Please CLICK here to listen the song సవర్త పాట
ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటా జరిగే పండుగ పాట – ఈ సవర్త
పాట.
నలుగురు కలసిన సందర్భాన్ని పురస్కరించుకుని
ఆడంగులు నలుగురూ కలసి అక్షరాలా ఎనభై అయిదేళ్ళ సరసక్కయ్యను అడిగి మరీ పాడించుకున్న
పాట ఇది. అంతవయస్సులో గుర్తుపెట్టుకుని పాడిన ఈ పాటలో ఏదయినా పొరబాట్లు కనిపిస్తే/వినిపిస్తే,
దాని వింటూ తిరిగి రాసుకోవడంలో జరిగిన ఆ
తప్పు అక్షరాలా నాదే కాని ఆమెది కాదు.
సరసక్కయ్య పాడిన సవర్త పాట :
‘సువ్వియనుచు పాడరమ్మా
‘సుందరాంగిని చూడరమ్మా
‘నవ్వే మాట కాదె కొమ్మా
‘నాతి సవర్తలాడెనమ్మా
‘బువ్వదినుట నేరదమ్మా
‘పూబోణి ఎరుగదమ్మా
‘తల్లి చూచి చెప్పగానే
‘తలనువంచి నవ్వేనమ్మా
‘విప్రవరుల
పిలవరమ్మా
‘విప్పి పంచాంగం చూడగానే
‘యుక్తమైన నక్షత్రమమ్మా
‘సువ్వియనుచు పాడరమ్మా
‘సుందరాంగిని చూడరమ్మా’