అని ఓ తెలుగు సినిమా పాట వుంది.
అది ఇప్పుడు గుర్తుకు రావడానికి కారణం వుంది.
రాజకీయ నాయకులు పార్టీలు ఎప్పుడు మారుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఓ జర్నలిష్టు
మిత్రుడు ఏకంగా ఓ ధర్మా మీటరు కనిపెట్టాడు. ఎవరయినా ఒక లీడరు తన సొంత పార్టీ
అధినాయకుడ్ని మీడియాలో పనికట్టుకుని అదేపనిగా పొగుడుతున్నాడు అంటే అతగాడు
అతిత్వరలోనే ఆ పార్టీని ఒదిలి వెడుతున్నాడని అర్ధం. అల్లాగే, ప్రతిపక్షాన్ని
అదేపనిగా చీల్చి చెండాడుతున్నాడు అంటే రేపోమాపో ఆ పార్టీలోకే గోడ దూకుతున్నాడు అని
అర్ధంట.
అంటే ఏమిటన్న మాట. రాజకీయ నాయకులు సొంత పార్టీకి ఎప్పుడు గుడ్ బై చెబుతున్నారు, ఇంకో పార్టీలోకి ఎప్పుడు
దూకుతున్నారు తెలుసుకోవాలంటే టీవీల్లో చర్చలు చూస్తే సరిపోతుందని ఆ మితృడి కవి హృదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి