12, అక్టోబర్ 2024, శనివారం

అటు నేనే ఇటు నేనే



హాలీవుడ్ చిత్రాలను తలదన్నే రీతిలో గతంలో ఎప్పుడో కెమెరా పనితనం ప్రదర్శించే చిత్రాలను తెలుగులో తీశారు అనే మాటను ఈ నెట్ యుగపు పిల్లలు నమ్ముతారా! 
అలా నమ్మని పిల్లలకు మాయా బజార్ సినిమాని బలవంతంగా అయినా చూపించాలి.

ఈటీవీ లో వస్తున్న ఈ సినిమాను ఒంటరిగా చూస్తున్నాను. చూడాల్సిన వాళ్ళు మొబైల్ లో వీడియోలు చూస్తున్నట్టున్నారు!
ఇదో విషాదం!

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Maya Bazar అసలు భారతంలోనే లేని కథ దాన్ని బాగుందంటూ మెచ్చుకోవడం తెలుగు వారి దురదృష్టం.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

దురదృష్టం ఏముంది ? సినిమా కథలు అధికశాతం కల్పితాలే ఉంటాయిగా - అందులోనూ ఈ రోజుల్లో సినిమాల్లో కనిపించే చాలా improbable storyline లతో.

అజ్ఞాత చెప్పారు...

అందుకే గదా మాయా బజార్ అని పేరు పెట్టారు. పంచ పాండవులు ఒక్క సీన్ లో కూడా కనిపించరు. అద్భుత మయిన స్క్రీన్ ప్లే. కె వి రెడ్డి. అయితే కొన్ని తరాల తరువాత ఈ కథ నిజంగాజరిగింది అనుకోవచ్చు. అందుకే మాయా బజార్ కల్పిత గాథ అని పెద్ద డిస్ క్లేయిమర్ ఇవ్వాలి.

అజ్ఞాత చెప్పారు...

Luckily in those days this much online scrutiny was not there. Otherwise people would have criticized the director and producer for distorting Mahabharata epic ;).