అలనాటి సోవియట్ యూనియన్ లో కొత్తగా వెళ్ళిన మా బోంట్లకు అక్కడ
చాలాకాలంగా ఉంటున్న వాళ్ళు ఓ నీతి బోధ చేసేవాళ్ళు.
‘కనబడిన క్యూలో నిలబడు. కనబడ్డ ప్రతిదీ
కొనుక్కో. కొన్న వస్తువు పనికొస్తుందా రాదా అన్నది ఇంటికి వెళ్లి చూసుకో”
దీనికి కారణం వుంది. ఆ దేశంలో ప్రతిదీ
బీరు నుంచి కారు వరకూ అన్నీ కారు చౌకే. లీటరు పాలు ముప్పయి కోపెక్కులు. (మన పైసల
వంటివి). లీటరు పెట్రోలూ ముప్పయి కోపెక్కులే. కార్లూ, రిఫ్రేజ్ రేటర్లు
ఏవీ ఖరీదు కావు. చౌక అనే దానికి తోడు ప్రజల కొనుగోలు శక్తి కూడా అపరిమితం. దానాదీనా
జనాలు అవసరం వున్నా లేకపోయినా, అవసరానికి
మించి కొనుగోళ్ళు చేసేవాళ్ళు. అంచేత వచ్చిన సరుకులు వచ్చినట్టు క్షణాల్లో
అయిపోయేవి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు.
అవసరానికి మించి కొనుగోళ్ళు జరపడం వల్ల
కృత్రిమ కొరత ఏర్పడేది. దానితో పాటే క్యూలు పెరిగిపోయేవి. మనిషికి ఇన్నే అనే
నిబంధన పెడితే అందరికీ దొరికేవేమో. కానీ ప్రజా సంక్షేమం పేరుతొ అలాంటి ఆంక్షలు
ఉండేవి కావు.
ఏతావాతా జరిగింది ఏమిటంటే ఏ కొరతా లేని
దేశంలో అన్నిటికీ కొరతలు ఏర్పడ్డాయి.
కొరత మాట ఎలా వున్నా ఏదీ ఖరీదు కాదు.
అంచేత దొరికిందే కొనుక్కుందామని క్యూలలో కాలక్షేపం చేయడం జనాలకు అలవాటయింది. అదృష్టం
బాగుంటే ఆ రోజు క్యూబా నుంచి దిగుమతి అయిన తాజా తాజా అరటి పండ్లు డజన్ల కొద్దీ ఇంటికి
తెచ్చుకోవచ్చు. అదృష్టం మరీ పుచ్చితే జర్మనీలో తయారయిన నాణ్యమైన ఎలెక్ట్రానిక్
వస్తువులు దొరకొచ్చు. ఖరీదు మాత్రం రూబులు (రూపాయ్) దాటితే గొప్ప.
ఒకసారి ఇలానే ఓ క్యూలో నిలబడి చాలా
చవగ్గా కనబడ్డది ఒకటి కొని ఇంటికి తెచ్చాను. ప్యాకెట్ మీద రష్యన్ లో ఏదో రాసుంది. అదేమిటో తెలియక పక్కన పడేశాను. తీరా
ఎవరో చెప్పారు, అది చెకొస్లవేకియాలో కట్
గ్లాస్ తో తయారుచేసిన విస్కీ సెట్ (డికా౦టర్)
అని. మనదేశంలో దాని ఖరీదు వేలల్లో వుంటుందని.
2 కామెంట్లు:
దీన్ని బట్టే తెలుస్తోంది సోవియట్ రష్యాలో ఎకనమిక్ పాలసీలు ఎంత భ్రష్టాకారిగా ఉండేవో..
కట్ గ్లాస్ అందమే వేరు👌.
కామెంట్‌ను పోస్ట్ చేయండి