20, ఆగస్టు 2015, గురువారం

తిరగరా తిరగరా తేరగా .....


తిరుగుబోతుల్ని తాగుబోతుల్ని ఓ గాటన కట్టడం న్యాయం కాదు. తిరుగుబోతుల్లో తాగుబోతులు వుండవచ్చు కాక.  కానీ వాళ్ళు చెప్పే విశేషాలు ఎంతో వింతగా వినడానికి విచిత్రంగా వుంటాయి. యెంత ఇంటికి అంటుకుపోయి వుండేవాళ్ళల్లో కూడా నాలుగు చోట్ల తిరిగిరావాలనే కోరిక అణగారి  వుంటుంది. ఆ కోరికే లేకపోతె మనకు అంత చక్కటి మనుచరిత్ర కావ్య రాజం దక్కేది కాదు. త్రికాల సంధ్యాదులతో ఇల్లు దాటి ఎరుగని ప్రవరాఖ్యుడిని ఆ కోరికే ఇంటి గడప దాటించి హిమాలయాల బాట పట్టించింది.


నిజానికి నేల నాలుగు చెరగులూ చుట్టి రావడం వల్ల మనసు విశాలం అవుతుంది. కొత్తవారితో పరిచయాలు అవుతాయి. కొత్త కొత్త విశేషాలు తెలుస్తాయి.  తెలుసుకోవాలనే కోరికే ప్రపంచ పర్యాటకాన్ని పెంచి పోషిస్తోంది. ఇలా కాళ్ళకు చక్రాలు కట్టుకుని ఊళ్లకు ఊళ్ళు, దేశాలు పట్టి తిరిగొచ్చిన తిరుగుబోతులు చెప్పిన వింతలూ విశేషాలే ఇవి.
సౌదీ అరేబియా దేశంలో మచ్చుకు ఒక్క నది కూడా లేదు.
అమెరికాలో ఏ నిమిషం లెక్క వేసినా అక్షరాలా అరవై వేలమంది దేశాలు చుట్టి రావడానికి విమానాల్లో ప్రయాణిస్తుంటారు.  
ఇండోనీసియాలో వున్న 127 పేలుతున్న అగ్ని పర్వతాలను దగ్గర నుంచి చూడడానికి ప్రాణాలకు తెగించి లక్షలాదిమంది పర్యాటకులు వెడుతుంటారు.
సింగపూరు దేశంలో కంటికి కనిపించనిదేమిటో తెలుసా. ట్రాక్టర్. అది వ్యవసాయిక దేశం కాకపోవడం వల్ల అక్కడ నాగలి పట్టిన రైతులు కనిపించరు.
మనవైపు పిల్లలకు మొనాకో అనగానే నోరూరుంచే బిస్కెట్లు గుర్తుకు రావచ్చు కాని మొనాకో అనేది చాలా చిన్న దేశం. యెంత చిన్నది అంటే అ దేశం మొత్తం విస్తీర్ణం  న్యూ యార్క్  సెంట్రల్ పార్కు కంటే కూడా తక్కువ.
లిబియాలో నూటికి తొంభయి తొమ్మిది శాతం ఎడారి భూములే.
మాల్దీవులు సముద్ర మట్టానికన్నా దిగువన ఉన్నందువల్ల భవిష్యత్తులో ఆ దీవులు ఏదో ఒక రోజు సముద్రంలో కలిసిపోతాయనే అనుమానాలు వున్నాయి.
నార్వే దేశం పూర్తిగా పర్యావరణ అనుకూలమైన విద్యుత్తును  ఉత్పత్తి చేస్తోంది. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో తొంభయ్ తొమ్మిది శాతం జల విద్యుత్తు కావడం గమనార్హం.
పొతే, హైతీ అనే దేశం దీనికి పూర్తిగావిరుద్ధం. అక్కడ ఒక్క చెట్టంటే ఒక్క చెట్టు కూడా లేదు.
నౌరా రిపబ్లిక్ ప్రజలు బాగా కలిగిన వాళ్ళు. ఇంట్లో వొంట్లో పుష్కలం అనే బాపతు. ప్రపంచంలోని స్తూల కాయులందరూ ఒక్క చోట చేరారా అన్నట్టుగా ఉంటుందా దేశం.
అమెరికాలోని జైళ్లలో లక్షలాదిమంది, ఒక లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో నాలుగో వంతుమంది, ఎంచక్కా అక్కడి జైళ్లలో కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటె ఆ దేశంలో  జైళ్ళు అంత వసతిగా బాగుంటాయి.
హవాయ్ భాషలో అతితక్కువగా పదమూడు అక్షరాలే వుంటాయి.
‘నా పేరు బుడుగు, అసలు పేరు చాలా పొడుగు’  అన్నట్టు బ్యాంకాక్ అసలు అధికారిక నామం చాలా చాలా పొడుగు. ఆ పేరులో ఏకంగా 169 అక్షరాలు వున్నాయి.
పాన్ అమెరికన్  అమెరికన్  జాతీయ రహదారి పొడవు  ముప్పయి వేల  మైళ్ళు.  పర్యాటకులు తమ జీవితాల్లో హెచ్చు భాగం ఆ రోడ్డుపైనే తిరుగుతూ గడుపుతుంటారు.
భారత దేశంలో లక్షా యాభయ్ వేల పోస్టాఫీసులు వున్నాయి.
ఫిన్లాండ్ లో లక్షా ఎనభయ్ వేల దీవులు వున్నాయి.
జపాన్ వాళ్ళ తెలివి తేటలే వేరు. గుండ్రంగా కాకుండా చదరపు ఆకారంలో వుంటే ఎక్కువ పుచ్చకాయల్ని సులభంగా నిలవచేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ కాయల్ని చదరపు ఆకారంలో ఉండేలా పెంచుతున్నారు.
పలావు అనేది తినేది కాదు. పసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న దీవి. ఆ దీవిలో వారిది వింత మనస్తత్వం. ఎవరయినా కోళ్ళని పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారు. కాని, ఆ దీవిలో వాళ్ళు వందల కొద్దీ షార్క్ చేపల్ని ముచ్చటపడి పెంచుతున్నారు.
కోస్టారికా యెంత శాంతి కాముక దేశం అంటే  ఆ దేశంలో సైన్యం అంటూ లేదు. అది అక్కడ  నిషిద్దం.
సాన్ మారినో దేశస్తులు కారు దిగి కాలు కింద పెట్టరు.  ఆ దేశంలో జనాభాకంటే కార్ల సంఖ్యే ఎక్కువ.
(20-08-2015)

NOTE: Courtesy Image Owner and also 50 traveling facts 

8 కామెంట్‌లు:

  1. Namaste
    Where do you get these details? Your own brainwaves? For the thing you posted here.... పొతే, హైతీ అనే దేశం దీనికి పూర్తిగావిరుద్ధం. అక్కడ ఒక్క చెట్టంటే ఒక్క చెట్టు కూడా లేదు. google with terms "Haiti trees" and you can see images.

    Cutting and pasting is fine but verify facts before you post. Otherwise in your journalism language it is plagiarism. How unfortunate you do this at this age after retirement!!

    రిప్లయితొలగించండి
  2. The problem in Haiti is deforestation.
    People cut the trees for their domestic needs and for coffee plantations.

    రిప్లయితొలగించండి
  3. "అమెరికాలోని జైళ్లలో లక్షలాదిమంది, ఒక లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో నాలుగో వంతుమంది, ఎంచక్కా అక్కడి జైళ్లలో కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటె ఆ దేశంలో జైళ్ళు అంత వసతిగా బాగుంటాయి"

    Is it True?
    America lo 175 crores population unda.

    రిప్లయితొలగించండి
  4. < "ఇల్లు దాటి ఎరుగని ప్రవరాఖ్యుడిని ఆ కోరికే ఇంటి గడప దాటించి హిమాలయాల బాట పట్టించింది."
    అవునండీ, బారిస్టర్ పార్వతీశం కూడా అలాగే గడప దాటి ఇంగ్లాండ్ పయనమైంది :)

    మీ టపాలో ఆసక్తికరమైన విశేషాలున్నాయి.

    రిప్లయితొలగించండి
  5. కోస్టారికా యెంత శాంతి కాముక దేశం అంటే ఆ దేశంలో సైన్యం అంటూ లేదు. అది అక్కడ నిషిద్దం.

    కోస్టారికా ని నా లిస్ట్ లో చేర్చాను,చూసిరావాలి. పేరులోనే ఒక స్టైల్ కనపడుతోంది.


    రిప్లయితొలగించండి
  6. ఫ్రపంచ జనాభాలో కాదు,జైళ్లలొ గడుపుతున్నవారిలో నాలుగవవంతు అమెరికా జైళ్లలో గడుపుతున్నరు.

    రిప్లయితొలగించండి
  7. < " కోస్టారికా యెంత శాంతి కాముక దేశం అంటే ...... "
    ఈ లైన్ మిస్సయ్యాను. శాంతి కాముక దేశం అవడం వల్లే కాబోలు అలనాడు జయంతి ధర్మతేజ గారు ఆర్ధికనేరాల విచారణ నుంచి తప్పించుకోవడానికి కోస్టారికా లో తలదాచుకున్నారు :)) సరదాగా అన్నానులెండి :) అసలు సంగతి అప్పటి కోస్టారికా అధ్యక్షుడు ధర్మతేజ గారి స్నేహితుడు (ట). అందువల్ల ఆయన ధర్మతేజ గారికి తమ దేశంలో ఆశ్రయమిచ్చాడట.

    రిప్లయితొలగించండి