ఫేస్ బుక్ మిత్రులు కప్పగంతు శివరామ ప్రసాద్ గారు వస్తుతః రేడియో అభిమాని. రేడియో అంటే ఆకాశవాణి. దానికి సంబంధించిన చాలా సమాచారం సేకరించి పెట్టుకున్నారు. ఈ మధ్య నాకు వాట్సప్ లో ఓ పాత గ్రూపు ఫోటో పంపారు. అది 1969 నాటి ఫోటో. అలనాటి రేడియో ధిగ్గజాలు అనేకమంది అందులో వున్నారు. శివరామ ప్రసాద్ గారికి తెలిసిన పుణ్యాత్ములు, ఫిరంగిపురానికి చెందిన టి. శ్యాం నారాయణ గారు ఈ తెలుపు నలుపు ఫొటోకు రంగులు అద్దారు. దాన్ని నేను ‘ఒకనాటి స్వరచరులు’ అనే రేడియో గ్రూపులో షేర్ చేసాను. విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రయాగ వేదవతి గారు తమ సహజ ధోరణిలో వేగంగా స్పందించారు. ఆ ఫొటోకు సంబంధించిన వివరాలు తెలియచేశారు.
అరవై ఒక్క ఏళ్ళ క్రితం బెజవాడ రేడియో స్టేషన్ లో పనిచేసిన కందుకూరి రామభద్రరావు గారు, ప్రయాగ నరసింహ శాస్త్రి గారు (వేదవతి గారి తండ్రి) పదవీ విరమణ సందర్భంగా తీసిన ఫోటో అది. వేదవతి గారి సమాచారం ప్రకారం ఈ కింది ఫోటోలో :
ముందు వరసలో కింద కూర్చున్న వారు (ఎడమ నుంచి): ఏ. కమల కుమారి, వి.బి. కనకదుర్గ, శ్రీరంగం గోపాల రత్నం, వి. నాగరత్నం, వింజమూరి లక్ష్మి, బీ.టీ. పద్మిని, పద్మినీ చిత్తరంజన్ గార్లు.
కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు (ఎడమ నుంచి) : అన్నవరపు రామస్వామి, ఎల్లా సోమన్న, ఓలేటి వెంకటేశ్వర్లు, కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహ శాస్త్రి, జి.వి. కృష్ణారావు, రాచకొండ నరసింహమూర్తి, ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు గార్లు.
వారి వెనుక నిలబడిన వారు (ఎడమనుంచి): రామవరపు సుబ్బారావు, కనకారావు (అని గుర్తు), ఏ.ఎస్.వి. కుటుంబయ్య, దండమూడి రామ్మోహన రావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ఉషశ్రీ, ఎం.వి. వాసుదేవమూర్తి, సి. రామ్మోహనరావు, జి.ఎం. రాధాకృష్ణ, కనకారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, వి. చార్లెస్, క్రొవ్విడి సీతారాం గార్లు.
వారి వెనుక చివరివరసలో నిలబడిన వారు: (ఎడమనుంచి): మొదటి వ్యక్తి తెలియదు. నండూరి సుబ్బారావు, పాండురంగరాజు, సుందరపల్లి సూర్యనారాయణ, ఎన్.సీ.వీ. జగన్నాధాచార్యులు, ఏ. లింగరాజు శర్మ, ఏ.బీ. ఆనంద్, వై. సుబ్రహ్మణ్యం (ఫ్లూట్), వై. సత్యనారాయణ రావు (వీరు కొద్ది రోజులు అనౌన్సర్ గా పనిచేసారు) ఈ వరసలో కూడా చివరి వ్యక్తి తెలియదు.
చాలా కాలం అయినందువల్ల కొందరి పేర్లు పొరబాటు పడితే మన్నించమని కూడా వేదవతి గారు కోరారు.
గమనిక : నేను విజయవాడ రేడియోలో ఎప్పుడూ పనిచేయలేదు. అప్పుడప్పుడూ వార్తావిభాగానికి వచ్చి పనిచేసినా ఉదయం వార్తల వరకే. కాబట్టి నా టైపింగులో ఏమైనా పొరబాటు దొర్లితే క్షంతవ్యుణ్ణి (తప్పులు ఎత్తి చూపితే దిద్దుబాటుకు అవకాశం వుంటుంది.
1 కామెంట్:
అపురూపమైన memorabilia.
ఆ కాలంలో ఆల్ ఇండియా రేడియో ఉద్యోగులకు తెల్ల దుస్తుల నిబంధనేమన్నా ఉండేదాండీ శ్రీనివాస రావు గారు? లేక ఆ ఇద్దరి ప్రముఖుల పదవీ విరమణ సందర్భంగా కూడబలుక్కునీ అందరూ తెల్ల దుస్తులు ధరించి వచ్చారా ఆ రోజున (ఇద్దరు మహిళలు మినహా) ? ఫొటోలో చూడడానికి బాగుంది లెండి; నా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి