8, నవంబర్ 2024, శుక్రవారం

తీరని సందేహం



 ఓరోజు,  ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes 112.26
Service tax (4.2%) 4.71
Swachh Bharat Cess (0.15%) 0.17
Krishi Kalyan Cess (0.15%) 0.17
COLLECTED ₹ 117.31

అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు 0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15 శాతం మరో పదిహేడు పైసలు చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ఆకాంక్ష.  ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!
ఇది జరిగి ఎనిమిదేళ్లుఅయింది. మెయిల్స్ డిలీట్ చేస్తుంటే కంటపడింది. ఇన్నేళ్లలో ఉబెర్ రేట్లు పెరిగాయి. అలాగే టాక్సులు కూడా. మరి దేశంలో ప్రతి ఒక్కరి నుంచి ప్రతి లావాదేవీ మీద మనం చెల్లిస్తున్న పన్నులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయా? లేక మన నుంచి వసూలు చేసిన పన్ను మొత్తాలను ఆయా వ్యాపార సంస్థలు ఖజానాకు దఖలు పరుస్తున్నాయా? లేదా?
ఈ అనుమానాన్ని ఓ కేంద్ర ప్రభుత్వ పన్నుల అధికారి వద్ద వ్యక్తం చేశాను.
‘మనం దుకాణానికి వెళ్లి ఏదో వస్తువు కొని బ్యాంకు కార్డు మీద చెల్లింపు చేస్తాం. వెంటనే అంత మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయినట్టు మన ఫోనుకు మెసేజ్ వస్తుంది. హోటల్ కు పోయి తిన్నదానికి బిల్లు కడతాము. మనం కట్టిన పన్ను వివరాలు ఆ బిల్లులో వుంటాయి. కానీ ఆ పన్ను సరాసరి ప్రభుత్వ ఖజానాకు  చేరిందా లేదా, అసలు చేరుతుందా లేదా   అనే అనుమానం పీకుతూనే వుంటుంది. హోటల్ కు మనం పన్నుల రూపేణా చెల్లించిన డబ్బు హోటల్ బ్యాంకు ఖాతా నుంచి ఎకాఎకి  ఖజానాకు చేర్చే వెసులుబాటు సాంకేతికంగా కల్పిస్తే బాగుంటుంది కదా!  అలాగే మనం చెల్లించిన పన్నులు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్టు ఓ మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తే ఇలాంటి సందేహాలు రావు కదా! ‘
అంతా విని ఆయన ఇలా జవాబు ఇచ్చాడు.
‘మీరు చెప్పేది నిజమే. కానీ దేశంలో ప్రతి రోజు ప్రతి క్షణం, ప్రతి   నిమిషం, లక్షల కోట్ల విలువైన  లావాదేవీలు కోట్ల సంఖ్యలో జరుగుతుంటాయి. అంత భారాన్ని నిభాయించగల భారీ సర్వర్లు ఏర్పాటు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వున్నాయి’.
ఈ జవాబు విన్న తర్వాత
ఇక నా దగ్గర ప్రశ్నలు ఏముంటాయి?  లేవు.
కానీ అనుమానం మాత్రం అలానే వుండిపోయింది.

10 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

కాబట్టి మధ్యలో గుటకాయ స్వాహా అయినా తెలియదు :)

Bonagiri చెప్పారు...

డిజిటల్ చెల్లింపులు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి చేరుతాయని అనుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

If they maintain proper records, they have to pass on these taxes to the government. If they maintain two account books, then it depends on the vendor, how much to pass on to the government :)
I heard long long ago about rice millers in small villages, they make a provision in their rice mill that some quantity of rice goes to a secret hole. This is similar to that :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్రైవేట్ కంపెనీల్లో “గుటకాయ స్వాహా” అరుదేమీ కాదు.
వసూలు చేసిన సేల్స్ టాక్స్ ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా తామే వాడేసుకోవడం. బకాయిలు చెల్లించమని తరువాత Sales Tax డిపార్ట్ -మెంట్ వారి తాఖీదులు వస్తే గంతులెయ్యడం.
అలాగే తమ ఉద్యోగుల జీతాల్లో పట్టుకున్న LIC ప్రీమియంలు (under SSS అంటే Salary Savings Scheme) LIC కు పంపించకుండా వాడేసుకోవడం (పోతే పోయేది ఆ ఉద్యోగస్తుడి LIC policy యే కదా).
అటువంటి దారుణాలే ఉద్యోగస్తుల ప్రోవిడెంట్ ఫండ్, ESI contributions ని ఆ ప్రభుత్వ శాఖలకు జమ చేయకుండా కంపెనీయే వాడేసుకోవడం ….. అబ్బో వీళ్ళ లీలలు చెప్పలేం.

ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే కదా అని పైన మిత్రుడు బోనగిరి గారు ఆశాభావం వ్యక్తం చేసారు. అదేమీ ఘంటాపథంగా చెప్పలేం. కంపెనీలు డైరెక్ట్ గా కట్టేవి వెడతాయి. కానీ ఇతరుల నుంచి వసూలు చేసినవి డైరెక్ట్ గా ప్రభుత్వానికి వెళ్ళవు - ఎందుకంటే బిల్లింగ్ కు, వచ్చిన బిల్లు డబ్బు లెక్క వ్రాసుకోవడానికి దేశమంతా అందరు వ్యాపారులు ఒకే software ని వాడరు కదా. కాబట్టి మళ్ళీ కథ మామూలే.

అజ్ఞాత చెప్పారు...

Always suspecting Sam this man

అజ్ఞాత చెప్పారు...

suspecting sam with selective amnesia

అజ్ఞాత చెప్పారు...

Salaried employees and pensioners are probably the only group which cannot evade taxes on their income.

Zilebi చెప్పారు...

అవును అవును వినరా వారు సందేహపు సహోదరులు :)

అజ్ఞాత చెప్పారు...

Blogger a doubting Thomas with selective amnesia

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“జిలేబి” గారు (10 Nov 2024 at 5:14 am),
నన్నా మీరు, పైన ఇద్దరు అజ్ఞాతలు అంటున్నది ?

Sam ఎవరో నాకు తెలియదు.

ఇక నా వ్యాఖ్యలో నేనిచ్చిన ఉదాహరణలు నా ఉద్యోగపర్వంలో నేను సాక్షాత్తూ చూసినవి. ఆ వ్యాపార / పారిశ్రామిక సంస్థల యజమానులకు ఇచ్చిన నోటీసుల కాపీలు మా ఆఫీసుకు కూడా పంపించేవారు సదరు ప్రభుత్వ శాఖలు - వాళ్ళ ఖాతాల గురించి. కాబట్టి వ్యాపారుల / పారిశ్రామిక వేత్తల లీలల గురించి నా మటుకు నాకు మీరన్న “సందేహమేమీ” లేదు. అందరూ రతన్ టాటాలు ఉండరు.