24, జూన్ 2014, మంగళవారం

23 ఏళ్ళు వెనక్కు తిప్పిన 23 గంటలు



నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటలప్పుడు హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో కరెంటు పోయింది. ఇదేమంత పెద్ద వార్త కాదు. పొద్దున్న కాసేపు వచ్చినట్టే వచ్చి మళ్ళీ చక్కాపోయింది. అది కూడా పెద్ద వార్త కాదు. ఇలాంటి కోతలకు సిద్ధపడ్డ బతుకులే కాబట్టి, సర్డుకుపోదామని అలాగే సర్డుకున్నాము.



అప్పుడు మొదలయింది అసలు కధ. నవనాడులు కుంగి పోవడం అంటారు చూసారు అలా ఒక్కొక్కటిగా అన్నీ,  అంటే కరెంటు పోయినప్పుడు పనికి వస్తుందని అమర్చుకున్నఇన్వర్టర్, నెట్ కనెక్షన్, కేబుల్ టీవీ,  పైకి  సంపులోకి నీళ్లు ఎక్కించే మోటారు  ఇలా ఒకటి వెంట మరొకటి  కన్ను మూయడం మొదలెట్టాయి. వాటికి సానుభూతిగా ఇంట్లో వున్న సెల్ ఫోన్ చార్జర్లు అన్నీ కట్టగట్టుకుని అదే బాట పట్టాయి.  కొద్దిగంటల్లోనే మా జీవితాలు ఒక్కసారిగా రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయాయి. నెట్టు, సెల్ ఫోన్. టీవీ ఈ సౌకర్యాలన్నీ ఒక్క కరెంటు దెబ్బతో హుష్ కాకీ. అలా ఏదో సినిమాలో పాత జన్మలోకి వెళ్లిన ఫీలింగు కలిగించి, కరెంటమ్మగారు తాపీగా మళ్ళీ ఈ రాత్రి అంటే మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు గృహప్రవేశం చేసింది. శుభం.

కామెంట్‌లు లేవు: