ఏకాంబరానికి ఏళ్ళు మీద పడుతున్నాయి
కాని పెళ్ళికి ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాడు. ఆస్తికి ఆస్తి, చదువుకు చదువు, మంచి
ఉద్యోగం అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా పెళ్లి లగ్గం మాత్రం ముడిపడడం లేదు. సంబంధాలు రావడం
లేదని కాదు. వస్తున్నాయి. పిల్లాడికి నచ్చిన పిల్ల, పిల్లాడి తల్లికి నచ్చడం లేదు.
వచ్చిన ప్రతి సంబంధానికి ఏదో వంకలు పెట్టి తిరగగొడుతుండడంతో కొన్నాల్టికి ఏకాంబరానికి పిల్లనిస్తామని వచ్చేవాళ్ళే
కరువయ్యారు. అతడి పరిస్తితి చూసి బాధపడ్డ స్నేహితుడు విషయం ఆరా తీసి ఒక సలహా ఇచ్చాడు.
“అచ్చం మీ అమ్మ లాంటి పిల్లను వెతికి చూపించు,
ఏ వంకా చెప్పకుండా ఓకే అంటుంది” అనే ఆ మిత్రుడి సలహా పట్టుకుని, బోలెడు ప్రయత్నం చేసి అచ్చంగా కనుముక్కు తీరు అంతా
వాళ్ళ అమ్మగారి పోలికలే వున్న పిల్లనే వాళ్ళ అమ్మకు చూపించాడు. ఆ అమ్మాయిని చూసి
ఏకాంబరం అమ్మ తెగ మురిసిపోయింది. తెచ్చుకుంటే ఇలాంటి కోడల్నే తెచ్చుకోవాలని
అక్కడికక్కడే ఆ సంబంధాన్ని సెటిల్ చేసింది.
కొన్నాళ్ళ తరువాత మిత్రుడు కలిసి
అడిగాడు ఏమైందని. చూపెట్టిన పిల్ల తల్లికి నచ్చిందని చెప్పాడు. “మరింక ఎందుకు
ఆలస్యం ముహూర్తాలు పెట్టుకోవడానికి” అని అడిగాడు స్నేహితుడు.
“అమ్మకు నచ్చింది సరే. అచ్చం అమ్మలాంటి
అమ్మాయిని చేసుకుంటాను అంటే నాన్న ఒప్పుకోవడం లేదు” అన్నాడు ఏకాంబరం పుట్టెడు
దిగులుతో.
NOTE:
Courtesy Image Owner
1 కామెంట్:
హ హ హ. కానీ తనెంత అదృష్టవంతుడో "ఏకాంబరం" తెలుసుకోలేకుండా ఉన్నాడు :)
ఈ పోస్ట్‌కి పూర్తిగా సంబంధించింది కాకపోయినా జనరల్‌గా పెళ్ళి గురించిన ఓ పాత జోక్ గుర్తొస్తోంది. కాకపోతే విదేశీ జోక్ అవడం వల్ల ఇంగ్లీష్‌లో ఉంది, మన్నించాలి.
వేరే ఊళ్లో ఉంటున్న కొడుకు తండ్రికి ఫోన్ చేసి తను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని అంటాడు. ఆ టైములో తల్లిదండ్రులిద్దరూ హాల్లో కూర్చునుంటారు. తండ్రి ఫోన్‌లో "సంతోషం. వివాహ వ్యవస్ధ చాలా గొప్పది. వివాహం వల్లనే మనిషి జీవితానికి పరిపూర్ణత్వం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా పెళ్ళి చేసుకో" అని కొడుకుతో అంటాడు. వెంటనే మళ్ళీ తండ్రే గబగబా "Your mother has just gone out of the room. Stay single, you fool" అంటాడు కొడుకుతో :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి