4, జూన్ 2016, శనివారం

దొందూ దొందే
పెళ్లి కూతురు,  పెళ్లికొడుకూ పెళ్ళయిన తరువాత పల్లకీలో వెడుతున్నారు. దారిలో పూత పూసిన  చింత చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే పెళ్లి కూతురు ‘చింత చెత్తు పూత పూసిందే’ అన్నది. ఆ అమ్మాయికి ‘ట’ పలకదు. అబ్బాయి వెంటనే ‘ పూతే కాలం వస్తే పూయదా’ అన్నాడు. అతగాడికి ‘స’ పలకదు.
వీరిద్దరి మాటలు వింటున్న పల్లకీ బోయీల్లో ఒకడన్నాడు.
“దొందూ దొందేరా కొందప్పా”

అతడికి ‘డ’ పలకదు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి