29, మే 2019, బుధవారం

కనులు లేవని నీవు కలత పడవలదు


....అంటూ అతడు పాడుతుంటే ఘంటసాల మాస్టారే పాడుతున్న అనుభూతి కలిగింది.
పేరు మాధవ. వయసులో చిన్నవాడే. చక్కని స్వరం అతడికి భగవంతుడు ఇచ్చిన వరం. పుట్టుకతోనే చూపులేకపోవడం ఆయనే ఇచ్చిన శాపం. ఆత్మవిశ్వాసం తనకు తానుగా అతడు పెంచుకున్న భాగ్యం.
నిజం! అతడిప్పుడు భాగ్యవంతుడు. ప్రపంచం నలుమూలలా అతడిని అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా వున్నారు.
దీనికి కారణం రవి శంకర్ అనే  ఓ మనసున్న మనిషి. ఆయన కంట పడడం మాధవ  చేసుకున్న అదృష్టం.
1999 నుంచీ రవి శంకర్ తెలుగు వన్ అనే ఒక వెబ్ సంస్థను హైదరాబాదులో స్థాపించి,  పెంచి పోషించి  పెద్ద చేస్తూ వస్తున్నారు. ఆ సంస్తలో అనేక విభాగాలు వున్నాయి. అందులో రేడియో ఒకటి. భారత దేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్ళు వాటిని ఆసక్తిగా వింటుంటారు. అందుకే పేరుకు తగ్గట్టే అది ఇప్పుడు నెంబర్ వన్.
కంటి చూపు లేకపోయినా శ్రావ్యమయిన స్వరం కలిగిన  మాధవ్ రవి శంకర్ సంస్థలో పనిచేస్తున్నాడు. మాధవ్ స్వర విన్యాసాలకు ఇప్పుడదొక నిలయం.
గమ్యం లేని జీవితం అనుకున్న మాధవ్ చివరికి  సరయిన చోటికే చేరుకున్నాడు.
అనుకోకుండా ఈరోజు తెలుగు వన్ స్టూడియోకి వెళ్ళిన నాకు మాధవ్ పరిచయం కలిగింది.
కింది ఫోటోలో: (ఎడమనుంచి) నా పక్కన  మాధవ్. అతడి పక్కన వున్నది రవి శంకర్




   
  
    

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

అతని ప్రోగ్రాం ఏ టైం లో వస్తుందో చెప్తే మాకు వినే అవకాశం ఉండేది!