వార్తలు- వ్యాఖ్యలు -1– భండారు శ్రీనివాసరావు
సందర్భం : సుబ్బరామిరెడ్డి ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం
ఒక టీవీ ఛానల్ లో అవార్డ్ స్వీకర్త, హాస్య నటుడు బ్రహ్మానందం ప్రసంగిస్తున్న సన్నివేశం ప్రసారమవుతోంది.
ఆయన మాటల్లోని ‘శక్తి’ ఆ టీవీ ఛానల్ ఎడిటింగ్ బృందాన్ని ఆవహించినట్టుంది.అంతే! క్షణం ఆలశ్యం లేకుండా అదే వేదిక మీద అర్ధ నగ్న సుందరీమణులు చేసిన అశ్లీల నృత్య ప్రసారం ప్రారంభమయింది. ఆధ్యాత్మికమయినా, పారమార్దికమయినా ఇంటి గడప వరకే. నలుగురు జనం చేరే చోట వారు కోరేదే ఇవ్వాలనుకోవడం సినీ జీవులకు, రాజకీయులకు కొత్తేమీ కాదు కదా.(12-04-2011)
సందర్భం : సుబ్బరామిరెడ్డి ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం
ఒక టీవీ ఛానల్ లో అవార్డ్ స్వీకర్త, హాస్య నటుడు బ్రహ్మానందం ప్రసంగిస్తున్న సన్నివేశం ప్రసారమవుతోంది.
“టి. సుబ్బరామిరెడ్డి గారు నాకు ఆధ్యాత్మిక గురువు. ఆయన ఇంట్లో వున్న ‘శక్తి’ పీఠాన్ని చూస్తే చాలు మనల్ని ఏదో శక్తి ఆవహిస్తుంది.”
ఆయన మాటల్లోని ‘శక్తి’ ఆ టీవీ ఛానల్ ఎడిటింగ్ బృందాన్ని ఆవహించినట్టుంది.అంతే! క్షణం ఆలశ్యం లేకుండా అదే వేదిక మీద అర్ధ నగ్న సుందరీమణులు చేసిన అశ్లీల నృత్య ప్రసారం ప్రారంభమయింది. ఆధ్యాత్మికమయినా, పారమార్దికమయినా ఇంటి గడప వరకే. నలుగురు జనం చేరే చోట వారు కోరేదే ఇవ్వాలనుకోవడం సినీ జీవులకు, రాజకీయులకు కొత్తేమీ కాదు కదా.(12-04-2011)
2 కామెంట్‌లు:
Off-topic : ప్రతీ blog post title కి మీ పేరు ఎందుకు తగుల్చుతున్నారండీ?
@అజ్ఞాత- నా పేరంటే నాకంత ఇష్టం కనుక. మీకు ఇష్టం లేదేమో అజ్ఞాత అని రాస్తున్నారు.జస్ట్ జోక్. ఏమనుకోకండి. గుడ్డిగా రాసుకుంటూ పోవడమే కాని కంప్యూటర్ పరిజ్ఞానం అంతంత మాత్రమే.అందుకే అలా డబల్ డబల్ పేర్లు కనబడుతుంటాయి.అలా రాకుండా ఏమి చెయ్యాలో చెప్పరూ.పోతే, సొంతంగా రాసినవి తప్ప సేకరించి రాసినవాటికి పేరు పెట్టను. ఎంతయినా వెనుకటి తరం కదా. నా వయస్సు ఎంతనుకుంటున్నారు.జస్ట్. అరవై అయిదు.-భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి