ఏరీ! వారేరీ! కనరారేమీ!
"ఏ కష్టం వచ్చినా మీ వెంటే వుంటాం. మీ వెన్నంటే వుంటాం. ఏ అవసరం
వచ్చినా సరే, ఓ చిటికేస్తే చాలు చిటికెలొ మీ వద్దకు వస్తాం" నిన్న మొన్నటి
వరకు ఇలాటి మాటలే రాజకీయ నేతల నోటివెంట జల్లులా కురిసాయి.
అకాల వర్షాల తాకిడితో ఆరుగాలం కష్టం ఆవిరైపోతున్న వేళ, వాననీటిలో పంటలు
మునిగి, ధాన్యం తడిసి, పండు రాలి, గుండె
పగిలి, రైతన్నలు కన్నీరు మున్నీరై పోతూ
విలవిలలాడిపోతున్న విషాద తరుణంలో -
ఏరీ! వారేరీ! ఒక్కరూ కనరారేమీ!