'ఎవరీ అన్నా హజారే?' - భండారు శ్రీనివాసరావు
'ఎవరీ అన్నా హజారే?'
'ఓ మాజీ సైనికుడు. 1965 లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నాడు.'
'ఎవరితడు? ఏమిటి ఈయన ప్రత్యేకత? యిరవై నాలుగ్గంటలు దేశవ్యాప్తంగా మీడియా లో వార్తలన్నీ ఈయన గురించే. మహారాష్ట్ర లోని అహమ్మద్ నగర్ జిల్లాలో రాలెగావ్ అనే ఆదర్స ఆదర్శగ్రామ సృష్టికర్త అయిన అన్నా హజారే గురించే. ఏమిటి అన్నా హజారే విశిష్టత? ఏమిటి ఈ గ్రామం గొప్పదనం?'
'స్వయం పోషకంగా, ఎవరిమీదా ఆధారపడకుండా అన్ని హంగులు దీనికి ఏర్పరిచారు. ఈ గ్రామానికి అవసరమయిన విద్యుచ్చక్తి అక్కడే ఉత్పత్తి అవుతుంది. సౌర శక్తి, గాలిమరలు, బయో ఫ్యూయల్ ఇందుకోసం వాడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం వరకు పేదరికం తాండవించిన గ్రామం అంటే ఈనాడు నమ్మడం కష్టం. ఎందుకంటె ఇప్పుడా గ్రామం మొత్తం దేశంలోనే అత్యంత సంపన్నగ్రామాల్లో ఒకటిగా తయారయింది కాబట్టి. దీన్ని ఆదర్శ గ్రామంగా నిర్ణయించడానికి అనేక కారణాలు వున్నాయి. ప్రభుత్వాల మీదా, ప్రభుత్వ పధకాల మీదా ఆధారపడకుండా అన్ని వసతులు గ్రామ ప్రజలే సొంతంగా ఏర్పాటుచేసుకున్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినని రీతిలో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అన్నింటికీ మించి ఆ గ్రామ ప్రజల నడుమ వెల్లివిరిసే సామరస్యాన్ని మరెక్కడా చూడలేము.ఇన్ని మంచి పనులు ప్రచారం జోలికి పోకుండా చేసిన మంచి వ్యక్తి కాబట్టే భారత ప్రభుత్వం అన్నా హజారేను పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.'
'అది సరే! అన్నా హజారే పోరాటం అంటూ మీడియాలో వస్తోంది. దేనిమీద ఆయన పోరాటం. దేనికోసం ఆయన ఆరాటం?'
'ఆయన ఒక మంచి అంశం మీద పోరాటం ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించే ధ్యేయంతో చట్టానికి సవరణ చేయాలన్నది ఆయన డిమాండ్.'
'ఈ రోజుల్లో ఇలాటివి సాధ్యమయ్యే పనులేనా?'
'మామూలు మనుషులకు కష్టమే. కానీ అన్నా హజారే వంటి వ్యక్తులు అనుకుంటే సాధ్యం కానిది వుండదు.
'ఇందుకోసం అన్నా హజారే లోక్ పాల్ బిల్లు కావాలంటున్నారు. మంత్రులతో సహా రాజకీయరంగంలోవున్న వాళ్ళు , ఐ ఏ ఎస్ ఐ పీఎస్ లతో సహా అధికార యంత్రాంగంలో పనిచేసే సిబ్బంది అందర్నీ – ఎవరికీ ఎలాటి మినహాయింపు లేకుండా ఈ బిల్లు పరిధిలోకి తీసుకు రావాలన్నది అన్నా హజారే కోరిక. ఈ బిల్లు ద్వారా ఏర్పడే వ్యవస్థ అత్యంత బలీయంగా వుండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు.
'లోక్ పాల్ బిల్లు అంత కొత్త విషయం ఏమీ కాదే. 1972 లోనే అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ బిల్లును ప్రతిపాదించారు.'
'కానీ ఏమి లాభం! మళ్ళీ ఎవరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు ఈ బిల్లు పట్ల శ్రద్ధ వుండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారెవ్వరికీ ఇలాటి చట్టాలు రుచించవు.
'అందుకే, మచ్చలేని ప్రజాసేవకుడయిన అన్నా హజారే ఎట్టకేలకు ఈ బిల్లుకు మోక్షం కలిగించడానికి నడుం బిగించాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. ప్రభుత్వం కూడా స్పందించి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తామని ప్రకటించాలని అన్న హజారే కోరుతున్నారు. ఈ బిల్లు రూపకల్పన కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నది కూడా ఆయన డిమాండ్. ఈ కమిటీలో ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటె, ఇలాటి ముఖ్యమయిన బిల్లును తయారుచేసే బాధ్యతను కేవలం ప్రభుత్వాలకు వొదిలివేస్తే ప్రయోజనం వుండదని ఆయన అభిప్రాయం.
అన్నా హజారే కోరుకున్న విధంగా బిల్లు తయారయి చట్ట సభల ఆమోదం పొందితే, స్వయం ప్రతిపత్తి కలిగిన లోక్ పాల్ వ్యవస్థ ఏర్పడుతుంది. భారత ఎన్నికల సంఘం మాదిరిగా ఈ లోక్ పాల్ వ్యవస్తకు కూడా సర్వాధికారాలు వుంటాయి. ప్రతి రాష్ట్రం లో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త వ్యవస్తలు ఆవిర్భవిస్తాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజకీయ నాయకుడిని కానీ, అధికారిని కానీ ఈ వ్యవస్థ విచారిస్తుంది. ఈ దర్యాప్తు ఏళ్ళూ పూళ్ళూ సాగకుండా ఒక్క ఏడాది వ్యవధిలో పూర్తి చేయాల్సి వుంటుంది. కేవలం రెండేళ్ళ లో అవినీతికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాల్సి వుంటుంది. బోఫార్స్ కుంభకోణం విషయంలో, భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ దర్యాప్తులు దాదాపు పాతికేళ్ళకు పైగా సాగాయి. చివరికి సాధించింది శూన్యం.
అవినీతి పై అన్న హజారే ప్రారంభించిన ఈ మహోద్యమంలో ఆయన ఒంటరి కాదు.
బాబా రాం దేవ్, మాజీ ఐ.పీ.ఎస్. అధికారి కిరణ్ బేడీ, స్వామి అగ్ని వేష్, సమాచార హక్కు ఉద్యమకారుడు అరవింద్ కేజరీ వాల్, ఇంకా అనేకమంది అన్నా హజారేకు మద్దతుగా నిలిచారు. అలాగే, ప్రముఖ సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఆయనకు బాసటగా నిలబడ్డారు. అందరి బాగుకోసం అన్నా హజారే ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని దేశం నలుమూలలకు, ఇంటింటికీ చేర్చడంలో ప్రతి ఒక్కరు తమకు చేతనయిన విధంగా తోడ్పాటు అందించాలని కోరడానికే ఈ వివరాలు. అవినీతిపై అన్నా హజారే మొదలు పెట్టిన ఈ ఉద్యమ స్పూర్తిని నేల నాలుగు చెరగులకు చేర్చడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.' (08-04-2011)
14 కామెంట్లు:
ముందుగా భండారు శ్రీనివాసరావు గారు మీకు కృతఙ్ఞతలు , మీరు అన్నట్టుగా అన్నాహజారే గూర్చి మీడియా లో చాల కనిపిస్తుంది,{వినిపిస్తుంది}కాని ఇంత విపులంగా ఎక్కడకూడా లేదు, బ్లాగులన్ని ఒక చోట లబించే అగ్రిగేటర్ల వలన మాలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలను ,మీలాంటి మేదావుల వళ్ళ తెలుసుకోగలుగుతున్నాము,అలాగే నేను మాములుగా బ్లాగులు చదువు కుంటు వెళ్తాను కామెంట్ లు పెట్టడమంటె కోచం కష్టం టైపింగ్ అంతగా రాదు కాని ఇంత విషయం చదివాక కూడా కామెంటు పెట్టక పోవడం సబబు కాదేమో అనిపించింది
బాగుంది సార్ మీ టపా, కాకపోతే అన్నాహజారే సైన్యంలో ట్రక్ డ్రైవరుగా పనిచేశారు. 1965లో పాకిస్థాన్ తోఆయన నడుపుతున్న ట్రక్కుపై శత్రుసైనికులు దాడిచేశారు. ట్రక్కులో ఉన్న సైనికులంతా చనిపోగా ఆయనొక్కరే బతికారు. ఆ క్షణంలో ఆయన శ్మశానవైరాగ్యానికి గురై ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. కానీ వివేకానందుని బోధలు గుర్తొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
ఇంకొన్ని విషయాలు:
-పన్నెండేళ్ల వయసులో చదువు చాలించి పూలకొట్లో పనికి కుదిరారు.
-ఇరవయ్యేళ్ల వయసులో ఓ పూలకొట్టు యజమాని అయ్యారు. తర్వాత మందు అలవాటు చేసుకుని ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఆ సమయంలో సైన్యంలో ట్రక్ డ్రైవర్లు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసి ఉద్యోగం సంపాదించారు.
-సైనిక క్రమశిక్షణ ఆయనలో చాలా మార్పు తెచ్చింది. దీంతోపాటు సైన్యంలో ఉన్నన్నాళ్లూ వివేకానందుని పుస్తకాలు ఎక్కువగా చదివేవారు.
-ఆయన పుట్టిన ఊరు రాలేగావ్ సిద్ధి అని చాలామంది అనుకుంటారుగానీ... భింగార్. ఆయన ఐదో యేట వారి కుటుంబం రాలేగావ్ సిద్ధికి వలస వెళ్లింది. అక్కడా ఆయనుంది ఆరేళ్లే. తర్వాత మేనత్తతో పాటు బొంబాయికి వెళ్లిపోయారు. అక్కడ పన్నెండో ఏట పూలకొట్లో ఉద్యోగానికి చేరారు.
-రాలేగావ్లో వారికి సొంత ఇల్లుంది. కానీ, ఆయన గత నలభై ఐదేళ్లుగా ఆ గ్రామంలోని యాదవ్ బాబా మందిరంలోనే ఉంటున్నారు. ఈ నాలుగున్నర దశాబ్దాల్లో ఒక్కసారి కూడా తన ఇంటి గడప తొక్కలేదు.
@చీర్ల రమేష్ - మీ అభిమానానికి ధన్యవాదాలు.కిందనే బాలు రాసారు.నేను రాసిన దానికంటే మరెంతో విలువయిన సమాచారం అందించారు. మీరు పేర్కొన్నట్టు బ్లాగుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకో గలుగుతున్నాము. వాటిని ఇతరులతో పంచుకోగలుగు తున్నాము. - భండారు శ్రీనివాసరావు
@బాలు - చక్కని విషయాలు తెలియచేసి నా వ్యాసం విలువ పెంచారు. ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు
Hatts off !
chaala manchi post!
Thanks alot!
Jaiho Anna Hajarjeeee !
@తెలుగు కళ - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
Srinivas Garu, Balu and You given a good Information and thanks a lot for you both
We are expecting more about others too.. in future
@thanks Venkateswara rao garu - Bhandaru Srinivas Rao
@ఈ కమిటీలో ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరుతున్నారు.
ప్రజాస౦ఘాలు కి ప్రాతినిధ్య౦ అ౦టూ మొదలయితే ఢిల్లీ ను౦డి గల్లీ దాకా ఈ స౦ఘాలు విస్తరిస్తాయి.ఇది చక్కని మార్పు.
'రాలేగావ్' స్పూర్తి ని చాలా చక్క గా ఆవిష్కరి౦చారు. ఆయన ము౦దు అక్కడి ప్రజల్లొ మార్పు తెచ్చి తరువాతే ఆ ఊరి ని ఆదర్శ గ్రామ౦గా తీర్చి దిద్దారు కదా.వారు ఈ సాధనకు అనుసరి౦చిన మార్గము కూడా అ౦ది౦చ గలరేమో ప్రయత్ని౦చ గలరు.
@Mauli-మౌళి - ధన్యవాదాలు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. తన సొంత పల్లెలో సొంత సిద్ధాంతాన్ని నిరూపించుకున్న తరవాతనే అన్నా హజారే ఢిల్లీ ని గడ గడ లాడించారు. - భండారు శ్రీనివాసరావు
అన్నా హజారే నరేంద్ర మోడీని పొగడడం గురించి చదువుతోంటే అతని నిజాయితీ మీద అనుమానం కలుగుతోంది. మోడీ అధికారంలో ఉన్నవాడే కదా. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళని అంత సులభంగా నమ్మేస్తారా?
Lokpal Bill: Govt agrees to terms fearing RSS
One of the major considerations of the government to somehow reach a consensus with Anna Hazare was the possibility of a takeover of his movement by a resolute Opposition and the most effective "cultural" organisation doing politics in the country - the Rashtriya Swayamsevak Sangh (RSS).
Besides planting their popular mascot, yoga guru Ramdev, who performed a series of antics at Anna Hazare's protest site on Friday afternoon, the RSS had passed a resolution exhorting its cadre to actively join the social activist's movement against corruption.
"We have passed a resolution. Our friends and supporters across the country have been asked to actively join Anna's movement. Corruption is an evil that concerns every citizen of India. Therefore, the RSS lends its support," Madhav said.
This confirmed what was being suspected in the ruling establishment from the beginning of Hazare's agitation. RSS general secretary Suresh Joshi has written a letter extending support to Hazare.
http://indiatoday.intoday.in/site/Story/134760/india/lokpal-bill-government-agree-to-terms-fearing-rss.html]
మీరు రాసే టపాలలో కొంచెం భజన చేసే స్వభావం కనిపిస్తుంది. ఆ రోజులలో నెహ్రు గారిని ఇలా వ్యక్తిగత భజన చేసి నెత్తికేక్కించుకొన్నారు. ఆయన సోషలిస్ట్ విధానలతో దేశాన్ని పాడు చేసినా, కనీసం రాజాజి లాంటీ వారు చెప్పిన లిబరల్ ఆర్ధిక విధానాలను గురితించే వారు కరువయ్యారు. ఇప్పుడు ఆరోజుల్లో వారు చెప్పిన విధానాలను సంస్కరణల పేరుతో తీసుకొస్తుంటె మళ్ళీ ఈ తరం నాయకులను అహా ఒహో అని ఆర్ధిక వ్యవస్తను గాడిలోపేట్టారని పొగుడుతూన్నారు. hajarE ని స్పూర్తిగాతీసుకొని తీసిన చిరంజివి రుద్రవీణ సినేమా అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు మీరు రాసినదానిలో కొత్తగా చెప్పొచేదేమున్నాది.120 కోట్లమంది దేశ జనాభాకి ఒక్క అన్నా హజారే దిక్కైనట్లు మీరు ఉప్పొoగి పోతూ రాశారు. ఇన్ని రోజులు బాబా రాందేవ్ అవినితి మీద రోజు ఉదయం యోగా క్లాసుల్లో ప్రచారం చేస్తే దేశ ప్రజాలకి వినపడాలేదా/కనపడలేదా? అన్నా హజారే గారి అకస్మాత్తుగా ఇంతటి ప్రాముఖ్యత ఎందుకిచ్చారో మీరు చెప్పండి? గాంధిగారి అహింసా విధానం అంత గొప్ప దైతే దేశ చరిత్రలో సుమారు 60 -70 సం|| కి ఒక గాంధి పుడతాడన్నమాట. అంత వరకు ప్రజలు ఇటువంటి గాంధిల కొరకు వేచి చూస్తుండాలి అని మీలాంటి వారి ఉద్దేశం. ఆ గాంధిగారు అహింసతో మార్పు తెచ్చె వరకు ప్రజలు హింసను భరిస్తూ ఉండాలి. ఇది మీరంతా ఇచ్చే సందేశం.
Ram
ఏ౦టో ఈ అజ్నాత ఒక్క పేరు పై నిలబడడ౦ లేదు, నా బ్లాగ్ లో శిను అని రాసి, ఇక్కడ Ram అ౦టాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి