పెళ్ళయిన ఏకాంబరానికి ప్రేమికుల
దినోత్సవం రోజున తెలియని నెంబరు నుంచి ఫోను వచ్చింది. ఆడపిల్ల గొంతు వినబడగానే
అతగాడికి తెలియని ఉత్సాహం పొంగి పొరలింది. అవతల అమ్మాయి అడిగింది ‘ పెళ్లయిందా
ఇంకా బ్రహ్మచారి బతుకేనా’ అని. ఏకాంబరం చెప్పాడు రెట్టించిన ఉత్సాహంతో ‘ లేదు లేదు
పెళ్లి కాలేదు, ఇంతకీ మీరెవ్వరు’ అని. అవతల స్వరం మారిపోయింది ‘ అల్లాగా! నేనెవర్నా!
నీ పెళ్ళాన్ని. ఇంటికి రా! నీ పెళ్లి చేస్తాను’ అన్నది ఏకాంబరం భార్య.
జారిపోయిన గుండెను వెతుక్కుంటూ వుండగానే ఫోను మరోసారి
మోగింది. మళ్ళీ తెలియని నెంబరు నుంచే. సందేహిస్తూనే ‘హలో’ అన్నాడు. మళ్ళీ ఆడగొంతే.
మళ్ళీ అదే ప్రశ్న ‘పెళ్లయిందా? ఒంటరివారా’ అని. గుండె నిమురుకుంటూ చెప్పాడు’’పెళ్లయింది.
అవును. కానీ మీరెవ్వరు’
‘ఎవర్నా! నీ గర్ల్ ఫ్రెండుని. పెళ్ళయి కూడా కాలేదని చెప్పి మోసం
చేయడానికి సిగ్గువేయడం లేదా! వుండు. నీ పని చెబుతాను’
ఏకాంబరానికి గుండె మరింత కిందికి
జారిపోతుంటే, నోరు పెగుల్చుకుని చెప్పాడు.
‘సారీ బేబీ! ఫోను చేసింది నా భార్య అనుకున్నాను, నన్ను
మన్నించు ప్లీజ్’
‘ఏమిటీ! నిన్ను మన్నించాలా! నేనెవర్ని
అనుకున్నావు, నీ మొహానికి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడానా! నేనే! నీ భార్యనే మాట్లాడుతున్నాను. నీ సంగతి కనిపెట్టాలని మళ్ళీ ఫోను చేసాను.
ఇంటికి రా! ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తేలుస్తాను’ (ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)
(NOTE: COURTESY CARTOONIST)
1 కామెంట్:
����������
కామెంట్‌ను పోస్ట్ చేయండి