(Published by "SURYA" telugu daily in it's edit page on 26-02-2015, THURSDAY)
రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, ఒక్క ఏడాదిలోనే పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు పండిత, పామరులనే తేడా లేకుండా జనాలు ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, ఒక్క ఏడాదిలోనే పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు పండిత, పామరులనే తేడా లేకుండా జనాలు ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏడాది ముందు ఏం
జరిగిందో మరపున పడిందన్న నమ్మకంతో కాబోలు, పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలు
గుర్తులేనట్టు ఈనాడు నాయకులు మాట్లాడుతున్నారు. 'మీరలా అన్నార'ని
ఒకళ్ళు అంటుంటే 'తామలా అన'నే లేదని మరొకళ్ళు బుకాయిస్తున్నారు. చట్టసభల
రికార్డుల్లో మొత్తం వ్యవహారం పదిలంగా వుందని తెలిసికూడా మొండిగా వాదిస్తున్నారు. రాజకీయ
అభినయకళ ముందు, చతుష్టష్టి కళల్లో మిగిలిన అరవై మూడూ వెలవెలబోతున్నాయి.
నిరుడు కేంద్రంలో అప్పుడున్న
కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ ఉభయసభల సమావేశాల తుది ఘడియల్లో ఆంధ్ర ప్రదేశ్ విభజన
బిల్లును తెర మీదకు తెచ్చింది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు అయిదేళ్లపాటు ప్రత్యేక
హోదా కల్పించబోతున్నట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక సభ సాక్షిగా హామీ ఇచ్చారు.
బిల్లు సానుకూలంగా నెగ్గే విధంగా చూడాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులను అభ్యర్ధించారు. ఎందుకంటే
బిల్లు ఆమోదం పొందాలంటే ప్రతిపక్ష బీజేపీ సహకారం కావాలి. 'కరవమంటే
కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' లాంటి ఆ బిల్లును అన్ని రాజకీయపార్టీలు ఇష్టం
వున్నా లేకపోయినా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం 'మమ' అనిపించి బిల్లును అప్పటికి గట్టెక్కించాయి.
బిల్లు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ఒడ్డెక్కించాయి. లోపల ఏమున్నా బయటకు మాత్రం ఈ
మొత్తం వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల పూర్తి ఆమోదంతోనో, పాక్షిక
ఆమోదంతోనో జరిగిందనడం వాస్తవం.
నిరుడు ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందో ఓసారి సింహావలోకనం
చేసుకుందాం.
పార్లమెంటు సమావేశాలు ముగియనున్న తరుణంలో నాటి కాంగ్రెస్
ప్రభుత్వం లోకసభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టింది. సీమాంధ్రకు చెందిన
కాంగ్రెస్, తెలుగు దేశం సభ్యులు నిరసన తెలుపుతున్న నేపధ్యంలో, ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేసి, మూజువాణీ ఓటుతో
బిల్లును ఆమోదింప చేశారు. హైదరాబాదు నగరాన్ని రెండు రాష్ట్రాలకు పదేళ్ళపాటు
రాజధానిగా వుంచుతూ బిల్లులో పొందుపరచిన అంశంతో విభేదిస్తూ ఎంఐఎం ప్రవేశపెట్టిన సవరణ
తిరస్కరణకు గురయింది. 'ఒక అనారోగ్య సంప్రదాయానికి తెర తీసినట్టయింద'ని ఎంఐఎం
నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం పొందిన సంబరంలో టీఆర్ఎస్
నాయకుడు చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ అజాద్ ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతున్న సమయంలోనే, 'భారత
దేశ చరిత్రలోనే ఇది చీకటి అధ్యాయం అంటూ, 'పట్టపగలే
ప్రజాస్వామ్యం ఖూనీ అవడం కళ్ళారా చూస్తున్నామ'ని
వై.యస్.ఆర్.సీ.పీ. నాయకుడు వై.యస్. జగన్ మోహన రెడ్డి
అభివర్ణించారు.
'సీమాంధ్రకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంద'ని
నాటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సభలో ప్రకటించారు.
