దొందూ దొందే
పెళ్లి కూతురు, పెళ్లికొడుకూ పెళ్ళయిన తరువాత పల్లకీలో
వెడుతున్నారు. దారిలో పూత పూసిన చింత
చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే పెళ్లి కూతురు ‘చింత చెత్తు పూత పూసిందే’
అన్నది. ఆ అమ్మాయికి ‘ట’ పలకదు. అబ్బాయి వెంటనే ‘ పూతే కాలం వస్తే పూయదా’ అన్నాడు.
అతగాడికి ‘స’ పలకదు.
వీరిద్దరి మాటలు వింటున్న పల్లకీ
బోయీల్లో ఒకడన్నాడు.
“దొందూ దొందేరా కొందప్పా”
అతడికి ‘డ’ పలకదు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి