సాల్ట్ లేక్ సిటీ - భండారు శ్రీనివాసరావు
ఏ వార్తకు అయినా డేట్ లైన్ ముఖ్యం. ఎప్పుడు, ఎక్కడ అనేది పేర్కొంటూ వార్త రాయడం అనేది జర్నలిస్టులకు వారి గురువులు నేర్పే తొలి పాఠం.
నేనిప్పుడు ఈ పోస్టులు రాస్తున్నప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు. సియాటిల్ నుంచి మధ్యలో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్టులో దిగి మళ్ళీ బాల్టి మోర్ వెళ్ళే విమానం ఎక్కాము. డెల్టా ఎయిర్ లైన్స్ లో అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఎయిర్ హోస్టెస్ లు సకల మర్యాదలు చేస్తున్నారు. దానికి తోడు 30 వేల అడుగుల ఎత్తున కూడా వై ఫై సదుపాయం ఉంది. డెల్టా ఫ్లయి మైల్స్ స్కీం కింద ఈ అదనపు ఏర్పాటు అనుకుంటా.
కింది ఫొటో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్టులో. ఈ ప్రాంతంలో ప్రధానమైన పర్యాటక ఆకర్షణ కేనియన్స్ (ప్రకృతి సిద్ధమైన లోతయిన లోయలు).
వాటికి సంకేతంగా ఇక్కడి ఎయిర్ పోర్ట్ ను కేనియాన్స్ ఆకారంలో తీర్చి దిద్దారు.
18-9-2024
2 కామెంట్లు:
బాగుంది.
అమెరికా కాలరాడో (Colorado) రాష్ట్ర రాజధానీ నగరం డెన్వర్ సిటీ (Denver) లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ భవన సముదాయఫు రూఫ్ కూడా అంతేనండి. ఆ రాష్ట్ర ప్రత్యేకత అయిన Rocky Mountains (snow-capped peaks) ఆకారం ఇచ్చారు 👇. .
https://media.gettyimages.com/id/157581825/photo/fiberglass-roof-of-denver-international-airport.jpg?s=2048x2048&w=gi&k=20&c=s290tRPEH3YFFbQs4RQBPgKxZHaxg-jySccyUXblALo=
ఒక చేతిలో గన్ను ఒక చేతిలో హ్యాట్ లాగా ఉన్నాయి దూరంనుంచి. కౌబాయ్ లాగా సూపర్ గా ఉన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి