21, జూన్ 2014, శనివారం

గాడిద గుడ్డేమీ కాదు! అనకండి.



ఇప్పుడు ఎక్కడ చూసినా అడ్డగాడిదలే కానీ అసలు గాడిదలు కానరావడం లేదని ఒ ఖరపోషకుల వారు తెగ బాధ పడిపోయారు. అలాటి  వారు అర్జంటుగా విదేశీ యాత్ర చేయడం మంచిదని ఫారిన్ పత్రిక టెలిగ్రాఫ్ సలహా ఇస్తోంది. 


బెల్జియం, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, టర్కీ మొదలయిన దేశాల్లో ఇప్పుడు గాడిద పెంపక కేంద్రాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయన్న వైనాన్ని ఆ పత్రిక ఒక కధనంలో పేర్కొన్నది. నేపిల్స్ పరిశోధకులు అదేపనిగా పరిశోధనలు చేసి తల్లి పాలల్లో వుండే పోషకాలన్నీ గాడిద పాలల్లో పుష్కలంగా వున్నాయంటున్నారట.


అంతే కాదు,  గాడిద పాలను  ఆ దేశాల్లో ఏకంగా లీటరుకు పందొమ్మిది డాలర్లు పెట్టి కొంటున్నారట. ఆ పాలతో చేసిన క్రీములు, బిస్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. దీనితో, 'గంగి గోవు పాలు గరిటెడయినను చాలు కడివెడయిననేమి ఖరము పాలు..' అనే పద్యపాదానికి ఆ దేశాల్లో కాలం చెల్లిపోయిందంటున్నారు.  
Photo Courtesy Image Owner     

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మొన్నెక్కడో చదివాను, విశాఖపట్నంలో ఆంధ్రోళ్ళు గాడిద పాలు తాగి తెలివిమీరి పోతున్రంట.

voleti చెప్పారు...

ఆంధ్రోళ్ళు కనీసం గాడిద పాలు తాగి తెలివైన వాళ్ళు అవుతున్నారేమో.. తెలంగాణోళ్ళకి ఏ పాలు దొరక్క అజ్ఞాతలుగా అజ్ఞానులుగా వుండిపోతున్నారు..

అజ్ఞాత చెప్పారు...

తెలబాన్లకి వేరె గాడిద పాలవసరం లేదు. వాళ్ళు గాడిద సంజాతలు, సంతానం కదా.