16, మే 2020, శనివారం

వెతుకులాటలో దొరికిన ఆణిముత్యం


శ్రీ సీతారామాంజనేయ సంవాదం
నిజానికిది రామాయణంలోని కాదు.
ఆధ్యాత్మిక రామాయణంలోని సంవాదానికి ఆనంద స్వరూపంగా తానిది రాసానని గ్రంధకర్త పరశురామ పంతుల లింగమూర్తి అను గురుమూర్తిగారే పేర్కొన్నారు. దీనికి రచయిత, వ్యాఖ్యాత, ఆనంద బంధువు ''లింగమూర్తి'' గురుమూర్తిగారే.  తదనంతరం కాలంలో వజ్ఘల నారాయణ శాస్త్రులుగారు, శ్రీ పరశురామ పంతులుగారి ఆనందానికి, బ్రహ్మానందంగా తమ వ్యాఖ్యానం జతచేసి భక్తులకు అందించారు.
రచయిత ఈ గ్రంధంలో కొన్ని సాహిత్యపరమైన చమక్కులు చేసారు. ద్వితీయాశ్వాసము 350 వ పుటలో ఒక కంద పద్యం వుంది. సంవాదంలో భాగంగా సీతమ్మ వారు ఆంజనేయునితో ఇలా అంటారు. ఈ కందం ఏకాక్షర పద్యం. కేవలం ‘న’ అనే అక్షరంతో ఈ పద్యం నడక సాగుతుంది.
 “నానానానుని ననిన, న్నేనే నననిన్ను నన్ను నేనన ననినన్
నేనను నేనన్నానా, నేనను నన్నెన్ని నన్ను నిను నేనరా”
గతంలో ఆంధ్రసారస్వత పరిషత్ (ఇప్పుడు తెలంగాణా సారస్వత పరిషత్) వారు   ఈ గొప్ప రచయిత లింగమూర్తి అను గురుమూర్తి  జీవితమూ – సాహిత్యము పై ఒక గ్రంధాన్ని ప్రచురించారు. ఆచార్య దివాకర్ల వెంకటావధాని, శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి ఈ పుస్తకాన్ని రచించారు. వీరేశలింగ గ్రంధాలయంలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది. ఆన్ లైన్ లో కూడా లభ్యం అని కొందరు చెప్పగా విన్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు తమ నవ జీవన వేదంలో కూడా ఈ రచయిత ప్రస్తావన చేసారు.  

4 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

ఈ పుస్తకం archive.org సైట్ వారు అందిస్తున్నారండీ. మీరు samvadamu అని search చేస్తే చాలు కనిపిస్తుంది, download చేసుకోవచ్చు.

నీహారిక చెప్పారు...

నానానానుని ననిన, న్నేనే నననిన్ను నన్ను నేనన ననినన్
నేనను నేనన్నానా, నేనను నన్నెన్ని నన్ను నిను నేనరా”
What is the meaning Sir?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@నీహారిక: పైన శ్యామలీయం గారు పేర్కొన్న పుస్తకంలో టీకా తాత్పర్యం వుంది. చాలా చిన్న అక్షరాల్లో వుండడం చేత చదవడం కష్టం అయింది. అంచేత రాయలేకపోయాను. నాకు అర్ధం అయినంతవరకు నేను, నువ్వు అనే తేడాల గురించి అనుకుంటాను