‘ఏరా సీనప్పా! (మా ఇంట్లో
పెద్దవాళ్లందరూ ఇలాగే పిలుస్తారు) ఎలా ఉన్నావురా! హైదరాబాదు వద్దామనుకున్నా. కానీ
విషయం నీకూ తెలుసు కదా!’
ఆమె మా పెద్దత్తయ్య కూతురు. వయసు ఎనభయ్
పైమాటే. ఇంట్లో అందరూ చిట్టీ అనేవారు.
ఇన్నేళ్ళుగా అదే పేరు. అసలు పేరు అందరూ మరచిపోయారు. పదిహేనో ఏట పెళ్లయింది.
పుట్టిల్లు ఖమ్మం మామిళ్ళగూడెం నుంచి అత్తగారిల్లు నల్గొండ రామగిరికి చేరింది.
అప్పటినుంచీ ఆ భార్యాభర్తలు విడిగా వున్నది లేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసే.
నా భార్య ఆగస్టు పదిహేడో తేదీ రాత్రి
చనిపోతే మా చిట్టి వదిన భర్త శ్రీ కొమర్రాజు మురళీధరరావు గారు తన 87వ ఏట ఆగస్టు 24న కన్నుమూశారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న
ఈ మనిషి నాకు ఫోను చేసి ఊరడింపు వాక్యాలు చెబుతుంటే నాకు నోటెంట మాట పెగల్లేదు.
కింది ఫోటోలో: మంచం మీద కూర్చుని
(ఎర్రచీర) ఆట షో చూపిస్తున్న పెద్దావిడ మా వదిన గారు. భార్య పేకాటలో గెలిచి షో
చూపిస్తుంటే మందహాసంతో గమనిస్తున్నది ఎవరో కాదు, పరిపూర్ణ జీవితం గడిపి ఈ మధ్యనే తనువు
చాలించిన మురళీధరరావుగారే.
1 కామెంట్:
ఒకరినొకరు ఓదార్చుకోవడం సరైనదే. ఇంట్లో పేకాట అందునా ఆడవాళ్లు ఆడటం మంచిదికాదు. రాయలసీమలో ఇలా ఇళ్లలో పేకాట ఆడటం దాదాపు నిషిద్ధం. ఆ వయసు వాళ్ళు పేకాట ఆడుతుంటే నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. దయచేసి అన్యధా భావించవద్దు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి