మా ఇంట్లో పనిచేసే వలలి (వంటావిడ) ఎంతో సంతోషంగా వుంది. ఆమె ఎల్లారెడ్డి గూడాలో వుండే మా ఇంటితో పాటు మాధా పూర్ లో ఓ డాక్టర్ దంపతుల ఇంట్లో కూడా పనిచేస్తుంది. పొద్దున్నే బయలుదేరి, నేరుగా వెళ్ళే బస్సు దొరకనప్పుడు రెండు బస్సులు మారి మాదాపూర్ వెళ్లి పని చక్కబెట్టుకుని, మా ఇంటికి వచ్చి బ్రేక్ ఫాస్ట్, వంటపని చేసి వెడుతుంది. దేనికీ తొందరలేని ఇల్లు కనుక ఆవిడ ఏ టైముకు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. అయితే ఈ తిరుగుళ్లకే సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చు అవుతోంది అని బాధ పడేది. కొత్త ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త పథకం (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం) తనకు ఎంతో వెసులుబాటు అని చెబుతోంది.
జనాకర్షక పథకాలు అని తీరుబాటు వున్న వాళ్ళు ఎద్దేవా చేసే కొన్ని పథకాలు నిజంగా అవసరంలో వున్నవారికి చాలా ఊరట కలిగిస్తాయి. ఈ నిజం అర్థం కావాలి అంటే తమ చుట్టూ తామే గీసుకున్న పరిధి నుంచి బయటకు వచ్చి చూడాలి.
ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమై పోతుంది. స్త్రీలకు మాత్రమే వర్తించే ఉచిత పథకాలు పురుషుల పట్ల వివక్ష చూపినట్లు అవుతుంది. దివ్యాంగులకు, 80 సం దాటిన వారికి మాత్రమే కొంతమేరకు తగ్గింపు ఇవ్వాలి.
రిప్లయితొలగించండిస్త్రీలపట్ల ఏవిధమైన.వివక్షకు ఐనా (ఎంత కొంచెంగానే ఐనా) చూపటం అనేది అన్యాయం,. ఆక్రమం, దుర్మార్గం, అనుచితం, ఆమానుషం, ఖండనీయం, శిక్షార్హం (ఇంకా ఏమన్నా మాటలు ఉంటే అవన్నీ కూడా) అవుతుంది. సందేహం అక్కరలేదు.
రిప్లయితొలగించండిమరి పురుషులపట్ల మాత్రం వివక్షను చూపవచ్చునా?
All woman should be given 10g gold coin, every Shravana month. Women will be happy (100g coin is even better.. more happy) :)
రిప్లయితొలగించండిఏడ్చేవాళ్లను చూస్తే చూడముచ్చట :)
రిప్లయితొలగించండి