15, మే 2014, గురువారం

కాకతాళీయం


ప్రముఖ మానవతావాది, స్త్రీ జనోద్ధరణ ఉద్యమ నాయకురాలు శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారు మరణించినట్టు అమెరికా నుంచి ఇన్నయ్య గారు పెట్టిన పోస్ట్ చదువుతుంటే ఆకాశవాణి మాజీ ఎనౌన్సర్ శ్రీమతి రత్నప్రసాద్ ఫోన్ చేశారు. ఆవిడ పుట్టెడు దుఃఖంలో వుండి మాట్లాడుతున్నారు అనిపించింది. కేవలం రెండు నెలల తేడాలో భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. మొదలు పెడుతూనే జాతస్య మరణం ధృవం అంటూ - 'ఎందరి గురించో రాస్తుంటావు, నేను పోతే నా గురించి కూడా రాయి బాబూ' అన్నారు. నాకేమనాలో తోచక అలా 'అనకండి ముందూ వెనుకగా అందరం పోవాల్సిన వాళ్ళమే. పోయేదాకా ఇంకా బతుకు వుంది అనే ఆశతో బతుకుతుంటాం.' అని వోదార్చే ప్రయత్నం చేసాను. ఇంతలో ఆవిడకు మరో ఫోను వచ్చినట్టుంది. మళ్ళీ చేస్తాను అని కాసేపట్లో మళ్ళీ ఫోను చేశారు. 'యెంత పనయిందో చూసావా శ్రీనివాసూ, మా వియ్యపురాలు సుబ్బమ్మ గారు పోయారు. ఇప్పుడే సమాచారం అందింది' అన్నారు. అంతకు ముందు ఆవిడ ఫోను మాట్లాడుతున్నప్పుడే నేను ఇన్నయ్య గారు పంపిన ఆ సమాచారమే చదువుతున్నాను. ఆ  సమయంలో చావు వార్త చెప్పడం ఎందుకని మిన్నకుండి పోయాను. నిజానికి మల్లాది  సుబ్బమ్మ గారు ఎవరో కాదు, రత్న ప్రసాదు గారి వియ్యపురాలే. ఆ సమయంలో ఈ విషయం నాకు స్పురణకు రాలేదు. యెంత కాకతాళీయం. నిజానికి మనిషి జీవితమే ఇటువంటి సంఘటనల సమాహారం.


(Smt. Malladi Subbamma garu)

దేవుడూ, ఆత్మలు అవీ నమ్మని మనిషి కాబట్టి సుబ్బమ్మ గారి విషయంలో -  'సుబ్బమ్మగారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి' అనే షరా మామూలు సందేశాలు అవసరం పడవు.

1 కామెంట్‌:

చెప్పారు...

పేస్ బుక్ లో మీ పోస్ట్ చూసి రాస్తున్నాను. శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారు ఒ క ఉన్నతమైన వ్యక్తీ. ఇటీవలి కాలంలో వారిని చూడలేకపోయినా మీరు పోస్ట్ చేసిన ఫోటో ద్వారా చూడగలిగాము. వారి వాగ్ధాటి మర్చిపోలేము. వారు ఆరోగ్యంగా వున్నపుడు వారు వచ్చిన మీటింగ్స్ లో వారి ఉపన్యాసాలు వినేవాళ్ళము. వారు నాకు ఒకసారి పుస్తకాలు కూడా ఇచ్చారు. వారి అనుభూతులను మీరు అందించిన పోస్ట్ ద్వార మరోసారి గుర్తు చేసినందుకు మీకు కృతఙ్ఞతలు.
(మిమ్మల్ని తురగా జానకీ రాణి గారి బుక్ రిలీజ్ function లో చూసాను)