22, అక్టోబర్ 2015, గురువారం

అమరావతి రివ్యూ

ఆరంభం అదిరింది.
ఒక కార్యక్రమాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించడం ఎట్లాగో విదేశీయులకి కూడా తెలిసివచ్చేలా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు ఘనంగా  జరిగాయి.
ఏదీ తక్కువ చేసి చెప్పడానికి వీలు లేదు. అంతా నెంబర్ వన్. సందేహం లేదు.

కాకపోతే, క్లైమాక్సే  నిరాశ పరిచింది.
నిర్మాతకు గిట్టుబాటు కాదు కాని, టీవీ తెరలపై వంద రోజుల బొమ్మ. 

11 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఏం, కైమాక్స్ కి ఏమయింది? (మీరలా అంటే నేనేమయినా మిస్సయ్యానా అని అనుమానం.)

అజ్ఞాత చెప్పారు...

No declaration by Modi :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఓహ్ అదా. అయినా ఢిల్లీ నుండి మట్టి, నీళ్ళు తీసుకువచ్చానని "declare" చేసారు గదా :) థాంక్స్ అజ్ఞాత గారూ.
ఇంతకీ శ్రీనివాసరావు గారు శంకుస్ధాపన కార్యక్రమానికి వెళ్ళివచ్చారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - కొన్నేళ్ళ క్రితం ఒక సినీ నటుడి వివాహానికి ఆహ్వానం అందితే ఎగురుకుంటూ వెళ్ళాము. అభిమానుల తొడతొక్కిడిలో నలిగిపోయి కుంటుకుంటూ తిరిగొచ్చాము. కావున, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే వుండాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

< "ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే వుండాలి."
హ హ్హ హ్హ హ్హ, ఇప్పుడు నాదీ అదే policy అండి శ్రీనివాసరావు గారూ.
ఒకప్పుడు నేనూ ఓ పేద్ద పత్రికాధిపతి ఆహ్వానం మీద ఆయన ఇంట్లో వివాహానికి వెళ్ళాను. మీడియావారు కాబట్టి రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా హాజరయ్యారు. హడావుడే హడావుడి.
మరోసారి ఓ టాప్(చాలా టాప్ స్ధాయి) పోలీస్ ఆఫీసర్ ఆహ్వానిస్తే ఆయన ఇంట్లో పెళ్ళికి వెళ్ళాం. ఆయన వియ్యంకుడు ఓ రాజకీయ నాయకుడు కూడానూ. దాంతో పార్టీపెద్ద పెళ్ళికి తన ప్రతినిధిని పంపించాడు కూడా. ఇహ చెప్పేదేముంది - పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎలాగూ ఉండే బోలెడంతమంది పోలీసులతో బాటు పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల కంబైండ్ హంగామా.
మీరన్నట్లు తొడతొక్కిడే.

Jai Gottimukkala చెప్పారు...

"నిర్మాతకు గిట్టుబాటు కాదు కాని, టీవీ తెరలపై వంద రోజుల బొమ్మ"

నిర్మాతంటే ఎవరండీ సార్. చంద్రబాబు గారికి బాగానే గిట్టుబాటు అయినట్టే కనిపించింది!

ఇకపోతే జయలలిత, జగన్, పవన్ కళ్యాణ్ & చిరు రాకపోవడం ముందే తెలిసిందే, రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం ఆశ్చర్యమేసింది.

శ్యామలీయం చెప్పారు...

> రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం ఆశ్చర్యమేసింది.
పాయింటేనండోయ్ జైగారూ.
కొంపతీసి రేవంత్ రెడ్డిగారుకాని తెరాసలో చేరబోవటం లేదుకదా?
ప్రజలకు సుపరిపాలన అందించటం అనే అమాయకపు పని ఒక్కటి తప్ప రాజకీయాలలో అసంభావాలు ఏమీ ఉండవు కదా.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పుకార్లు జోరుగానే ఉన్నాయండీ! ఆయనకు జైపాల్ రెడ్డి & జానారెడ్డి గార్లతో చుట్టరికమే కాక సబితా & డీకే అరుణ గార్లతో మంచి దోస్తీ కూడా. ఇకపోతే ఎర్రబెల్లి తెరాసలో జంప్ కొట్టే అవకాశమూ లేకపోలేదు.

Of course these are only rumors, we don't know the extent of truth.

అజ్ఞాత చెప్పారు...

రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టాడా ??? అసలు తెలిసి రాస్తారా తెలియక రాస్తారా ఈ పోరంబోకు కబుర్లు.
గొట్టిముక్కలకున్న అలవాటు శ్యామలీయం మాస్టారుకు అంటించాడు అనుకుంటా. ఏందో ఈ దౌర్భాగ్యం .

అజ్ఞాత చెప్పారు...

http://www.youtube.com/watch?v=n4nFgrVea_g

ఇది చూసి ఏడువు తొక్కలోముక్కలా.

అజ్ఞాత చెప్పారు...

"ఇది చూసి ఏడువు, తొక్కలోముక్కలా." too good :)))