ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.
అక్టోబర్ నెలలో రెండో శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు దినం అంటున్నారు.
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన ధ్వనులు వినపడ్డా మొత్తం మీద దానికి పసుపు నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు అయిపోయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని ఫ్రిజ్ లో పడుకునేది ఆ కోడిగుడ్డే. మేము తిన్నా తినకపోయినా, ఇంటికి వచ్చిన (నా) నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి వుంచేది.
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్ ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. అటువంటి భీకర భీభత్స దృశ్యాలు చూసిన తరువాతే వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి వుండాలి.
అసలు కోడి గుడ్డు అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఆయనే బీ.వీ. రావు (బి.వాసుదేవరావు, ఇప్పుడు లేరనుకోండి). తెలంగాణాకు చెందిన ఈ పెద్దమనిషి వెంకటేశ్వరా హేచరీస్ అనే పరిశ్రమను స్థాపించి కోడిగుడ్డుకు ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు. మేము మాస్కోలో ఉన్నరోజుల్లో నాటి సోవియట్ ప్రభుత్వ అతిథి హోదాలో ఆయన రష్యా వచ్చారు. ఓరోజు మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేతి భోజనం చేసి వెళ్ళారు. తర్వాత మేము ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత కూడా గుర్తు పెట్టుకుని మా పిల్లలు ఇద్దర్నీ పూనాలో వున్న తమ స్టడ్ ఫాం కు తీసుకువెళ్ళారు. అదో సంగతి.
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని కోడిగుడ్డుకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు జరగడం కోడిగుడ్డు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.
గుడ్డుగా వున్నప్పుడూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా మానవులకు ఆహారంగా సేవలందిస్తూ త్యాగంలో బలి, శిబి చక్రవర్తులను మించిన ఆ త్యాగశీలికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గా వేసుకుని నోరారా తినడం తప్ప అంటారు కొందరు ఎగ్గేరియన్లు.
10 కామెంట్లు:
బి.వి. రావు గారి కూతురేగా అనూరాధా దేశాయ్ ? వెంకటేశ్వరా హేచరీస్ ప్రస్తుత ఛెయిర్మన్ ( ఛెయిర్ పర్సన్ అనాలి కాబోలు?).
గొప్ప ఐడియా ఆమె తండ్రిగారిది 👏🙏.
మొత్తానికి భండారు శ్రీనివాసరావు గారి ఫోన్ నంబర్ సంపాదించాను .. 98491 30595
వారికి పోస్టు చేసే కామెంట్లకు రిప్లై ఇచ్చే అలవాటు లేనట్లుంది .. ఎవరైనా మెసేజ్ చేసి కనుక్కోండి
గుడ్డు తినుట కన్నా
బ్రెడ్డు తినుట మిన్న లేదా
లడ్డు తినుము అన్నా
మాంస హారం వద్దుర కన్నా
శాఖాహారం ముద్దుర నాన్నా
గుడ్డూ గిడ్డూ వలదన్నా
ముద్ద పప్పు తినుమన్నా
బాగుంది. శాకహారుల గుడ్డు ముచ్చట్లు.
Message chesi emi kanukkovaali ? :)
కామెంట్లకి జవాబివ్వరని తెలిసి ఎగేసుకునెవడెల్లమన్నడేస్
// “అజ్ఞాత11 అక్టోబర్, 2024 11:08 PMకి
మొత్తానికి భండారు శ్రీనివాసరావు గారి ఫోన్ నంబర్ సంపాదించాను .. 98491 30595
వారికి పోస్టు చేసే కామెంట్లకు రిప్లై ఇచ్చే అలవాటు లేనట్లుంది .. ఎవరైనా మెసేజ్ చేసి కనుక్కోండి “ //
=====================
ఫోన్ నెంబర్ సంపాదించానంటున్నారుగా.
మరి మీరే మెసేజ్ చెయ్యచ్చుగా ?
😂😂😂
🤣🤣
వెర్రీ గుడ్డు మార్నింగ్ అని చెప్పండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి