"ఏమిటి మీ విషయం. పెట్టి పుట్టినట్టున్నారు.
అందుకే తీరిగ్గా కూర్చుని ఇలా ఎడాపెడా రాసేస్తున్నారు' అని అడిగారొక ఫేస్ లెస్
బుక్ మిత్రుడొకరు.
పెట్టి పుట్టిన బాపతు కాకపోయినా పుట్టి పెట్టిన
సంగతి కొంత నిజమే. 'ఇన్నేళ్ళు ఉద్యోగాలు చేసి ఒక్క ఇల్లు కూడా ఏర్పరచుకోలేదా' అని ఎద్దేవా
చేస్తుంటాడు నా పత్రికా మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ కూడా, అక్కడికి తానో (సొంత) ఇంటివాడయినట్టు.
కొందరు ఆస్తుల్ని కూడబెట్టుకుంటారు. అదేమిటో
చిత్రం నేను ఆస్తుల్ని కన్నాను, ఇద్దరు కొడుకుల రూపంలో. చిన్నతనంలో వాళ్లకు ఏం
చేసామో యేమో గుర్తు లేదు (అసలు ఏమన్నా చేస్తే కదా గుర్తు వుండడానికని మా ఆవిడ
సన్నాయి నొక్కులు). కానీ, ఇప్పుడు మా పెద్దతనంలో మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
ఇక ఇళ్ళూ వాకిళ్ళూ లేవని బెంగ యెందుకు?
అందుకే ఇలా తిని కూర్చుని తీరిగ్గా 'కడుపు నిండిన
కబుర్లు' చెప్పడం.
అర్ధం అయిందా ఫేస్ లెస్ (నేమ్ లెస్) బుక్
స్నేహితుడు గారూ!.