14, ఏప్రిల్ 2011, గురువారం

సద సంశయం – భండారు శ్రీనివాసరావు

సద సంశయం – భండారు శ్రీనివాసరావు


శీతల పానీయాలు తయారు చేసే కంపెనీలకు శుద్ధి చేసిన మంచి నీటిని ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిన నేపధ్యంలో -


జలాశయాల్లోని నీటిని ప్రజలు తాగడానికి వీలయిన విధంగా ‘రక్షిత మంచి నీరు’ గా మార్చడానికి సంబంధిత ప్రభుత్వ యంత్రాగం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదో తెలవదు కానీ రాజధాని నగరం హైదరాబాదులో సంపన్న వర్గాలు నివసించే అనేక ప్రాంతాల్లోని సువిశాల భవంతుల్లో- పచ్చిక బయళ్ళు పెంచడానికీ, కులీనులు పెంచుకునే కుక్క పిల్లలకు స్నానాలు చేయించడానికీ, వారి ఖరీదయిన కార్లు కడుక్కోవడానికీ - ప్రజాధనంతో శుద్ధిచేసిన మంచినీటినే మంచినీళ్ళ ప్రాయంలా వాడుతున్నారనేది జగమెరిగిన సత్యం.


ప్రజాహితాన్ని కోరుకునే పెద్దలు ఈ విషయంపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుందేమో. (24, అక్టోబర్, 2006)

2 కామెంట్‌లు:

సో మా ర్క చెప్పారు...

సగటు మనసుల గుండె సెగల పొగలు స్క్రీన్నివాసులకు,కనిపిస్తాయా? శ్రినివాస రావు గారూ ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సో మార్క: ధన్యవాదాలు-భండారు శ్రీనివాసరావు