మరునాడే రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. విభజనకు
వ్యతిరేకం కాదంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా
కల్పించాలని బీజేపీ కోరడం, అయిదు సంవత్సరాలకు మాత్రమే కాంగ్రెస్ అంగీకరించడం చచకా
జరిగిపోయాయి. బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా
తెలంగాణా ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ లో నిరసనలు మొదలయ్యాయి. సీమాంధ్ర కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు
తమ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడదే నాయకుడు నవజాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా
పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖ్యాతి దక్కించుకున్న శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తప్పుకుని సొంత పార్టీ
పెట్టుకున్నారు. దరిమిలా ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో పార్టీల తలరాతల్ని
ప్రజలు మార్చేసారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పుణ్యమే అని బలంగా నమ్మిన సీమాంధ్ర
ఓటర్లు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఇటు తెలంగాణాలో కూడా దాదాపు అదే
పరిస్తితి. తెలంగాణా తెచ్చిన పార్టీగా టీ.ఆర్.యస్. పేరు దక్కించుకుంది. కానీ తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను
ప్రజలు గుర్తించకపోవడంతో ఆ పార్టీ పని రెంటికీ చెడ్డ రేవడి చందం అయింది. కాంగ్రెస్
చేసిన రాజకీయం సీమాంధ్రలో తెలుగుదేశానికి కలిసివచ్చింది. విభజన తరువాత
రాష్ట్రాన్ని పునర్నిర్మించగల చేవ చంద్రబాబుకు వున్నదని గట్టిగా నమ్మడంతో అంతవరకూ
అన్ని సర్వేల్లో అజేయంగా ముందుకు దూసుకువెడుతున్న వై.యస్.ఆర్.సీ.పీ. ఆఖరు పరీక్షలో కుదేలయింది. ఆఖరి క్షణం వరకు
చేతికందే దూరంలో వూరిస్తూ వచ్చిన అధికారానికి దూరం అయింది.
'రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా' అన్నట్టు ప్రభుత్వాలు,
ప్రతిపక్షాలు తలచుకోవలే కానీ ఎలాటి బిల్లులయినా చిటికెలో చట్టసభల ఆమోదం పొంది చట్టాలుగా
మారతాయని అనడానికి, ఇన్ని పరిణామాలకు కారణం అయిన ఆంధ్ర ప్రదేశ్ విభజన తీరే ఒక
ఉదాహరణ.
నిరుడు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఈ బిల్లును లోక్ సభ
ఆమోదించింది. మూడో రోజునే అంటే ఇరవయ్యో తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది. మార్చి ఒకటో తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. వెంటనే దాన్ని
అధికారిక రాజపత్రం (గెజిట్)లో ప్రచురించారు. జూన్ రెండో తేదీ నుంచి ఈ చట్టం
అమల్లోకి రావడం, ఆ తేదీనుంచే సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణా, ఆంధ్ర
ప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలుగా వేరుపడడం ఆఘమేఘాలమీద జరిగిపోయాయి. పార్లమెంట్
ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా ఇవన్నీ జరిగాయి. సరిగ్గా ఏడాది తరువాత
తెరలేచిన తాజా పరిణామాలకు కూడా ఆ మహాత్ముడే సాక్షి కావడం కాకతాళీయం కావచ్చేమో!
ఈ విషయాలన్నీ గుర్తు
చేసుకోవడానికి కారణం వుంది. విభజన అనంతరం ఏర్పడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి
ప్రత్యేక హోదా కల్పించాలని ప్రస్తుతం పాత్ర మారిపోయిన కాంగ్రెస్, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీని కోరుతోంది.
ఇందుకోసం పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం ఎదుట బడ్జెట్ సమావేశాల తొలిరోజునే
కాంగ్రెస్ దీక్షా కార్యక్రమం నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతూ, ఏపీ
కాంగ్రెస్ కమిటీ కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. అయిదేళ్ళు కాదు, పదేళ్ళ ప్యాకేజీ
కోసం ఆనాడు పట్టుబట్టిన బీజేపీ ఈనాడు పాలకపక్షం పాత్ర ధరించి, ఆ హామీ విషయంలో
పాత్రోచితంగా మీనమేషాలు లెక్కబెడుతోంది.
పాత్రలు తారుమారు కావడం అంటే ఇదే కాబోలు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై
సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1969లో
తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఐదు అంశాల
ఆధారంగా ప్రత్యేక హోదా కల్పించాలని నాటి ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది. మొదటిది ఈ హోదా కోరుతున్న రాష్ట్రం పర్వత
ప్రాంతం అయివుండాలి. జన సాంద్రత తక్కువగా వుండడమే కాకుండా వున్న జనాభాలో గిరిజనుల
సంఖ్య అధికంగా వుండాలి. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రం అయివుండాలి.
ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబడి వుండడం, ఆర్ధిక పరిస్తితి నిరాశాజనకంగా
ఉండడం అనేవి కూడా ఈ హోదా పొందడానికి ఉపకరిస్తాయి. పోతే ప్రధాన మంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి
మండలి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.
చివరి రెండు అంశాలు మినహా ఈ హోదా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే నిబంధనలు ఏవీ లేవు.
మొదట అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చారు.
ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు లభిస్తాయి. మొత్తం కేంద్ర సాయంలో ముప్పయి శాతం నిధులు ఈ పదకొండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన డెబ్బయి శాతం నిధులను తతిమ్మా రాష్ట్రాలు అన్నీ కలిసి పంచుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి.
చివరి రెండు అంశాలు మినహా ఈ హోదా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే నిబంధనలు ఏవీ లేవు.
మొదట అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చారు.
ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు లభిస్తాయి. మొత్తం కేంద్ర సాయంలో ముప్పయి శాతం నిధులు ఈ పదకొండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన డెబ్బయి శాతం నిధులను తతిమ్మా రాష్ట్రాలు అన్నీ కలిసి పంచుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి.
ఇన్ని వెసులుబాట్లు వున్నాయి కనుకనే బీహారు మొదలయిన రాష్ట్రాలు
ఈ ప్రత్యేక హోదా సాధన కోసం పట్టుబడుతున్నాయి. రెండేళ్ళ క్రితం బీహారు ముఖ్యమంత్రి శ్రీ
నితీష్ కుమార్ ఏకంగా ఢిల్లీలోనే అధికారికంగా ఆందోళన నిర్వహించారు. అయినా ప్రత్యేక
హోదా ఇచ్చేందుకు కేంద్రం సుతరామూ అంగీకరించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎన్నో
ఇబ్బందులు వున్నాయని బాగా తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఆ హోదా
ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా ఆందోళనలకు దిగడం విడ్డూరం. అలాగే ఈ వాస్తవం ఎరిగుండీ
ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ నాయకులు కూడా అదేవిధమైన హామీలు ఇస్తూ పోతుండడం మరో
విడ్డూరం. అన్నీ తెలిసినవాళ్ళే ఈ విషయంతో రాజకీయ క్రీడ ఆడుతుంటే, కొత్తగా
రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సయితం ప్రత్యేక హోదా సంగతి ప్రస్తావిస్తూ,
అన్యాపదేశంగా బీజేపీ, టీడీపీలకు హెచ్చరికలు
చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం వీటిని మించిన విడ్డూరం. ఇక ఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది మరింత విచిత్రమైన పరిస్తితి. ఆయన పాలనలో వున్న
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనేది అందరికంటే ఆయనకే ఎక్కువ అవసరం. అందుకే ఆయన
అనేకసార్లు హస్తిన ప్రయాణాలు కట్టారు. ఎక్కిన గడప దిగిన గడప చందంగా కలుసుకోవాల్సిన
వాళ్ళను కలుసుకున్నారు. శాయంగల విన్నపాలు చేశారు.
కానీ ఫలితం పూజ్యం. కనీసం రాష్ట్రపతి ప్రసంగంలో అన్నా ప్రత్యేక హోదా
ప్రస్తావన వుంటుందని అనుకుంటే అదీ నిరాశే అయింది. పార్లమెంటు సమావేశాలముందు
ఆనవాయితీగా నిర్వహించే పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో కూడా ఆయన ఈ విషయంలో
గట్టి ప్రయత్నం చేయమని కోరినట్టు పత్రికల్లో వచ్చింది. స్వయంగా అధినాయకుడి
ప్రయత్నాలకే దిక్కు లేకపోయినప్పుడు పార్టీ ఎంపీలు మాత్రం ఏం చెయ్యగలుగుతారు?
మామూలుగా అయితే, ఆత్మ గౌరవం నినాదం కలిగిన తెలుగు దేశం పార్టీకి ఇది చక్కని అదును.
కానీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది మిత్ర పక్షం కావడంతో ఏమీ పాలుపోని స్తితి. మింగలేని
కక్కలేని పరిస్తితి.
ఉపశ్రుతి: నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక
హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి అన్నారో ఏవిటో తెలియదు కాని, సీమాంధ్రకు బుందేల్‌ఖండ్
తరహాలో ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ హోదాకింద బుందేల్‌ఖండ్‌కు
దక్కిందెంతో తెలుసా? ప్రకటించింది
7,266 కోట్ల రూపాయలయితే, వాస్తవంగా ఇచ్చింది కేవలం 3,450 కోట్లే.
(25-02-2015)
NOTE: Courtesy
Image Owner
ఆంద్ర రాష్ట్రానికి ప్రత్యెక ప్రతిపత్తి ఇవ్వడానికి కావాల్సిన ఒక్క "అర్హత" కూడా లేదు. ఈ విషయం వెంకయ్య నాయుడికి తెలీదని అనుకోలేము.
రిప్లయితొలగించండిఎదవ తొక్కలో ముక్కలా నీకు నీ కచరా గాడికి బుద్ది జ్ఞానం ఉండదు రా. మీవి నోళ్లా కుప్ప తోట్టేలా. మీకు మీ స్టేట్ వచ్చినాక కూడా పక్కనోళ్ళ పడేడ్చే పని తప్ప ఇంకోటి లెదు. థర్డ్ గ్రేడ్ fithy గాళ్ళాలారా మరెందుకురా మగ్గవాలా అని ఏడుస్తురు .
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమరి వెంకయ్య కి తెలిసినంత కెసీఆర్ కి తెలియక పొయిందే !!
http://timesofindia.indiatimes.com/city/hyderabad/KCR-meets-PM-seeks-special-status-for-Telangana/articleshow/41893822.cms
భరత్ గారూ, ప్రత్యెక ప్రతిపత్తి రాదని వెంకయ్య కెసిఆర్ గార్లు ఇద్దరికీ తెల్సు. తేడా ఏమిటంటే తాము గెలిచాక పదేళ్ళు హోదా ఇప్పిస్తామని నాయుడు గారు నమ్మబలికారు, కెసిఆర్ అటువంటి మాట ఇవ్వలేదు.
రిప్లయితొలగించండితొక్కలో ముక్కలా ఆ నాయుడికి నువ్వు నీ కచరా డోరా చెప్పందే ఏమి తెలుస్తాది. గందుకే అట్లాన్నాడు, మొన్న మీ కవితక్క పార్లమెంట్కు ట్రైన్లో పోతా పక్క సీట్లో కూసోని నువ్వు చెప్పినావాని నాలుగు ముక్కలు చెప్పినాకాగాని తెల్వలేదంట.
రిప్లయితొలగించండిఇట్టా జనాల మీద పది ఏడిసేటోనికి ఎట్టాంటి సావోత్తదో ఎవడన్నా సెపితే బాగుండు జర.
ఇంతకీ ఇక్కడ విష్యం యేమిటి?ఒక రాష్త్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది స్వతంత్రం వచ్చిన వెంతనె లేదు!
రిప్లయితొలగించండికొంత కాలం తర్వాత అవసరాన్ని బట్టి ప్రత్యేక హోదా ఇవ్వటానికి కొన్ని కారణాలు చూపిస్తూ ఒకప్పటి కేంద్రప్రభుత్వం ఒక సాంప్రదాయాన్ని కొత్తగా మొదలు పెట్టింది?
ఇప్పుదు ఆంధ్రపరదేస్ ఆ ప్రాతిపదికల కింద రాదని తెలిసినా యెందుకు ఒక ప్రధానమంత్రి ఆ ప్రకతన చేశారు?ఆంధ్రప్రదేస్ రాజధాని కూడా లేకుండా అందరూ కలిసి పెంచిన హైదరాబాదు ఆదాయంలో చిల్లికాణీ కూడా ఇవ్వకుండా లోతు బడ్జెట్ నెత్తిమీఎదకి తెస్తూ మాత్ర్రాష్ట్రం అని కూడా అనకుండా అవశేషం అనై వాళ్లే వెక్కిరిస్తూ విదిలించారు గాబట్టి!
ఈ ప్రత్యేక పరిస్థితికి గుర్తింపు లేకపోతే ఆ విభజన అన్యాయంగా రాజ్యాంగ విరుధ్ధంగా జరిగినట్టు కాదా?!
రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికిల్ మూడుతో దుర్మార్ఫంగా విదగొట్టమనే చెప్పిందా?ఇప్పటి ఆంధ్రప్రాదెస్ ప్రజానీకాన్ని తమ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులంతా యెదవలై ఒక దుర్మార్గమైన యేకపక్ష విభజనని తమ మీద రుద్దితే కనీసం ఇచ్చిన హామీలని కూడా సాంకేతిక కారణాలు చూపించి నెరవేర్చకుండా అన్యాయం చెయ్యమని చెప్పిందా!
మానవతవం లేని కబుర్లు చెప్పకు గొట్టి ముక్కల రాక్షసుడా!
"సుర"నేని గారూ, ప్రత్యెక ప్రతిపత్తి అనే సంప్రదాయం స్వాతంత్ర్యం తరువాత వచ్చినా అది నిర్దిష్టమయిన జెన్యున్ ప్రాతిపదికల ప్రకారమే ఇచ్చారన్నది నిర్వివాదాంశం. పోనీ మీకు ఏ అంశం మీద అభ్యంతరం ఉందో చెప్పండి చర్చించవచ్చు.
రిప్లయితొలగించండిఒక రాష్ట్రం రాజధాని (లేదా ఇతర నగరం/ప్రాంతం) ఆదాయంలో వేరే రాష్ట్రాలకు వాటా ఇచ్చిన దాఖలా మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడయినా ఉందా? తెలిస్తే చెప్పండి విని తరిస్తాను.
బడ్జెటు లోటు తప్ప మిగిలిన అన్ని ఆర్ధిక పారామీటర్లు బాగానే ఉన్న ఆంద్ర బీద రాష్ట్రం కానేరదు. దీనికి సంస్థాగత చర్యలు చేపట్టాలి తప్ప బీద అరుపులు అరిస్తే ఒరిగేది ఏమీ లేదు.
ఆర్టికల్ 3 కింద వచ్చిన చట్టానికి ఇలాంటి విషయాలకు ఎటువంటి సంబంధం లేదు. This is by no means "supplemental, incidental or consequential" to the purpose of the act.
ఆర్ధిక సూత్రాలను విస్మరించి ప్రవర్తించడమే మానవత్వం అంటే వినడానికి బానే ఉంది కానీ జరగదు.
తొక్కలో ముక్కలా చెప్పాగా నీది నీ కచరా గాడిది నోరు కదని. అవి మూసి కన్నా పెద్ద మురుగుగుంటలు .
రిప్లయితొలగించండిఎవడి ఆర్ధిక సూత్రాలు పాటించమని ఏడుస్తావు, అవి ప్రతిపాదించిన సంస్థలే లేనప్పుడు. నీ మెరుగుడు ఆపి పని నీ పని నువ్వు చూసుకో, నీ మొక్కులు నువ్వు పాటించుకో . ఈ ఎదవకి వాడి దొర చేసింది ప్రజాభీష్టం కోసం పక్కన స్టేట్ వాళ్ళు అడిగేది మాత్రం వాళ్ళ ప్రజాభీష్టం కోసం కాదు. ఏరా నువ్వు నీ థర్డ్ గ్రేడ్ దొర తప్పితే మిగిలినోళ్ళు ప్రజలు కాదా. ఎదవ తెలివితేటలు చాలిక ఆపు నీ సొల్లు.
ఎదవా ఎలా సంబంధం లేదురా అదే బిల్లులో స్టేట్ విదిగోడితే సమ్మగా ఉందిగానీ ఇది మాత్రం సంబంధం లేదు. ఈ రాష్ట్రం అప్పనంగా పక్కనోళ్ళ శ్రమని కూడా అప్పనంగా దొబ్బి తిన్తందిరా మీలాగా దున్నపోతుల్లారా .
మనసుంటే మార్గం ఉంటుందని సామెత. మనసులేకనే యీ వంకరటింకర మాటలన్నీ!
రిప్లయితొలగించండిఆంధ్రకు ప్రత్యేకహోదా ఇవ్వటానికి ఏవో రూళ్ళు అడ్డం వస్తున్నాయంటున్నారు, కానీ ఆ రూళ్ళేమన్నా శిలాక్షరాలా?
రాజ్యాంగాన్ని మార్చి అయినా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని కోరిన నోళ్ళు కానీ యితరులు కానీ నేడు ఆంధ్రకు ఏవో రూళ్ళు అడ్డు - అర్హత లేదు అని రాగాలాపనలు ఎందుకు చేయాలీ?
భారతరాజ్యాంగాన్ని సవాలక్షసార్లు సవరణలు చేసుకున్న మనకు, అవసరమైతే ఒక అడ్డదిడ్డంగా ఉన్న చట్టాన్ని మార్చుకోవటం అనేది అంత అసంభవమైన వ్యవహారంలాగా అవుతోందీ? ఎందుకు కేవలం తిరస్కారపూర్వకంగానే మాట్లాడుకోవాలీ కడుపుల్లో కక్షలు లేకపోతే?
ఆంధ్రప్రజలను మోసం మీద మోసం చేయటానికి తప్ప ఈ రాజకీయాలు మరెందుకూ కాదు.
కాంగ్రెసు విధానాలనే అనుసరించి పిచ్చిపిచ్చి మోసాలకు దిగితే భాజపాకూ త్వరలోనే కాంగ్రెసుకు పట్టిన గతో అంతకన్నా మరింత అధోగతో తప్పకుండా పడుతుందన్నది మాత్రం పరమసత్యం.
@శ్యామలీయం:
రిప్లయితొలగించండితెలంగాణా రాష్ట్రం ఇవ్వడానికి రాజ్యాంగం మార్చలేదు, మార్చాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. 1953లొ ఆంద్ర రాష్ట్రం ఎలా ఇచ్చారో ఇదీ అంతే.
మీరు స్వయంగా ప్రత్యెక ప్రతిపత్తికి ఉన్న మార్గదర్శకాలు చదవండి, వాటిలో మార్పులు అవసరం అనిపిస్తే సూచించండి. అంతేతప్ప నిరాధారంగా వాటిని "అడ్డదిడ్డం" అనడం ఎంతవరకు సబబు?
రాజ్యాంగం మరియు వివిధ చట్టాలు అనేకసార్లు మార్చారు నిజమే. కేవలం ఈ నెపంతో సహేతుకమయిన కారణాలు లేకుండా కేవలం ఒక వర్గానికి అయాచిత లాభం చేకూర్చాలని మార్పులు చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా వెనుక బడిన రాష్ట్రానికి ఇవ్వని హోదా అన్ని రంగాలలో ముందున్న వారికి ఇవ్వడం దేశ ప్రయోజనానికి మంచిదా?
వాళ్ళెవరో చెప్పారు కాబట్టి ఇచ్చే తీరాలని ఈనాడు గొంతు చించుకొనే బదులు ఆనాడే వారి బూటకపు వంచనతో కూడిన వాగ్దానాలను తిరస్కరించి ఉంటె బాగుండేది కదా.
తెలంగాణా రానే రాదనీ, తాము ఆపుతామని ఆంద్ర నాయకులు చెబుతూ వచ్చారు. తీరా తెలంగాణా వచ్చాక ఇదే వ్యక్తులు మళ్ళీ ఏవో శుష్కాలోచనలు (ప్రత్యెక ప్రతిపత్తి, బడ్జెటు లోటు భర్తీ, సింగపూరును తలదన్నే రాజధాని, పోలవరం ప్రాజెక్టు వగైరా) తెరపైకి తెచ్చారు. రెండోసారి కూడా వారిని గుడ్డిగా నమ్మేస్తామంటే ఎలా?
