7, జులై 2016, గురువారం

మా ఊళ్ళో మా బడి


మేము అరవై ఏళ్ళకు పూర్వం చదువుకున్నప్పుడు అది మట్టి గోడలతో నిర్మించిన ఒక పూరిల్లు. ఇప్పుడది ఇదిగో ఇలా ఈ ఫోటోలోలా వుంది. ఒకప్పుడు ఐదో తరగతి వరకు వుండేది. ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.





హైదరాబాదులో మా పిల్లలు చిన్నప్పుడు చదువుకున్న ప్రైవేటు  స్కూళ్ళకు కూడా మా వూరి స్కూలు వైభోగం లేదు. మా పిల్లలు కోళ్ళ ఫారాల వంటి స్కూళ్ళలో చదువుకుంటే మా వూరి పిల్లలు ఎంచక్కా ఆట మైదానం వున్న పాఠశాలలో చదువుకుంటున్నారు.




సర్కారు బడి అని చిన్న చూపు పనికి రాదు. వాళ్ళు వేయించిన కరపత్రం చూడండి. ఫలితాల్లో వరసగా మూడేళ్ళ నుంచి మండల స్థాయిలో దీనిదే ప్రధమ స్థానం. ఒకటి రెండు మూడు అంటూ కాకిగోల చేసే ప్రకటనలు టీవీల్లో వింటుంటాం. అంతటి డబ్బున్న వ్యవహారం కాదు కాబట్టి, ఒక కరపత్రం వేసి  సరిపుచ్చుకున్నారు.
గ్రంధాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఉచిత యూనిఫాం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాన్న భోజనం.
పదిహేడు మంది స్కూలు టీచర్లు. అందరూ ఎమ్మే బీయీడీలు, బీఎస్సీ బీఈ డీలు.  
నేనూ ఒకప్పుడు  లాగూ పైకి లాక్కుంటూ వెళ్లి  ఈ స్కూలుకే వెళ్లి చదూకున్నానని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చన్న మాట.

మా వూరు జిందాబాద్!   మా వూరి మా బడి జిందాబాద్!!     

2 కామెంట్‌లు:

chavera చెప్పారు...

Hats off, in contrast,
మా బడి తిరుపతి రైల్ స్టేషన్ ప్రక్కనే ఉన్న టంగుటురి ప్రకాశం పంతులు మునిసిపల్ ఉన్నత పాఠశాల.
మాకు స్కూల్ పీపుల్ లీడర్ గా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండే వారు.
ఆ తరువాత ఆయన ఎంత ఎత్తు కు ఎదిగారో విలొమానురీతి లో స్కూలు కూడా అభివృద్ధి చెందింది.
మా స్కూల్ భాగ్యం ఏమని చెప్పుకోగలం?

Arun చెప్పారు...

Never attended this school but played in the school ground several times when I visited my grandparents in Khambhampadu. My memories in that village are still fresh