ఏకాంబరం తన బాసుతో కలిసి పగటివేళ రైల్లో పోతున్నాడు. ఆ రైలు ఓ పెద్ద సొరంగ మార్గంలో పోతోంది. అదే బోగీలో మరో ఇద్దరు వున్నారు. ఓ వయస్సు మళ్లినావిడ, ఆవిడతో పాటు మాంచి వయస్సులోవున్న వాళ్ళమ్మాయి. రైలు సొరంగంలో ప్రవేశించగానే బోగీ అంతా చీకటి అలుముకుంది. ఎవరికెవరు కనిపించడం లేదు. వున్నట్టుండి ఎవర్నో ముద్దు పెట్టుకున్న ధ్వని, వెనువెంటనే చెంప చెల్లుమన్న చప్పుడు.
రైలు సొరంగం నుంచి బయటకు వచ్చింది.
వెలుతురు వచ్చింది.
వృద్ధురాలు, ఏకాంబరం మొహాల్లో తెలియని కంగారు. మేనేజర్ చెంప కందిపోయి వుంది.
తలదించుకుని కూర్చున్నాడు. ఏం జరిగిందో తెలియనట్టు అమ్మడు అమాయకంగా చూస్తోంది.
మౌనంగా వున్నారు కానీ ఎవరి ఆలోచనలు వారివి.
పెద్దావిడ మనసులో అనుకుంటోంది "
పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు కానీ ఈ మేనేజర్లవన్నీ పిదప బుద్దులు. ఆఫీసులో
అమ్మాయిలతో చనువు తీసుకున్నట్టే మా ఆమ్మాయిని కూడా ఏదో చేసివుంటాడు. ఇది చెంప
చెళ్ళుమనిపించింది. మహ మంచి పనిచేసింది. ఇలాటి వెధవలకి ఇలాగే జరగాలి"
అమ్మాయి ఆలోచనలు వేరుగా వున్నాయి
"బహుశా ఆ మేనేజర్ వెధవ నన్నే ముద్దుపెట్టుకోవాలని చూసివుంటాడు. చీకట్లో
తెలియక అమ్మకు పెట్టి ఉంటాడు. అమ్మ తక్కువదా! చాచి కొట్టి వుంటుంది"
మేనేజర్ మరో విధంగా అనుకుంటున్నాడు "ఛ! ఛ! ఎంతపని జరిగింది. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇది ఖచ్చితంగా ఏకాంబరం గాడి పనే అయివుంటుంది. వాడు ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయి పొరబడి నా లెంపలు పగలగొట్టింది. కానీ ఎలా చెప్పడం? పగిలింది నా చెంప కదా!"
మేనేజర్ మరో విధంగా అనుకుంటున్నాడు "ఛ! ఛ! ఎంతపని జరిగింది. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇది ఖచ్చితంగా ఏకాంబరం గాడి పనే అయివుంటుంది. వాడు ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయి పొరబడి నా లెంపలు పగలగొట్టింది. కానీ ఎలా చెప్పడం? పగిలింది నా చెంప కదా!"
ఏకాంబరం ఆలోచనలు మరో విధంగా
సాగుతున్నాయి. కానీ అవి చస్తే బయటపెట్టడు.
" ఈ మేనేజర్ పీనుక్కి తగిన శాస్తే
జరిగింది. అస్తమానూ ఆఫీసులో నా మీద పెత్తనం చేస్తాడు. అయిన దానికీ, కాని దానికీ వంకలు పెట్టి నలుగురిలో అవమానిస్తాడు. ఇన్నాల్టికి
దొరికాడు వెధవ. ఇంకో టన్నెల్ రానీ,
మరోసారి ముద్దు పెట్టిన చప్పుడు
చేస్తాను. మేనేజర్ గాడిద రెండో చెంప కూడా పగలగొడతాను. ఏకాంబరం అంటే
అల్లాటప్పా అనుకుంటున్నాడు వెధవన్నర వెధవ"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి