చంద్రబాబు
నాయుడికి హై టెక్ సీఎం అనే పేరు ఏనాటి నుంచో వుంది. దానికి తగ్గట్టే టెక్నాలజీకి
సంబంధించిన విషయాల్లో ఆయన ఎప్పటికప్పుడు ‘అప్ డేట్’ అవుతుంటారు కూడా.
‘భారత్
అంబుల పొదిలో మరో కొత్త యుద్ధ విమానం’ అన్నట్టుగా చంద్రబాబు వాడే పదాల పొదిలోకి
కూడా కొత్తవి వచ్చి చేరుతుంటాయి. నిన్న విశాఖలో మరో రెండు కొత్త పదాలను – ‘బ్లాక్
చెయిన్, అగ్రి హ్యాకధాన్’ అనేవాటిని ఆయన ప్రయోగించారు.
ఆయా రంగాలలో నిష్ణాతులైన వారికి ఆ పదాలు కొత్తవి కాకపోవచ్చు కానీ చాలామందికి తెలియనివే అవి.
గత
మూడున్నర సంవత్సరాలుగా ఆయన నోటి వెంట జాలువారిన పదాలను ఒక పెద్దమనిషి
క్రోడీకరించారు. వాటిల్లో మచ్చుకు కొన్ని.
“హాపీనెస్ ఇండెక్స్, బెస్ట్
ప్రాక్టీసెస్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్స్, ఫోర్త్ ఐటి రివల్యూషన్, రియల్ టైమ్
గవర్నెన్స్, ఫైబర్ గ్రిడ్, లార్జర్ కనెక్టివిటీ.... వర్ట్యువలైజేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ సీడింగ్, డ్రోన్స్, మెషిన్ లెర్నింగ్,
రోబోటిక్స్........” ఇలా ఇలా ఎన్నో.
వీటి మూలాలు బోధపడితే కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాదు.
ఆయన
పొడ గిట్టనివారు అంటుంటారు, ఎన్నికలకు
ముందు ప్రసంగాలలో వినబడని ఈ పదాలు, ‘విక్రమార్కుడి సింహాసనం కధ’ లో మాదిరిగా, అధికారంలోకి
రాగానే ఆయన నోటి వెంట ఇలాంటివన్నీ ధారాపాతంగా ఎలా వస్తాయని.
3 కామెంట్‌లు:
ఈ పదాలన్నీ షేర్ మార్కెట్ కి సంబంధించిన చానెల్స్ లో రోజూ చెపుతుంటారు.
ఇంకొక పదం కూడా ఉంది అదే ...బిహేవియరల్ ఎకనామిక్స్...దీనికే (ఈరోజు న్యూస్) నోబెల్ ప్రైజ్ వచ్చింది.
ఈ పదాలన్నీ ఐటి కంపెనీల్లో, కార్పొరేట్ లల్లో వాడుతూ ఉంటారేమో బహుశా. ఓట్లు అడిగేటప్పుడు ఇలాంటి పదాలు వాడితే ఇవి అర్ధం కాని వాళ్ళు ఓట్లేయరేమోనని నాయుడు గారు ఎవాయిడ్ చేస్తున్నట్లనిపిస్తుంది.
వినడానికి బాగా (అనగా వినేవాడికి అర్ధం కావు కానీ చెప్పేవాడు మేధావి అనే అర్ధం వచ్చేటట్టు) ఉండే పదజాలాలు ఎంచుకోవడం చంద్రబాబు ప్రత్యేకత. వీటి అర్ధం ఈయనకీ తెలీదు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి