పెద్ద మేజా బల్ల మీద పేర్చిన పుస్తకాలు, జాతీయ, ప్రాంతీయ దినపత్రికలు, ఆంగ్ల మాస పత్రికలు వాటి నడుమ దీక్షగా ఏదో పుస్తకమో, పత్రికో చదువుతున్న మనిషి కనబడితే ఆయన ఖచ్చితంగా సి.హెచ్. రాజేశ్వరరావు గారే! సందేహం లేదు.
చదవక
జర్నలిస్టు చెడిపోతాడని అనేవారు. నాకు తెలిసి అమితంగా పత్రికలు, పుస్తకాలు చెదివే అతి కొద్దిమంది
పాత్రికేయుల్లో రాజేశ్వరరావు గారు ఒకరు. ఊరికే తిరగేయడం కాకుండా వాటిలోని సారాన్ని
ఒడిసిపట్టే ప్రతిభాశీలి కనుకనే అంత గొప్ప జర్నలిస్టు కాగలిగారు. ఆంధ్ర పత్రిక, డెక్కన్ క్రానికల్, ఇండియన్
ఎక్స్ప్రెస్ పత్రికలకు హైదరాబాదు,
ఢిల్లీల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు మొదటిసారి
ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీలో ఉంటున్న రాజేశ్వర రావు గారిని ఏరికోరి తనకు సమాచార
సలహాదారుగా నియమించుకున్నారు. హెచ్ ఎం టీవీ కి అంబుడ్స్ మన్ గా పనిచేశారు.
జర్నలిస్టులకు
పెద్ద దిక్కుగా వుండే రాజేశ్వరరావు గారు 83వ ఏట రాత్రి హైదరాబాదులో మరణించారు.
వారికి
సద్గతులు కలగాలని కోరుకుంటూ
భండారు
శ్రీనివాసరావు
(07-03-2023)
Very few journalists are there like him. Om Santhi.
రిప్లయితొలగించండి