21, మార్చి 2016, సోమవారం

తెలిసి వచ్చిన నీతి


పూర్వం ఆలిండియా రేడియో, దూరదర్సన్ లలో పనిచేసే కాలంలో ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, వీటికి బీబీసీ మాదిరిగా స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తే బాగుండు అని.   తధాస్తు దేవతలు ఓకే అన్నారు, ఆ కోరిక తీరింది. జయపాల్ రెడ్డి గారు మా మంత్రిగా వున్నరోజుల్లో పట్టుబట్టి ప్రసార భారతి తెచ్చారు. దీనికి తోడుగా  ప్రైవేట్  ఛానల్స్ కూడా వుంటే ఎంతో బాగుంటుందని కూడా అనుకున్నాను. ఆ  ముచ్చటా తీరింది. ఏ టు జెడ్ ఛానల్స్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. కాకపొతే, ఈ రెండూ సకాలంలో జరక్క ఎక్కడో  కాస్త తేడా వచ్చిందని ఇప్పుడు  అనిపిస్తోంది. దూరదర్సన్ వెలుగు జిలుగులు రువ్వుతున్న రోజుల్లోనే ఆ సంస్థకు పూర్తి స్వేచ్చ ఇచ్చి ఈ పోటీలో దింపి వుంటే ఎలా వుండేదో.
అల్లాగే నాకు మొదటి నుంచి రెండు పార్టీల వ్యవస్థ పట్ల మక్కువ. అదీ తీరింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో  రెండే రెండు పార్టీలు చట్టసభలో పాలక ప్రతిపక్ష పాత్రల్లో కొలువు తీరాయి. (మూడోది పేరుకే కాబట్టి ఒదిలేసాను).
ఎందుకో ఏమిటో మొదటి కోరిక లాగానే ఇది కూడా అలానే దిగులు పుట్టిస్తోంది.

నీతి: లేనిపోని కోరికలు కోరుకోరాదు.       

2 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

ఈ కోరికా తీరుద్దంటారా?

అజ్ఞాత చెప్పారు...

పుట్టగొడుగుల్లాగ చానెల్లు పుట్టుకొచ్చాయి. పచ్చచానెల్లు బెకబెక. ఆంగ్లచానెల్లు లుకలుక. సువార్త చానెల్లు డింగుటక. దైవ చానెల్ తికమక. ఏడుపుగొట్టు సాడిస్ట్ చానెల్లు పకపక. ప్రజలు జజ్జినక.