పోరా గూట్లే నిన్నెవడు నమ్మమన్నాడు. నీ దొర కల్మోక్కుకో . ఆడు చెప్పింది ఈడ కాపీ పేస్ట్ చెయ్యి ఒక బిల్డింగ్ కట్టి నీక్కోడా ఇస్తాడు. ఎదవ రూల్స్ ప్రకారం ఇచ్చారు నీ పాగల్ స్టేట్ . ఎవడికి జెప్తావు రా ఎదవ. రూల్స్ ప్రకారం ఇస్తే కరెంట్ తీసి లైవ్ ఆపి, తలుపులు మూసి ఈయాల్సి మరీ ఈయ్యల్సి వచ్చిన్దా. మీరు మీ ఏసాలు దేశం మొత్తం తెలుసు ఇహ ఆపు ఎదవ సోది .
రిప్లయితొలగించండి@ గొట్టిముక్కల ,
రిప్లయితొలగించండి[తీరా తెలంగాణా వచ్చాక ఇదే వ్యక్తులు మళ్ళీ ఏవో శుష్కాలోచనలు (ప్రత్యెక ప్రతిపత్తి, బడ్జెటు లోటు భర్తీ, సింగపూరును తలదన్నే రాజధాని, పోలవరం ప్రాజెక్టు వగైరా) తెరపైకి తెచ్చారు. రెండోసారి కూడా వారిని గుడ్డిగా నమ్మేస్తామంటే ఎలా?]
అయితే మొత్తానికి ఆంధ్ర జనాలని మోసం + మాయ చేసి మీ బంగారు తెలంగాణా సాధించుకున్నారని అ ఒప్పుకున్నరన్నమాట . గుడ్ అదే మాట మీద ఉండండి ఇహ ముందు కూడా.
"అయితే మొత్తానికి ఆంధ్ర జనాలని మోసం + మాయ చేసి మీ బంగారు తెలంగాణా సాధించుకున్నారని అ ఒప్పుకున్నరన్నమాట . గుడ్ అదే మాట మీద ఉండండి ఇహ ముందు కూడా"
రిప్లయితొలగించండిఆ మాటలు చెప్పింది మీ వాళ్ళు సార్.
@ గొట్టిముక్కల
రిప్లయితొలగించండిDoes it really make any difference?
అంటే మాటలు మీవాళ్ళు చేపితేనేమి, మావాళ్ళు చేపితేనేమి? మమ్మల్ని మాయ + మోసం చేసే కదా మీ బంగారు తెలంగాణా సాధించారు . అయినా మీ బాస్ / చీఫ్ / సుప్రీమ్ మాటలముందు మావాళ్ళ మాటలు ఎంత? గడియ కొక మాట చెప్పగల దిత్త. ఇహ వాటికి వత్తాసు పలికి ఆవో అద్భుత సత్యాలు అన్నట్లు నమ్మచూసే మీలాంటి సైన్యం వీటి ముందు మావాళ్ళ మాటలు ఎంత? అసలు నిజానికి పేరుకి మావాళ్ళే గాని మీ దోస్తులే కదా. మీ సుప్రీమ్ గారికి ఇప్పుడు వాలు లేని పొద్దు గడుస్తునట్లు లేదు, ఇహ ఆయనకి పని ఉంటె మీకు కూడా దేవుళ్ళే వాఅల్లు. ఎటొచ్చి పొట్ట చేత పట్టుకుని వచ్చి నాలుగు చుక్కలు చెమట రాల్చిన వాడు మాత్రం మీకు దొంగలు .
ఏదైతే ఏమి లెండి మొత్తానికి మాటలు ఎవరు చెప్పిన మమ్మల్ని మోసం చేసి మీ కోరిక మాత్రం తీర్చారు . అందుకే ఈరోజు మీరు ఎన్ని అడ్డదిడ్డమైన వాడనలన్నా చేయగలరు. కానీ రోజులు ఎప్పుడు ఒకేరకంగా ఉండవు అనేది చరిత్ర చెప్పీ నిజం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజైగారూ,
రిప్లయితొలగించండిఅడ్డదిడ్డం అన్న మాట మీకు నచ్చలేదు. సరే. కొండప్రాతాలకే అంటూ ఉన్న మర్గదర్శకం తప్పు కాదా? మైదానప్రాంతం ఐనా ఏదైనా కారణం వలన వవెనుకబడకూడదా మరి? రాజ్యాంగం మార్చటానికి సహేతుకమైన కారణం కావాలన్న మాట బాగుంది. మరి ఉద్యమకాలంలో రాజ్యాంగం మార్చి ఐనా ఇవ్వాల్సిందే అని కేకలు వినిపించినప్పుడు ఎవరూ ఈ పాయింటు లేవనెత్తలేదేమీ? ఆంధ్రా అన్నిరంగాల్లో ముందున్నదీ అని అనటంలో మీ ఉద్దేశం, ఉద్యోగుల జీతభత్యాలకే డబ్బుల్లేని పరిస్థితి అంతా నాటకం అనటమేనా? ఆర్థికేతరవిషయాల్లో ఎక్కడన్నా ముందుంటే అది పరిగణనీయాంశం కాదు ఆర్థిక సాయం విషయంలో. మీరే 'బడ్జెటు లోటు తప్ప మిగిలిన అన్ని ఆర్ధిక పారామీటర్లు బాగానే ఉన్న ఆంద్ర బీద రాష్ట్రం కానేరదు. దీనికి సంస్థాగత చర్యలు చేపట్టాలి' అన్నారు కదా, అట్టిదశకు వచేదాకా సాయపడమని అడగటం తప్పా? గొంతులు చించుకుంటున్నారు అనకండి. తెలంగాణా కోసం కొందరు నాయకులు ఇంకా ఎక్కువగానూ కొండొకచో దుర్వాక్యాలూ దుర్భాషలతోనూ గొంతులు చించుకున్నది మరచిపోరాదు మనం. ఇకపోతే శుష్కాలోచనలు అన్నది నిజమేనేమో ఎందుకంటే నమ్మి మోసపోవటం ఆంధ్రులకు అలవాటే. ఇవన్నీ నేను వాదనకోసం చెప్పలేదు. ఇంకా ఆంధ్రా ఎండీ చెడీ నాశనం కావాలని కోరని పక్షంలో బీదదైనా సరే ఆంధ్రాకు సాయం తప్పు లాంటి అర్థం వచ్చే అవకాశం ఇచ్చే మాటలను దయచేసి అనకండి. ఇంతే నా విన్నపం.
@శ్యామలీయం:
రిప్లయితొలగించండినేను అడ్డదిడ్డం అనే పదాన్ని తప్పు పట్టలేదండీ. మీకు తప్పనిపించిన మార్గదర్శకం ఏమిటో చెప్పకుండా పథకాన్నే అడ్డదిడ్డం అనడం సరి కాదన్నాను.
తెలంగాణా ఉద్యమంలో రాజ్యాంగం మార్చాలి అన్న తెలంగాణా వాదులు ఉన్నట్టు నాకయితే గుర్తు లేదు. రాజ్యాంగం మార్చనిదే తెలంగాణా ఇవ్వలేరని కొందరు తెలంగాణా వ్యతిరేకులు వాదించారు. ఆ వాదనను నాతొ సహా పలువురు పూర్తీ ఆధారాలతో తిప్పి కొట్టాము.
Liquidity & financial health మధ్య తేడా మీలాంటి పెద్దలకు నేర్పించే సాహసం చేయను. నాకు తెలిసి ఆంద్ర బడ్జెటు లోటు కేంద్ర ప్రభుత్వం పెట్టిన లోటు:జీడీపీ టార్గెట్ లోపే ఉంది. I do not believe Andhra suffers from chronic financial disability. మీరు కావాలంటే వివరాలు చూసి ద్రువీకరించే ప్రయత్నం చేస్తాను.
తాత్కాలిక ఇబ్బందుల నుండి ఊరట ఇవ్వాలి కరెక్టే. దానికి ప్రత్యెక ప్రతిపత్తి మార్గమే వాడాలని పట్టు పట్టలేము. అంతేకాక ఆంద్ర ప్రభుత్వ విధానాలు (ఉ. ఉద్యోగులకు 43% వేతనం పెంపు) అలాంటి సాయాన్ని ప్రోత్సాహించే విధంగా కూడా లేవు. Andhra government measures do not inspire confidence that such support will be effectively utilized. The entire approach reeks of entitlement culture.
నాకు ఆంద్ర అయినా బిహార్ అయినా ఒకటే. ఎవరికి నిజంగా సహాయం అవసరమో అనే అభిప్రాయం ఆబ్జెక్తివుగానె వస్తాను.
కొండ ప్రాంతాలకు ప్రెఫరెన్స్ ఇవ్వోద్దన్నారు మీ అభిప్రాయం మీది. ఒకవేళ వాదన కోసం ఒప్పుకున్నా ప్రస్తుత సమస్యకు ఇది అడ్డు కాదు.
@అజ్ఞాత:
రిప్లయితొలగించండిI always maintained Telangana formation is a historical inevitability. I also said right from the beginning that andhra is not "eligible" for SCS. You chose to believe Andhra "leaders" who spoke the opposite.
తమరు ఏది చెప్తే అది inevitable అనా అర్ధం ?! మరి ఆ లెక్కన ఇక్కడ ఈ బ్లాగ్ లోకం లో తమఋ చాలానే నోరు పారేసుకున్నారే ? మరి అవన్నీ ఎందుకు పాటించటం లేదు? మీరంతా కెసిఆర్ ఏది చెబితే అది నమ్మితే ఏది రైట్ అన్నమాట, బాంచెన్ డోరా మొక్కితే అది చాలా చాలా మంచి అన్నమాట. వెల్ మీరు కూసిన 'కారు ' కూతలు ఇక్కడ ఎవరు మర్చిపోరు. అలాగే మేము ఏది నమ్మాలో చెప్పే పని మీకు లేదు.
రిప్లయితొలగించండిmind you own state business. అచ్చమైన మీ మాటల్లో చెప్పాలంటే 'నువ్వేవని' మా సంగతి మాట్లడనీకి ?
జైగారూ,
రిప్లయితొలగించండి> "కొండ ప్రాంతాలకు ప్రెఫరెన్స్ ఇవ్వోద్దన్నారు మీ అభిప్రాయం మీది."
మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. 'కేవలం కొండప్రాతాలకే' అంటూ ఉన్న మర్గదర్శకం తప్పు కాదా అన్నాను. నిజమే, కొండప్రాంతాలు మాత్రమే అన్నప్పుడు preference ఏమిటీ? Choice ఏమీ లేనే లేదు కదా. ఆర్థికమైన వెనుకబాటుతనం అనేది ప్రాతిపదికగా తీసుకోవాలి కాని నైసర్గికత ఫలాని విధంగా ఉండాలీ అనటం అసమంజసమే అని మరో సారి కూడా నా అభిప్రాయంగా అంటున్నాను.
మీ దృష్టిలో 'కేవలం కొండప్రాంతాలకే' అన్న నిబంధన సబబే కావచ్చును. ఇంక మనం ఈ విషయంలో ప్రత్యేకించి తర్కించవలసినది కనబడదు.
శ్యామలీయం మాస్టారూ,
రిప్లయితొలగించండి"'కేవలం కొండప్రాతాలకే' అంటూ ఉన్న మర్గదర్శకం తప్పు కాదా అన్నాను"
మార్గదర్శకం అది కాదండీ. Hilly/difficult terrain ఉండడం *కూడా* పరిగణలో తీసుకోవాలని చెబుతుంది.
"ఆర్థికమైన వెనుకబాటుతనం అనేది ప్రాతిపదికగా తీసుకోవాలి కాని నైసర్గికత ఫలాని విధంగా ఉండాలీ అనటం అసమంజసమే అని మరో సారి కూడా నా అభిప్రాయంగా అంటున్నాను"
Each parameter in the guideline is either an indicator of chronic fiscal disability or bears a strong demonstrated correlation.
Your misapprehensions is probably due to not having read the guidelines yourself. I submit relying on motivated and/or uninformed third parties is not conducive to informed thinking.
@ Gottimukkala,
రిప్లయితొలగించండిStop your stupid preachings here, it is none of your business. Here we all know how idiot you are. So don't get too excited to show your peak insanilty levels.
Hey, btw don't you get any stupid circular related to this issue from Dilip yet? GO and put pressure on his for the same, then your life will be easy. What say?
#IDIOTS
@శ్యామలీయమ్ గారు,
రిప్లయితొలగించండిStop arguing with this idiot and don't entertain this stupid.
మీకు తెలియదు అది వరకు కొణతం దిలీప్ అని ఇలానే మొరిగేవాడు యెల్లో మీడియా అనుకుంటూ, వాగి వాగి ఇప్పుడు తెలంగాణా గవర్నమెంట్ లో డైరెక్టర్ పోస్ట్ దొబ్బాడు అదే పచ్చ మీడియా ని నాక్కుంటూ ఇప్పుడు. ఆ దిలీప్ చెంచాలు వీళ్ళు ఇక్కడ అలాంటి వోదురు బొతు కోతలు కూసి ఏదో ఒక లాభం పొందటం వీళ్ళ లక్ష్యమ్. దానికి మీరు చక్కగా హెల్ప్ చెస్తున్నారు .
Cut oxyzen to these morans.
ఈ గొట్టిముక్కల ఆత్రం జూస్తంటే మహా నవ్వొస్తాది. లోక్ సత్తా పార్టీ ఆంధ్ర అగ్ర కుల అహంకార పార్టీ. ఆ పార్టీ అధినేత చేసిన నియమాలు మాత్రం ఈల్లకి శిరోధార్యం. ఆ మనిషిని మాత్రం అసెంబ్లీ లో కొట్టించి సిగ్గు ఎగ్గు లేకుండా బోర విరుచుకుంటా టీవీ లలో, బాగుల్లో అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతుంటారు. తన సంగతి తను జూసుకుంటే ఒక కన్ను పోయింది పక్కనోడికి పడేసిస్తే రెండు కళ్ళు పోయయన్నా యవ్వారం గురొస్తది ఈల్ల యవ్వారం జూస్తుంటే :-) కానియ్యిరి ఇలానే మేరుగుతా ఉండండి.
రిప్లయితొలగించండి