12, మే 2020, మంగళవారం

నాలుగు వాక్యాల కధ – భండారు శ్రీనివాసరావు


“కూరలో ఉప్పు సరిపోయిందా నాయనా” ఆవిడ అడుగుతోంది.
దేశం కాని దేశంలో ఆ మహాతల్లి తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కన్నతల్లి గుర్తుకువచ్చి  చలపతి కంట్లో ఉప్పటి కన్నీరు ఉబికి వచ్చి తింటున్న కంచంలో పడింది.
“సరిపోయింది”
తన కంటితడి ఆమె కంటపడకుండా పై పంచతో తుడుచుకుంటూ జవాబు చెప్పాడు చలపతి.

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బాగుంది కానీ కథ యెక్క ఉద్దేశం ఏమిటి? 🤔

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు గారికి ఉద్దేశ్యం ఏమీ లేదు. కన్నీరు ఉప్పగా ఉంటుందని చెప్పడమే.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

🙂🙂