కధ అనుకుంటే
కధే. కాదనుకున్నా కధే!
చిత్తగించండి.
లండన్
మహానగరంలో మురుగన్ కోవెల. ప్రతి వారం అక్కడ తమిళ సోదరులు సమావేశం అవుతుంటారు.
ముత్తుస్వామి
అనే అతడికి పెళ్ళయి యాభయ్ ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ల కాపురం ఎలాటి కలతలు లేకుండా
యెలా సాగిందో కారణం చెప్పాడు ముత్తుస్వామి.
"పెళ్ళయిన
దగ్గరనుంచీ ఆవిడ్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాను. ముచ్చటపడ్డ నగలూ చీరెలు
అన్నీ కాదనకుండా కొనిపెట్టాను. పెళ్ళయిన పాతికో ఏట రజితోత్సవ కానుకగా మా ఆవిడ్ని చెన్నైలో ఆమె పుట్టింటికి
తీసుకువెళ్లాను. యెంత సంతోషపడిందో మాటల్లో చెప్పలేను"
"బాగుంది
మీ అన్యోన్య కాపుర రహస్యం. మరి ఇప్పుడు యాభై ఏళ్ళ పండుగకు ఏమి కానుక ఇస్తున్నారు
?"
"ఏముంది.
ఆమెను లండన్ తీసుకురావడానికి మళ్ళీ చెన్నై వెడదామని అనుకుంటున్నాను"
(కార్టూనిస్ట్ మల్లిక్ గారికి కృతజ్ఞతలతో)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి