను
చేసి టైం తీసుకుని, పల్లె ప్రాంతాలలో పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు
రూపొందించే క్రియ సంస్థ సీఈఓ డాక్టర్
బాలాజీని తీసుకుని సచివాలయానికి వెళ్లాను.
డాక్టర్ బాలాజీ మామేనల్లుడు డాక్టర్ రంగారావు (108, 104 రూపశిల్పి)కు స్నేహితుడు. పైగా 104 కు సీయీఓగా కూడా పనిచేశారు.
అనుకున్న టైంకి బెన్ హర్
ఎక్కాను వారి ఆఫీసులో కలిశాము.
గిరిజనుల ఆరోగ్యాలకు సంబంధించిన అంశంపై డాక్టర్ బాలాజీ బెన్ హర్ మహేష్ ఎక్కాకు వివరిస్తున్నారు. మధ్య మధ్యలో బెన్ హర్ ఎక్కా నా వైపు చూస్తున్నారు. నేను కూడా తేరిపార చూసాను కానీ నా దగ్గర తెలుగు నేర్చుకున్న అధికారులు ఎవ్వరూ ఆ క్షణంలో నాకు స్పురణకు రాలేదు. లేచి వస్తున్నప్పుడు బెన్ హర్ నాతో అన్నారు.
‘నేను, సంజయ్, వెంకటేశం ఇంకా కొంతమందిమి మీ ఇంటికి వచ్చే వాళ్ళం. ఆ రోజుల్లో మీకు కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో వున్నారు’
నాకు లైట్ వెలిగింది. అయన ఎవరో గుర్తుకు వచ్చింది.

అప్పుడు మా ఇంటికి వచ్చి
వెళ్ళే రోజుల్లో ఆయన ఐ.ఏ.ఎస్. ట్రైనీ.
ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రభుత్వ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీ.
అయినా ఇంతకాలం గడిచిన
తర్వాత కూడా నేను ఆయనకు గుర్తున్నాను అంటే ఆశ్చర్యమే మరి.
బహుశా బెన్ హర్ ఎక్కా అనే ఆ
యువకుడు ఐ.ఏ.ఎస్., అందుకే అయ్యారేమో.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి